Summer Drinks: Amazing Health Benefits Of Aam Panna In Telugu - Sakshi
Sakshi News home page

Aam Panna Health Benefits: చల్లచల్లని ఆమ్‌పన్నా.. వేసవిలో దివ్యౌషధంలా పని చేస్తుంది..!

Published Fri, Apr 15 2022 12:16 PM | Last Updated on Fri, Apr 15 2022 1:06 PM

Aam Panna Health Benefits - Sakshi

కావలసినవి: పచ్చిమామిడికాయలు – అరకేజీ, పంచదార – అరకప్పు, ఉప్పు – రెండు టీస్పూస్లు, దోరగా వేయించి పొడిచేసిన జీలకర్ర – రెండు టీస్పూన్లు, పుదీనా తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – రెండు కప్పులు, ఐస్‌ ముక్కలు – నాలుగు.

తయారీ: ∙పచ్చిమామిడికాయలను శుభ్రంగా కడిగి మెత్తగా ఉడికించాలి ∙ఉడికిన కాయల తొక్క తీసేసి, మామిడి కాయ గుజ్జును మిక్సీ జార్‌లో వేసుకోవాలి ∙ఈ గుజ్జులో జీలకర్ర పొడి, పుదీనా తరుగు, పంచదార వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అన్నీ గ్రైండ్‌ అయ్యాక రెండు కప్పుల నీళ్లు పోసి మరోమారు గ్రైండ్‌ చేసుకుంటే ఆమ్‌ పన్నా రెడీ. ఆమ్‌పన్నాను గ్లాసులో వేసి ఐస్‌ ముక్కలతో సర్వ్‌ చేసుకోవాలి.  ∙

ప్రయోజనాలు: పచ్చిమామిడికాయలో ఉన్న విటమిన్‌ ఏ, ఈలు శరీరం లోని హార్మోన్ల పనితీరుని మెరుగుపరుస్తాయి.  దీనిలోని సోడియం క్లోరైడ్‌ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉల్లాసంగా ఉంచుతుంది.  అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ∙ఈ జ్యూస్‌ కాలేయాన్ని శుభ్రపరిచి బైల్‌ ఆమ్లాలు సక్రమంగా విడుదలయ్యేట్టు చేస్తుంది. ∙విటమిన్‌ సీ, క్యాల్షియం, మెగ్నీషియంలు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి.  
చదవండి: ‘పులి’ లాంటి ఈ పుల్లటి పండు తింటే ఒబెసిటీ పరార్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement