కొబ్బరి ఖీమా బాల్స్‌కి కావలసినవి:
కొబ్బరి – ఒకచిప్ప
కారం – అర టీస్పూను
పసుపు – చిటికెడు
గరం మసాలా – అరటీస్పూను
ధనియాల పొడి – అర టీ స్పూను
కొత్తిమీర తరుగు – మూడు టీస్పూన్లు
శనగపిండి – రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి – రెండు స్పూన్లు
కరివేపాకు – రెండు రెమ్మలు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి∙ కొబ్బరి చిప్పలోని కొబ్బరిని తురుముకోవాలి∙ కొబ్బరి తురుముని గిన్నెలో వేసి.. కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి∙ చివరిగా శనగపిండివేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి∙ బాణలిలో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉండలను వేసి వేయించాలి ∙ఉండలు వేగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి మూడు నిమిషాలు వేయించితే కొబ్బరి ఖీమా బాల్స్ రెడీ ∙ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో సర్వ్‌చేసుకోవాలి.
(చదవండి: నోరూరించే రొయ్యల పచ్చడి ఇలా చేస్తే..చక్కగా లాగించేస్తారు!)
Comments
Please login to add a commentAdd a comment