సుందరీ... నువ్వెవరు?
అబ్బబ్బబ్బా.. ఇవేం ఎండలు బాబోయ్. మాడు మాడిపోయేలా.. మొహం వాడిపోయేలా ఉన్నాయి. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే ఇక మేలో పరిస్థితేంటి? భానుడి భగభగలు తట్టుకోలేక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇలా వాపోతున్నారు. ఎండ బారిన పడకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్నారు. ఇదిగో.. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నట్లు చాలామంది అమ్మాయిలు ముఖం మొత్తం కవర్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ ముసుగు వెనక దాగి ఉన్న సుందరి ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ! కూల్.. కూల్. సమాధానం చెప్పేస్తాం. ఆవిడ ఎవరో కాదు.. రకుల్. ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారీ బ్యూటీ. షాట్ గ్యాప్‌లో ఎండ నుంచి కాపాడుకునేందుకు
ఇలా ముసుగేసుకున్నారు.