తల స్నానం చేస్తే.. గుండు మిగిలింది | Bizarre! Handpump water spares none, men and women turn bald after taking bath | Sakshi
Sakshi News home page

తల స్నానం చేస్తే.. గుండు మిగిలింది

Published Tue, Feb 2 2016 5:03 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

తల స్నానం చేస్తే.. గుండు మిగిలింది

తల స్నానం చేస్తే.. గుండు మిగిలింది

పట్నా:  కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు...బిహార్లోని మధుబని జిల్లాలో ఒక వింత చోటు  చేసుకుంది.  రోజూలాగానే తమ ఇంటిముందు ఉన్న చేతి పంపు నీళ్ళతో స్నానం చేసిన ఆ కుటుంబానికి ఓ వింత అనుభవం ఎదురైంది.  జుట్టంతా ఊడిపోయి వరుసగా ఒకరి తరువాత బోడిగుండుతో మిగలడంతో  బిత్తరపోయారు. ఏమైందో అని కంగారుపడి వైద్యులతో పాటు సంబంధిత అధికారుల దగ్గరికి పరుగు తీశారు.  దీంతో  ఆశ్చర్యపోయిన వైద్యులు, అధికారులు కూడా కారణాలు ఆరా తీసే పనిలో పడ్డారు.

వివరాల్లోకి వెళితే మహమ్మద్ హసీం, భార్య, ఇద్దరు పిల్లలు పంపు నీళ్లతో స్నానం చేసిన  పాపానికి జుట్టంతా ఊడిపోవడంతో  విస్తుపోయారు.  ఇంటిముందు ఉన్న చేతిపంపు నీళ్లతో స్నానం చేసిన కొద్దిసేపటికి  తల చుట్టూ దురదలు మొదలయ్యాయి.  అనంతరం పాయలు పాయలుగా  జుట్టు ఊడిపోవడం మొదలైంది. క్రమంగా గుండు గీసినట్టుగా నున్నగా  మొత్తం జుట్టు  రాలిపోయింది. దీంతో ఆ కుటుంబం భయభ్రాంతులకు లోనయ్యింది. 

 

వెంటనే సమీపంలో ఉన్న అధికారులను, వైద్యులను  సంప్రదించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు విచారణ మొదలు పెట్టారు. తక్షణమే  సదరు  చేతి పంపును సీజ్ చేసి, మరో  కొత్తపంపు వేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అయితే చాలా ఏళ్లనుంచి ఈ నీళ్లను వాడుతున్నారనీ.. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడంలేదని  గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement