
కోకోనట్ చిల్లర్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే
ఖమ్మంమామిళ్లగూడెం: పెరిగిన ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చిటికెలో కూల్ కొబ్బరి నీళ్లు అందించడం పట్ల ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆశ్చర్యపోయారు. వైరారోడ్‌లోని తేజస్వి వైద్యశాల ఎదుట యలమందల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు యలమందల ప్రభాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన కోకోనట్ చిల్లర్‌ను ఎమ్మెల్యే సందర్శించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో కనిపించని ఈ కోకోనట్ చిల్లర్‌ను ఖమ్మానికి పరిచయడం చేయడం శుభపరిణామమన్నారు. డాక్టర్ గంగరాజు సారథ్యంలో ఇలాంటివి మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బత్తుల మురళి, కమర్తపు మురళి, డాక్టర్ గంగరాజు, నాగరాజు, లాల్‌జాన్‌పాషా, శేఖర్‌కమ్మల, వసంతరావు, కిరణ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment