అప్పట్లో 40, ఇప్పుడు నాలుగే కష్టం: తమన్నా | ActressTamannaah Bhatia latest workouts affter covid | Sakshi
Sakshi News home page

అప్పట్లో 40, ఇప్పుడు నాలుగే కష్టం: తమన్నా

Oct 16 2020 5:17 PM | Updated on Oct 16 2020 6:52 PM

ActressTamannaah Bhatia latest workouts affter covid - Sakshi

సాక్షి, ముంబై: ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన మిల్కీ బ్యూటీ తమన్నా బ్యాక్ టు ఫిజికల్ ఫిట్ నెస్ అంటూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న హీరోయిన్ తమన్నా మళ్లీ ఫిట్ నెస్ వైపు దృష్టి పెట్టారు. తాజాగా ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వార్మప్ ఎక్సర్ సైజ్‌లతో స్టామినా పుంజుకునేందుకు ప్రస్తుతం తేలికపాటి వ్యాయామం మాత్రమే చేస్తున్నానని తమన్నా చెప్పారు.  (ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా : తమన్నా)

కరోనాకు చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరిన వెంటనే తమన్నా బేబీ స్టెప్స్ అంటూ..నెమ్మదిగా యాక్షన్లోకి దిగి పోయారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఫిట్ నెస్ సంతరించుకోవడం చాలా ముఖ్యమని, వ్యాయామం తప్పనిసరి అని ఆమె ఈ వీడియోలో పేర్కొన్నారు. అయితే హడావిడిగా కాకుండా శరీరం చెప్పేది వింటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతంలో 40 పుషప్స్ చేసే ఆమె ఇప్పుడు నాలుగు చేయడానికే ఇబ్బంది పడుతుండటం ఈ వీడియోలో గమనించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement