మండలంలోని చెర్వుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో దేవాలయం గట్టు కింద కొబ్బరికాయలు విక్రయించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ మల్గరమణ బాలకృష్ణ అధ్యక్షతన శుక్రవారం వేలంపాట నిర్వహించారు
నార్కట్‌పల్లి: మండలంలోని చెర్వుగట్టు గ్రామపంచాయతీ పరిధిలో దేవాలయం గట్టు కింద కొబ్బరికాయలు విక్రయించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ మల్గరమణ బాలకృష్ణ అధ్యక్షతన శుక్రవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం రూ.18.50 లక్షలకు అదే గ్రామానికి చెందిన అంకాల సతీశ్ పాటను దక్కించుకున్నట్లు ఈఓఆర్డీ్డ లక్ష్మినారాయణ తెలిపారు. పాట దక్కించుకున్న వ్యక్తులకు ఒక సంవత్సరం పాటు కొబ్బరికాయలు విక్రయించేందుకు హక్కు కలిగి ఉంటారని తెలిపారు. ఈ వేలంలో 13మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సత్యనారాయణ, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి నారాయణరెడ్డి, వార్డు సభ్యులు గుంటిసైదమ్మ, నర్సింహ్మ, కొండేటి వేణు, దాసోజు తిరుపతమ్మ, కోటి, వంపు శివ శంకర్, కుకుట్ల అనురాధ, గణేష్, అండాలు, చంద్రయ్య, పారిజాత, శంకర్, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.