మహిళలు మూడు పదుల వయసు వచ్చేటప్పటికీ శరీరంలో కొవ్వు పేరుకుపోయి, అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. పైగా ఈ ఏజ్‌లోనే రకరకాల దీర్ఘవ్యాధుల బారినపడుతుంటారు చాలామంది. దీనికి చెక్‌పెట్టేలా ఫిట్‌గా ఉండాలంటే రోజువారి దినచర్యలో ఈ వ్యాయామాలను భాగం చేసుకోవాల్సిందే. బరువు తగ్గించే ప్రయాణంలో సమతుల్యమైన ఆహారంతో కూడిన డైట్ ఎంత ముఖ్యమో అలానే శరీరం ఫిట్‌గా ఉండేందుకు ఈ వ్యాయామాలు అంత అవసరం. ఆ వ్యాయమాలేమిటో చూద్దామా..!
కార్డియో వర్కౌట్‌లు: ఇది అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్ రోప్ వంటి కార్డియో వ్యాయామాలను డైలీ లైఫ్‌లో భాగం చేసుకుంటే ఈజీగా కేలరీలు బర్న్ అవుతాయి. బహుళ కండరాలు ఈ వ్యాయమంలో నిమగ్నమవ్వడంతో హృదయ ఆరోగ్యం మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా శరీర కొవ్వును తగ్గించడంలోనూ, కేలరీల లోటును సృష్టించడానికి సహాయపడతాయి. ఇవి మనిషికి ఓర్పు, సమన్వయం, చురుకుదనాన్ని అందిస్తాయి.
హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్‌ఐఐటీ): ఇది హృదయ స్పందన రేటును పెంచేలా చేసే వ్యాయామం. ఇది కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తుంది. ముఖ్యంగా పర్వతారోహకులకు ఉపయోగపడే డైనమిక్ వ్యాయామం. ఇది జీవక్రియను పెంచి మొత్తం కొవ్వును కరిగేలా చేస్తాయి.
వెయిల్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు: స్క్వాట్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుష్ అప్‌లు వంటి వ్యాయామాల్లో కూడా బహుళ కండరాలు నిమగ్నం అవుతాయి. శరీర కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ప్రభావవంతమైన వ్యాయమాలు.
జుంబా: వేగవంతంగా చేసే వ్యాయామాలు. ఓ ఆహ్లదభరితమైన వ్యాయామం ఇది. పూర్తి శరీరీ కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండటమే గాక కేలరీలను బర్న్‌చేసి కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది. ఇవి శరీర కొవ్వుని సులభంగా కరిగించేస్తాయి.
యోగా: యోగా అనేది చాలా పురాతనమైన అభ్యాసాలలో ఒకటి. ఇది మానవుల జీవనశైలి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అంతేగాదు దీనిలో వివిధ శరీర భాగాలలో కొవ్వును కరిగించడానికి సహాయపడే నిర్దిష్ట యోగా ఆసనాలు ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల క్రమరహిత యోగా 30 ఏళ్లు పైబడిన స్త్రీలలో ప్రశాంతతను తీసుకురావడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువు నిర్వహించడం అనేది క్రమంతప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, చక్కటి జీవనశైలి అనుసరించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అలాగే లావు తగ్గేందుకు స్పాట్ రిడక్షన్ వ్యాయామాలు అంటూ ఉండవనే విషయం గుర్తించుకోవాలి. ఆరోగ్యంగా ఉండేలా మంచి ప్రణాళికతో కూడిన వ్యాయామాలపై దృష్టిసారించడం ముఖ్యం అని గ్రహించాలి.
(చదవండి: సమ్మర్ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు! నెటిజన్లు ఫిదా)
Comments
Please login to add a commentAdd a comment