ఎండుకొబ్బరిని నిల్వ ఉంచిన కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం చూస్తుంటాం. ఇవేవీ రాకుండా, కొబ్బరిచిప్పలను చింతలేకుండా ఇలా నిల్వచేసుకోండి...
- మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా తుడిచి, ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరినూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి.
- ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో పెట్టి , కవర్‌లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా పెట్టిన కొబ్బరి నెలల పాటు పాడవకుండా ఉంటుంది.
- టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపల, బయటా తుడవాలి. ఇలా తుడిచిన చిప్పలను ఎండలో రెండు రోజుల పాటు ఆరబెట్టి, కవర్‌లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేయాలి. ఇలా కూడా ఎక్కువ రోజుల పాటు చిప్పలు తాజాగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment