మ్యాంగో కోకోనట్‌ కొలడా.. వేసవిలో అదిరిపోయే డ్రింక్‌ | mango Coconut Colada Recipe | Sakshi
Sakshi News home page

మ్యాంగో కోకోనట్‌ కొలడా.. వేసవిలో అదిరిపోయే డ్రింక్‌

Published Thu, May 19 2022 7:28 AM | Last Updated on Thu, May 19 2022 7:28 AM

mango Coconut Colada Recipe - Sakshi

కావలసినవి: మామిడిపండు ముక్కలు – కప్పు, కొబ్బరి నీళ్లు – కప్పు, కొబ్బరి క్రీమ్‌ – అరకప్పు, తులసి ఆకులు – మూడు, పంచదార – టీస్పూను, ఐస్‌ క్యూబ్స్‌ – ఐదు. 

తయారీ:

  • గ్లాసులో తులసి ఆకులు, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి 
  • మామిడిపండు ముక్కలు, ఐస్‌క్యూబ్స్, కొబ్బరి నీళ్లను బ్లెండర్‌లో వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని తులసి ఆకులున్న గ్లాసులో పోయాలి 
  • ఈ గ్లాసులో కొబ్బరి క్రీమ్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి. 
  • వేసవిలోæ వెంటనే దాహం తీర్చేవాటిలో మ్యాంగో కోకోనట్‌ కొలడా ఒకటి. 
  • దీనిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 
  • విటమిన్‌ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, మామిడిలోని పొటాషియం స్థాయులు రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి 
  • దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement