జింజర్ ఫ్రూట్ పంచ్
సమ్మర్ డ్రింక్
కావలసినవి: అల్లం తురుము – 30గ్రా., పంచదార – అర కప్పు, ఆరెంజ్ జ్యూస్ – ఒకటిన్నర కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్, చల్లని నీరు / క్లబ్ సోడా – 3 కప్పులు
తయారి:
∙ ఒక పాత్రలో అల్లం తురుము, పంచదార, కప్పు నీరు కలిపి సన్నటి మంటపైన 15 నిమిషాల సేపు మరిగించాలి.
∙ ఈ మిశ్రమాన్ని మరో పాత్రలో పోసి చల్లబడనివ్వాలి.
∙ దీనిలో నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
∙ కావలసినప్పుడు తగినంత జ్యూస్ గ్లాస్‌లోకి తీసుకుని అందులో చల్లని నీరు లేదంటే క్లబ్ సోడా కలిపి చివరన ఐస్‌ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
పోషకాలు : క్యాలరీలు – 442.8 కి.క్యా, కార్బోహైడ్రేట్లు – 134.4 గ్రా., ప్రొటీన్లు – 4 గ్రా., ఫ్యాట్ – 5›గ్రా.
నోట్: ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. వేసవిలో వచ్చే డీ హైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది.