Health and Ageing
-
ఈ వ్యాయామాలతో కొవ్వు కరిగి స్లిమ్‌గా అవ్వుతారు!
మహిళలు మూడు పదుల వయసు వచ్చేటప్పటికీ శరీరంలో కొవ్వు పేరుకుపోయి, అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. పైగా ఈ ఏజ్‌లోనే రకరకాల దీర్ఘవ్యాధుల బారినపడుతుంటారు చాలామంది. దీనికి చెక్‌పెట్టేలా ఫిట్‌గా ఉండాలంటే రోజువారి దినచర్యలో ఈ వ్యాయామాలను భాగం చేసుకోవాల్సిందే. బరువు తగ్గించే ప్రయాణంలో సమతుల్యమైన ఆహారంతో కూడిన డైట్ ఎంత ముఖ్యమో అలానే శరీరం ఫిట్‌గా ఉండేందుకు ఈ వ్యాయామాలు అంత అవసరం. ఆ వ్యాయమాలేమిటో చూద్దామా..!కార్డియో వర్కౌట్లు: ఇది అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్ రోప్ వంటి కార్డియో వ్యాయామాలను డైలీ లైఫ్‌లో భాగం చేసుకుంటే ఈజీగా కేలరీలు బర్న్ అవుతాయి. బహుళ కండరాలు ఈ వ్యాయమంలో నిమగ్నమవ్వడంతో హృదయ ఆరోగ్యం మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా శరీర కొవ్వును తగ్గించడంలోనూ, కేలరీల లోటును సృష్టించడానికి సహాయపడతాయి. ఇవి మనిషికి ఓర్పు, సమన్వయం, చురుకుదనాన్ని అందిస్తాయి. హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ): ఇది హృదయ స్పందన రేటును పెంచేలా చేసే వ్యాయామం. ఇది కేలరీలను సమర్థవంతంగా బర్న్ చేస్తుంది. ముఖ్యంగా పర్వతారోహకులకు ఉపయోగపడే డైనమిక్ వ్యాయామం. ఇది జీవక్రియను పెంచి మొత్తం కొవ్వును కరిగేలా చేస్తాయి. వెయిల్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు: స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుష్ అప్లు వంటి వ్యాయామాల్లో కూడా బహుళ కండరాలు నిమగ్నం అవుతాయి. శరీర కొవ్వును తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ప్రభావవంతమైన వ్యాయమాలు. జుంబా: వేగవంతంగా చేసే వ్యాయామాలు. ఓ ఆహ్లదభరితమైన వ్యాయామం ఇది. పూర్తి శరీరీ కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉండటమే గాక కేలరీలను బర్న్చేసి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ను మెరుగుపరుస్తుంది. ఇవి శరీర కొవ్వుని సులభంగా కరిగించేస్తాయి. యోగా: యోగా అనేది చాలా పురాతనమైన అభ్యాసాలలో ఒకటి. ఇది మానవుల జీవనశైలి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అంతేగాదు దీనిలో వివిధ శరీర భాగాలలో కొవ్వును కరిగించడానికి సహాయపడే నిర్దిష్ట యోగా ఆసనాలు ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 నిమిషాల క్రమరహిత యోగా 30 ఏళ్లు పైబడిన స్త్రీలలో ప్రశాంతతను తీసుకురావడానికి, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువు నిర్వహించడం అనేది క్రమంతప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, చక్కటి జీవనశైలి అనుసరించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అలాగే లావు తగ్గేందుకు స్పాట్ రిడక్షన్ వ్యాయామాలు అంటూ ఉండవనే విషయం గుర్తించుకోవాలి. ఆరోగ్యంగా ఉండేలా మంచి ప్రణాళికతో కూడిన వ్యాయామాలపై దృష్టిసారించడం ముఖ్యం అని గ్రహించాలి. (చదవండి: సమ్మర్ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు! నెటిజన్లు ఫిదా) -
46లో అలా.. 64లో ఇలా.. అలా ఎలా?
కొన్ని కొన్ని విషయాలు డాక్టర్లు కాదు.. పేషేంట్లు చెబితేనే బాగా అర్థమవుతాయి. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశారు ఇయాన్ క్లార్క్. ట్విట్టర్లో ఆయన పంచుకున్న అంశాలు .. కచ్చితంగా మనకు ఆరోగ్య రహస్యాలెన్నో చెబుతాయి. నాకప్పుడు 46 ఏళ్లు అధిక బరువుతో బాధ పడ్డాను ఏడాదికి మూడు సార్లు ఏదో ఒక జబ్బు వచ్చేది వీపరీతమైన నిరాశ, నిస్పృహాల్లో మునిగిపోయేవాడిని జుట్టు వేగంగా ఊడిపోయేది నాకిప్పుడు 64 ఏళ్లు ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా ఎలాంటి రోగాలు, జబ్బులు లేవు సంతోషంగా ఉన్నాను నాకు గుండు ఏమాత్రం కనిపించనంతగా పూర్తి స్థాయిలో వెంట్రుకలున్నాయి. అసలేం జరిగింది? ఈ 46 నుంచి 64 ఏళ్ల మధ్య కాలంలో నేను ఏం చేశాను? అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారడానికి నేను పడ్డ కష్టమేంటీ? ముందుగా నేను ఏ డాక్టర్‌ను కలవలేదు. ఎలాంటి మందులు వాడలేదు. అసలు హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోలేదు. నేను చేసిన పనులేంటో మీరే చదవండి. 1. ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు నా ఆరోగ్యం బాగుండడానికి నేను చేసిన మొదటి పని ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు తీసుకోవడం. ఇది వారంలో ఒక రోజు చేసింది కాదు. రోజూ దీన్ని అనుసరించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవద్దనే నియమాన్ని కఠినంగా అనుసరించాను. ల్యాబ్‌ల్లో తయారై బాక్సుల్లో అందంగా ప్యాక్ చేసి కనిపించే భోజనాన్ని పూర్తిగా దూరం పెట్టాను. నా చుట్టున్న మార్కెట్లో, పంట పొలాల్లో నాకు మట్టిలో కనిపించే ఆహార పదార్థాలను ఎంచుకున్నాను. సూపర్ మార్కెట్లో దొరికే వాటి కంటే ఈ పదార్థాల్లో ఎన్నో పోషకాలుంటాయి. 2. మాంచి నిద్ర పోవడం మొదలెట్టాను కచ్చితంగా నిద్ర కోసం సమయాన్ని కేటాయించుకున్నాను. సమయమయిందంటే చాలు.. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఆపేసి నిద్ర పోవడం అలవాటు చేసుకున్నాను. అంతేనా.. రోజులో కూడగా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకున్నాను. దీని వల్ల మనసు ప్రశాంతంగా అనిపించింది. నా మెదడుకు ఎంతో రిలాక్స్ దొరికింది. వయస్సు మీద పడినట్టుగా అనిపించే కారకాలన్నీ దూరమయ్యాయి. అతి ముఖ్యమైన విషయం. నిద్ర రావడానికి టాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. - మీరు పడుకునే చోట ఎలాంటి లైట్లు ఉండకూడదు - రూం టెంపరేచర్ తక్కువగా ఉంటే మంచిది - ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఉండకూడదు. 3. ఉపవాసం ఉపవాసం అతి ముఖ్యమైనది. ఎందుకంటే... మన భోజన షెడ్యూల్‌ను కచ్చితంగా అనుసరించడం.. అంటే ఒకే సమయంలో అల్పహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్ర భోజనం తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం అని ఎందుకంటున్నానంటే.. పడుకునేకంటే చాలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అలాగే అప్పుడప్పుడు చేసే ఉపవాసాల వల్ల శరీరం నుంచి యాంటీ అక్సిడెంట్స్ సులువుగా బయటికి వెళ్లిపోతాయి. ఇవి వెళ్లిపోవడం వల్ల కాన్సర్, అల్జీమర్స్, స్ట్రోక్, గుండె వ్యాధులు లాంటివి రావు. గత కొన్నాళ్లుగా నేను కేవలం రెండు పూటలకు మాత్రమే పరిమితమయ్యాను. అదీ కూడా సేంద్రీయ సాగు ద్వారా పండించిన పంటలనే ఎంచుకుంటున్నాను. ఈ అలవాట్ల వల్ల నా భోజనం ఖర్చు సగానికి సగం తగ్గింది. 4) మెగ్నిషియం సప్లిమెంట్ మన శరీరానికి మెగ్నిషియం చాలా అవసరం. కండరాలు, జాయింట్లు, రోగ నిరోధక శక్తి మెదడు, గుండె, ఇతర ముఖ్య శరీర భాగాలు వీటన్నింటికి మెగ్నిషియం అవసరం. మనం ఎలాంటి భోజనం తీసుకున్నా.. వీటికి సరిపడా మెగ్నిషియం రాదు. సాగులో మనం అనుసరిస్తున్న విధానాలు అలాంటివి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75శాతం మంది మెగ్నిషీయం లోపంతో బాధపడుతున్నారు. అందుకే మెగ్నిషియంను అదనంగా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాను. ఇవీ నేను అనుసరిస్తున్న విధానాలు. అందుకే 46 ఏళ్లలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల కంటే 64 ఏళ్లలో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. -
టీ – మతిమరపు ఢీ!
పరిపరిశోధన జీవితంలో మతిమరపు రాకూడదని తలుస్తున్నారా? జ్ఞాపకశక్తిని మెదడులోనే ఉండిపొమ్మని పిలుస్తున్నారా? మీ సంకల్పం నేరవేరుగాక. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండేందుకూ, మతిమరపు (డిమెన్షియా)ను నివారించేందుకు అవలంబించాల్సిన మార్గం చాలా రుచికరమైనదీ, ఇష్టమైనదీ! మరీ మాట్లాడితే రోగి కోరేదీ అదే, పరిశోధకుడు సూచించేదీ అదే! టీ కెటిల్ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. అది బ్లాక్ టీ గానీ, గ్రీన్ టీ లేదా సాధారణ చాయ్ గానీ.... క్రమం తప్పకుండా టీ తాగేవారిలో 50 శాతం మందికి డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువంటున్నారు పరిశోధకులు. టీ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, థియాఫ్లేవిన్స్ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలతో మెదడులో వాస్క్యులార్ డ్యామేజీ, న్యూరోడీజెనరేషన్ తగ్గుతాయని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌నకు చెందిన డాక్టర్ ఫెంగ్ లీ పేర్కొంటున్నారు. సదరు యూనివర్సిటీ అధ్యయన ఫలితాలను ఇటీవలే ‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్, హెల్త్ అండ్ ఏజింగ్’ అనే ఆరోగ్య పత్రికలోనూ అధికారికంగా ప్రచురించారట. అందుకే ఇకపై మతిమరపు, డిమెన్షియా, అలై్జమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులకు దూరంగా ఉండాలనుకునేవారు కాస్త చాయ్‌పై ప్రేమ పెంచుకుంటే అది మతిమరపును ‘ఛేయ్’ అంటూ దూరంగా తరమేస్తుందంటున్నారు ఈ పరిశోధలకు నేతృత్వం వహించిన డాక్టర్ ఫెంగ్ లీ! కాకపోతే ఒక షరతు.... ఈ చాయ్ జాయ్ హాయ్‌లు రోజుకు మూడు కప్పులకు మించకూడదంటూ పరిమితి పెడుతున్నాడు డాక్టర్ లీ!!