బట్టతల
బట్టతలతో బాధపడుతున్న వారందరికీ శుభవార్త. జపాన్ శాస్త్రవేత్తలు బోడిగుండుపై కూడా బోలెడన్ని వెంట్రుకలు..అదీ వేగంగా మొలిపించేందుకు ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. సిలికోన్ డబ్బాల్లో వీరు చేసిన ప్రయోగాలు సత్ఫలితాలివ్వడంతో ఇకపై బట్టతల అన్నది ఉండదని అంటున్నారు. యోకహోమా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జున్‌జీ ఫుకూడా నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో రెండు రకాల వెంట్రుక కణాలను ఉపయోగించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే దాదాపు ఐదువేల వరకూ వెంట్రుకలను పెంచడంలో విజయం సాధించారు.
ప్రస్తుతం క్లినిక్స్‌లో వెనుకవైపు వెంట్రుకలను తీసుకుని ముందు అతికిస్తున్నారని.. దీనివల్ల తలపై వెంట్రుకలు మందంగా ఉండటం లేదని ఫుకూడా అంటున్నారు. మందులతో జట్టు ఊడిపోయే వేగాన్ని తగ్గించవచ్చుగానీ.. పూర్తిగా నివారించలేమని.. ఈ నేపథ్యంలో తాము కొత్త టెక్నిక్‌ను ఉపయోగించి జట్టు వేగంగా పెరిగేలా చేశామని వివరించారు. ప్రస్తుతానికి తాము పరిశోధనశాలలో మాత్రమే ప్రయోగాలు నిర్వహించామని.. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మరిన్ని ప్రయోగాలు చేసిన తరువాతగానీ ఈ పద్ధతిని మనుష
Comments
Please login to add a commentAdd a comment