ప్రమాదం ఎటు నుంచి పొంచి వస్తుందో ఊహించలేం. చేయని తప్పుకు కూడా కొన్నిసార్లు అనుకోకుండా బలికావాల్సి వస్తోంది. అచ్చం ఓ మహిళకు కూడా ఇలాంటి ఓ భయంకర సంఘటనే ఎదురైంది. అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఊహించని ఈ ఘటన మలేషియాలో జరిగింది. తన స్నేహితురాలితో కలిసి మహిళ తేలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్ వైపు వెళుతోంది. అయితే రహదారి పక్కన కొన్ని కొబ్బరి చెట్లు రోడ్డుపైకి వంగి ఉన్నాయి. ఇంతలో ఒక కొబ్బరి చెట్టుపై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళ తలపై నేరుగా పడింది.
దీంతో మహిళ ఒక్కసారిగా స్కూటర్ పై నుంచి రోడ్డుపై పడిపోయింది. అయితే మహిళ హెల్మెట్ ధరించి ఉండటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. వెంటనే స్కూటర్‌పై ఉన్న స్నేహితురాలు, స్థానికులు అప్రమాత్తమయ్యారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కాగా టూవీలర్ వెనకాల వెళ్తున్న కారు డ్యాష్ బోర్డుపై ఉన్న కెమెరాలో రికార్డైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.
చదవండి: ‘యూకే ప్రధాని’ని ఛేజ్ చేస్తున్నపోలీసులు!: వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment