కిక్కిరిసిన భక్త జనం.. ‘ఎల్లమ్మమాతాకి జై’అంటూ నినాదాలు.. జమిడీకె, డప్పుల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
బొంరాస్‌పేట : కిక్కిరిసిన భక్త జనం.. ‘ఎల్లమ్మమాతాకి జై’అంటూ నినాదాలు.. జమిడీకె, డప్పుల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వేలాది మంది శివసత్తుల భక్తిపారవశ్యం ఎదుట పసుపు, గవ్వలబండారు చల్లుతూ అవ్మువారికి భక్తుల ప్రణామాలు చేయడం వంటి కార్యక్రమాలతో శుక్రవారం బొంరాస్‌పేట మండలం పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం(సిడె) శుక్రవారం సాయంత్రం భక్త జనసంద్రంగా మారింది. ‘మావురాల ఎల్లమ్మతల్లి’ మూలవిరాట్‌ను సిడెపై ఉంచి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు.
ఎల్లమ్మ దేవత 50అడుగుల ఎత్తులో నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు రెండులక్షల వుందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి కోనేరులో భక్తులు స్నానాలాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. రోజంతా కోడిపుంజులు, మేకపోతులు, కొబ్బరికాయులు, బోనపుకడువలతో భక్తులు అవ్మువారికి నైవేద్యంపెట్టి మొక్కులు తీర్చుకున్నారు.
అమ్మవారి సన్నిధిలో..
ప్రముఖులు
వుహబూబ్‌నగర్ మాజీ ఎంపీ డి.విఠల్‌రావు, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సలీం, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ ముదిగండ్ల కృష్ణ, కోస్గి మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ వెంకట్రాములుగౌడ్, తహశీల్దార్ వెంకటయ్య, ఆలయకమిటీ చైర్మన్ ముచ్చటి వెంకటేశ్, మాజీచైర్మన్ రామకృష్ణారెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రాజేందర్‌రెడ్డి, రేణుకాఎల్లవ్ము యువజన సంఘం అధ్యక్షుడు బుగ్గప్ప తదితరులు దర్శించుకున్నారు.