
వేసవిలో కొబ్బరి బొండాంకున్న ప్రాధాన్యతే వేరు.సహజసిద్ధంగా ఏర్పడిన కొబ్బరి నీళ్లలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే మీరెపుడైనా స్పైసీ గ్రిల్డ్ లేదా రోస్టెడ్ కొబ్బరిని టేస్ట్ చేశారా? ఇండోనేషియాలో ఈ స్ట్రీట్ డ్రింక్ చాలా ఫ్యామస్.
అంతేకాదు ఆక్రమణదారులనుంచి దేశాన్ని కాపాడేందుకు, శారీరక బలం కోసం దీన్ని అక్కడి రాజులు దీన్ని ఎక్కువగా తాగేవారట. ఇండోనేషియాలో స్పైస్ గ్రిల్డ్ కోకోనట్ చాలా ఖరీదైంది కూడా. ఒక్కో బోండాం ధర 10వేలకు పైమాటేనట.
Roast coconut street food , Indonesia
— Science girl (@gunsnrosesgirl3) April 14, 2024
pic.twitter.com/ZaJcxt7h8g
పచ్చి కొబ్బరి కాయను సుమారు 1-2 గంటల పాటు కాల్చుతారు. స్పెషల్‌గా ఏర్పాటు చేసిన గ్రిల్‌మీద జాగ్రత్తగా కాల్చుతారు. ఆతరువాత పైన పీచు వలిచేసి,లోపల ఉన్న లేత కొబ్బరితో సహా నీళ్లను సేవిస్తారు. దీన్ని వేడి వేడిగా, లేదా చల్లగా ఎలాగైన తినవచ్చు. ఇలా కాల్చడం వల్ల కొబ్బరి టేస్ట్‌తోపాటు పోషక విలువలుకూడా మరింత పెరుగుతాయని ఇక్కడి వారి నమ్మకం. కాల్చిన కొబ్బరి నీళ్లు, స్థానిక సుగంధ ద్రవ్యాలతోపాటు కొద్దిగా షుగర్‌ను కలిపి తాగుతారు. ఒక రోజులో కనీసం 30 కొబ్బరికాయలు అమ్ముడవుతాయి.