Summer Drink
-
మ్యాంగో కోకోనట్ కొలడా.. వేసవిలో అదిరిపోయే డ్రింక్
కావలసినవి: మామిడిపండు ముక్కలు – కప్పు, కొబ్బరి నీళ్లు – కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తులసి ఆకులు – మూడు, పంచదార – టీస్పూను, ఐస్ క్యూబ్స్ – ఐదు. తయారీ: గ్లాసులో తులసి ఆకులు, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి మామిడిపండు ముక్కలు, ఐస్‌క్యూబ్స్, కొబ్బరి నీళ్లను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తులసి ఆకులున్న గ్లాసులో పోయాలి ఈ గ్లాసులో కొబ్బరి క్రీమ్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలోæ వెంటనే దాహం తీర్చేవాటిలో మ్యాంగో కోకోనట్ కొలడా ఒకటి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, మామిడిలోని పొటాషియం స్థాయులు రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. -
Aam Panna: చల్లచల్లని ఆమ్‌పన్నా.. వేసవిలో ఇది తాగితే..!
కావలసినవి: పచ్చిమామిడికాయలు – అరకేజీ, పంచదార – అరకప్పు, ఉప్పు – రెండు టీస్పూస్లు, దోరగా వేయించి పొడిచేసిన జీలకర్ర – రెండు టీస్పూన్లు, పుదీనా తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, నీళ్లు – రెండు కప్పులు, ఐస్ ముక్కలు – నాలుగు. తయారీ: ∙పచ్చిమామిడికాయలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించాలి ∙ఉడికిన కాయల తొక్క తీసేసి, మామిడి కాయ గుజ్జును మిక్సీ జార్లో వేసుకోవాలి ∙ఈ గుజ్జులో జీలకర్ర పొడి, పుదీనా తరుగు, పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అన్నీ గ్రైండ్ అయ్యాక రెండు కప్పుల నీళ్లు పోసి మరోమారు గ్రైండ్ చేసుకుంటే ఆమ్ పన్నా రెడీ. ఆమ్పన్నాను గ్లాసులో వేసి ఐస్ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. ∙ ప్రయోజనాలు: పచ్చిమామిడికాయలో ఉన్న విటమిన్ ఏ, ఈలు శరీరం లోని హార్మోన్ల పనితీరుని మెరుగుపరుస్తాయి. దీనిలోని సోడియం క్లోరైడ్ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉల్లాసంగా ఉంచుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ∙ఈ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరిచి బైల్ ఆమ్లాలు సక్రమంగా విడుదలయ్యేట్టు చేస్తుంది. ∙విటమిన్ సీ, క్యాల్షియం, మెగ్నీషియంలు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. చదవండి: ‘పులి’ లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్! -
జింజర్ ఫ్రూట్ పంచ్
సమ్మర్ డ్రింక్ కావలసినవి: అల్లం తురుము – 30గ్రా., పంచదార – అర కప్పు, ఆరెంజ్ జ్యూస్ – ఒకటిన్నర కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్, చల్లని నీరు / క్లబ్ సోడా – 3 కప్పులు తయారి: ∙ ఒక పాత్రలో అల్లం తురుము, పంచదార, కప్పు నీరు కలిపి సన్నటి మంటపైన 15 నిమిషాల సేపు మరిగించాలి. ∙ ఈ మిశ్రమాన్ని మరో పాత్రలో పోసి చల్లబడనివ్వాలి. ∙ దీనిలో నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ∙ కావలసినప్పుడు తగినంత జ్యూస్ గ్లాస్‌లోకి తీసుకుని అందులో చల్లని నీరు లేదంటే క్లబ్ సోడా కలిపి చివరన ఐస్‌ముక్కలు వేసి సర్వ్ చేయాలి. పోషకాలు : క్యాలరీలు – 442.8 కి.క్యా, కార్బోహైడ్రేట్లు – 134.4 గ్రా., ప్రొటీన్లు – 4 గ్రా., ఫ్యాట్ – 5›గ్రా. నోట్: ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. వేసవిలో వచ్చే డీ హైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. -
జీసీసీ నుంచి త్వరలో మారేడు షర్బత్!
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మరో సమ్మర్ డ్రింక్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన నన్నారి షర్బత్‌కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఔషధ గుణాలున్న మారేడు (బిళ్వ) షర్బత్‌ను సరికొత్తగా తయారు చేస్తోంది. దీన్ని ఈ నెల 29న రాజమండ్రిలో విడుదల చేయనుంది. మారేడు పండ్ల గుజ్జు నుంచి దీన్ని తయారు చేస్తారు. మారేడు షర్బత్‌లో మధుమేహం, డయేరియా, అల్సర్‌ను నయం చేయడంతో పాటు బరువును తగ్గించడం, మలబద్ధకాన్ని నివారించే లక్షణాలున్నాయని చెబుతున్నారు. 750 మి.లీ. బాటిల్ ధరను రూ.100గా నిర్ణయించారు. తాజా ప్రొడక్టుకు మంచి స్పందన వస్తుందని భావిస్తున్నట్లు జీసీసీ ఎండీ రవిప్రకాష్ పేర్కొన్నారు.