ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా : తమన్నా | Tamannaah Bhatia Tests Positive For Coronavirus | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యా : తమన్నా

Published Mon, Oct 5 2020 9:00 PM | Last Updated on Mon, Oct 5 2020 9:11 PM

Tamannaah Bhatia Tests Positive For Coronavirus - Sakshi

కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా సోమవారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. సెట్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటీకి దురదృష్టవశాత్తు కరోనా బారిన పడినట్లు ఆమె పేర్కొంది. గత వారం తలనొప్పి, ఒళ్లు నొప్పులు రావడంతో అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల్లో పాజిటివ్‌ తేలిందని తెలిపింది. దీంతో వైద్యులు సలహాతో గత వారం హైదరాబాద్‌ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరానని చెప్పింది.

ప్రస్తుతం తాను డిశ్చార్జ్‌ అయ్యానని,  వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటానని తెలిపింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే పూర్తిగా కోలుకోని షూటింగ్‌కు వెళ్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా, ఇటీవల తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడికోలుకున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం తమన్నా తల్లిదండ్రులు ఆమెతోనే ఉన్నారు. ప్రస్తుతం తమన్నా ‘సీటీమార్‌’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాదున్‌’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు.  వీటితో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement