
కొబ్బరి నేత్రం
కొబ్బరికాయపై వెలసిన కన్ను ఆకారం ఆసక్తి రేపుతోంది.
► తుమకూరులో వింత
కొబ్బరికాయపై వెలసిన కన్ను ఆకారం ఆసక్తి రేపుతోంది. తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో ఉన్న కడబ గ్రామానికి చెందిన రైతు వెంకటప్ప తోటలో కొబ్బరి చెట్టుకు కాసిన కొబ్బరికాయపై ఒంటి కన్ను కనిపించింది. రైతు కొబ్బరి పీచు తీస్తుండగా కన్ను రూపం బయటపడింది. ఎవరో శ్రద్ధగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. దానిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతు కొబ్బరి కాయను దేవునిగదిలో ఉంచి పూజలు చేశారు.