బరువు తగ్గేందుకు, ఫిట్‌గా ఉండేందుక చాలామంది పలు రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు ఏరోబిక్, సైక్లింగ్, కార్డియో వర్కౌట్‌లు, యోగా వంటివి చేస్తుంటారు. ఎవరికి వెసులుబాటుగా ఉండేవి వారు ఎంచుకుని మరీ క్రమతప్పకుండా చేస్తుంటారు. మరికొందరూ వేలు ఖర్చుపెట్టి మరీ ఫిట్‌నెస్ సెంటర్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని రకాల అద్భుతమైన వ్యాయామాలు మన పూర్వీకాలం నుంచే ఉండేవి. ఐతే రాను రాను కొన్ని కనుమరుగయ్యిపోగా, మరికొన్నింటిని మనం గుర్తించకపోవడంతో తెలియకుండా పోయాయి. అలాంటి ఓ పురాతన వ్యాయామం తాజాగా వెలుగులోకి వచ్చింది. పైగా ఇది ఇప్పుడూ నెట్టింట తెగ ట్రెండింగ్‌గా మారింది. ఏంటా వ్యాయామం అంటే..
చైనాకి సంబంధించిన 800 ఏళ్ల నాటి పురాతన వ్యాయామం ఇది. దీన్ని'బడువాంజిన్' అని పిలుస్తారు. ఈ వ్యాయామాన్ని సాధారణంగా వృద్ధులు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటి వ్యాయామాన్ని ఇప్పుడు చైనా యువత ఆశ్రయిచడం విశేషం. దీన్ని వారు తమ రోజువారి దినచర్యలో భాగంగా చేసుకుని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది తమ మాసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచి, అలసటను, ఒత్తిడిని దూరం చేస్తోందని చెబుతున్నారు.
నిజానికి ఈ వ్యాయామం 960-1279ల నాటి సాంగ్ రాజవంశం కాలం నాటిది. చైనా ఆరోగ్యం అండ్ ఫిట్‌నెస్‌లకు సంబంధించిన పురాతన వ్యాయామాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఇది ఎనిమిది ఆసనాలతో కూడిన వ్యాయామం. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలకు అనుగుణంగా చేస్తుండాలి. అందువల్ల మనకు ఇది ఒకరకంగా ధ్యానం చేసినట్లుగా ఉండటమే గాక శరీరం శక్తిని, రక్తపోటుని నియంత్రించే చక్కటి శరీర సాగతీతలు ఉంటాయి.
చైనాలోని షెన్‌జెన్, షాంఘై, బీజింగ్, గ్వాంగ్‌జౌ వంటి నగరాల్లో యువత దాదాపు 49 గంటలు పనిచేస్తారు. దీంతో యువత తీవ్రమైన అలసటకు, ఒత్తిడికి లోనవ్వడం జరుగుతుంది. అందువల్లే వారంతా ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇప్పుడూ ఈ వ్యాయామాన్నే ఆశ్రయిస్తున్నారు. గతేడాది జర్మన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ పమేలా రీఫ్ బడువాన్జిన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఈ వీడియోకి ఒక్కసారిగా మిలియన్‌లలో వ్యూస్ వచ్చాయి. పైగా ఈ వ్యాయామం నెట్టింట తెగ ట్రెండింగ్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మెడనొప్పితో బాధపడుత్ను వారికి ఈ వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుందని, నిద్రనాణ్యత మెరుగుపడి రిఫ్రెష్‌గా ఉంటారని చెబుతున్నారు.
Agréablement surpris par @PamelaReifYT qui pratique aussi le Baduanjin (Huit pièces de brocart), vieille gymnastique chinoise qui fait du bien à la santé. Programme sportif du weekend de plus en plus varié alors🤭 pic.twitter.com/zidpZ9dtOz
— Yi Lien (@YiLien000) August 27, 2023
(చదవండి: ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!)
Comments
Please login to add a commentAdd a comment