చాలామంది కొబ్బరి లేకుండా అంతా నీళ్లు ఉండే బొండా అడుగుతారు. కానీ ఈసారి అలా చేయకుండా కొబ్బరిబోండా తాగేశాక కొబ్బరి కూడా అడిగి తినేయండి. మీరు తాగిన కొబ్బరినీళ్లతో ఆరోగ్యకరమైన రీతిలో రీ–హైడ్రేట్ అవుతారు. ఖనిజ లవణాలూ పొందుతారు అదో ప్రయోజనం. ఇదిగాక మరో లాభమూ ఉంది.
(చదవండి: భారీగా బరువు తగ్గిన ఖుష్బూ..! ఫొటో వైరల్)
కొబ్బరిలో కొవ్వుల పాళ్లు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అందువల్ల కొబ్బరి తిన్న తర్వాత ఆ కొవ్వుల కారణంగా చాలాసేపు ఆకలి అంతగా అనిపించదు. దాంతో తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆరోగ్యవంతమైన రీతిలో తమ స్థూలకాయాన్ని వదుల్చుకునేందుకు ఇదో మంచి సాధనం.
Comments
Please login to add a commentAdd a comment