Coca-Cola India
-
రెండేళ్లలో ఆ టార్గెట్‌ని చేరుకుంటాం: కోకా–కోలా
వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని ‘మాజా’ సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. చదవండి: అమెజాన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్, ఏడాదికి రూ.599కే -
సౌరవ్ గంగూలీపై కోకాకోలా కీలక నిర్ణయం..!
ప్రముఖ బెవరేజస్ కంపెనీ కోకాకోలా ఇండియా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై కీలక నిర్ణయం తీసుకుంది. సౌరవ్‌ను మరో మూడేళ్లపాటు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగిస్తున్నట్లు కోకాకోలా ఒక ప్రకటనలో పేర్కొంది. 2017లో సౌరవ్ గంగూలీను కోకాకోలా ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా కంపెనీ నియమించింది. మరో మూడేళ్లపాటు సౌరవ్ గంగూలీతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని కోకాకోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ ఆర్నబ్ రాయ్ అన్నారు. చదవండి: భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు..! బ్రాండ్ ఎండోర్స్మెంట్లో దాదా దూకుడు..! భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్‌లో దూకుడును ప్రదర్శిస్తున్నారు. సౌరవ్ ఇప్పటకీ డీటీడీసీ, టాటా టెట్లీ, పుమా, ఎస్లియర్ లెన్స్, సెన్కో గోల్డ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఒక ఏడాది పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం కోసం సౌరవ్ ఒక్కో బ్రాండ్ నుంచి సుమారు కోటి రూపాయలను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: రూ.15 లక్షలలో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే! మీరు ఓ లుక్కేయండి! -
మీటూ: మాజీ ప్రపంచ సుందరికి భారీ ఊరట
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్‌కు భారీ ఊరట లభించింది. కోకా కోలా కంపెనీ నుంచి పరిహారంగా లభించిన మొత్తంపై పన్ను చెల్లింపుపై ఇన్‌కం టాక్స్ అప్పెల్లా ట్రిబ్యునల్ (ఐటీఏటి) ఉపశమనం కల్పించింది. నష్టపరిహారంగా వచ్చిన ఆదాయంగా చూడలేమని దీనిపై పన్నుచెల్లించాల్సిన అవసరంలేదని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సుస్మితా సేన్‌కు లైంగిక వేధింపుల కేసులో నష్టపరిహారంగా వచ్చిన రూ.95లక్షలు ఆదాయం కిందికి రాదని వెల్లడించింది. కాబట్టి పన్నుకట్టనక్కలేదంటూ ఆమెపై విధించిన రూ. 35 లక్షల జరిమానాను కొట్టి వేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28ప్రకారం , 2(24) పరిహారాన్ని ఆదాయంగా పేర్కొనలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కోకా కోలా ఇండియా ఉద్యోగిపై లైంగిక ఆరోపణ కేసులో 2003-04లో, సుస్మితా సేన్‌క కంపెనీ రూ. 1.45 కోట్లు చెల్లించింది. ఇందులో 50లక్షల రూపాయల ఆదాయపన్ను కింద మినహాయించి రూ. 95 లక్షల నష్టపరిహారాన్ని సుస్మితా అందుకున్నారు. అయితే దీన్ని సుస్మితా సేన్ ఐటీ ఫైలింగ్‌లో ప్రకటించలేదంటూ ఆదాయన పన్నుశాఖ పెనాల్టీ విధించింది. -
కోకాకోలాకు వెంకటేష్ రాజీనామా, కీలక పరిణామం
ముంబై: దేశంలో ఇటీవల ఇబ్బందుల్లో పడిన కోకాకోలా ఇండియా యాజమాన్యంలో కీలక మార్పును చేపట్టింది. అట్లాంటా, యుఎస్ఎలో కొనసాగుతున్న నాయకత్వ మార్పులకు అనుగుణంగా, గ్లోబల్ పానీయాల దిగ్గజం కోకాకోలా భారతదేశంలో కూడా నాయకత్వాన్ని మార్చింది. హిందుస్థాన్ కోకా కోలా సీఈవో టి. కృష్ణకుమార్‌ను సౌత్ వెస్ట్ ఆసియా బిజినెస్ హెడ్‌గా నియమించింది. ప్రస్తుత ప్రెసిడెంట్ వెంకటేష్ కిని రాజీనామా చేయడంతోఈ ఆదేశాలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. కోకాకోలా ఇండియా ప్రస్తుత ప్రెసిడెంట్ వెంకటేష్ కినీ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే 2012 సం.రనుంచి దాదాపు 19 సం.లపాటు సంస్థకు సేవలందించిన వెంకటేష్ కిని వ్యక్తిగత కారణాల రీత్యా రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం తాను తిరిగి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అటు కృష్ణకుమార్ స్థానంలో హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ సీఈవో గా క్రిష్టినా రగ్గిరోను ఎంపిక చేసింది. ఆమె హెచ్‌సీసీబీకి మొదటి మహిళా సీఈవో కానున్నారు. కాగా త రెండు సంవత్సరాల్లో దేశంలో కోక్ విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గడిచిన తొమ్మిది త్రైమాసికాల్లో నాలుగింటితో పాటు ప్రతికూల వాల్యూమ్ విక్రయాలు, కీ వేసవి నెలలు కూడా ఉన్నాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మార్చడంతో, ఇటీవల దాని ప్రధాన ప్రాంతానికి బయట ఉన్న పోర్ట్‌ఫోలియోలను కార్బొనేటేడ్ పానీయాలు విస్తరించడం పై కేంద్రీకరించింది. భారతీయ వినియోగదారుల్లో రసాలపై పెరుగుతున్న ప్రజాదరణను క్యాష్ చేసుకునేందుకు 2017 లో దేశంలో పళ్లరసాలను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. -
అంత పన్ను వేస్తే ప్లాంట్లు మూసుకోక తప్పదు..
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో సాఫ్ట్ డ్రింకులకు అత్యధికంగా 40 శాతం పన్ను పరిధిలోకి చేరిస్తే తాము భారత్‌లో కొన్ని ప్లాంట్లను మూసివేయాల్సి వస్తుందని బెవరేజెస్ సంస్థ కోకా కోలా ఇండియా పేర్కొంది. అరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే.. మొత్తం బెవరేజిల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఇష్తియాఖ్ అంజాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితంగా కొన్ని ప్లాంట్లను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటని, ఇప్పటికే 2.5 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టామని, 2020 నాటికి మరో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నామని పేర్కొన్నారు. అటు, 40 శాతం పన్ను రేటు చాలా ఎక్కువన్న మరో దిగ్గజ కంపెనీ పెప్సీకో.. పరిశ్రమ పరిస్థితులను బట్టి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోగలదని ఆశిస్తున్నట్లు తెలిపింది. పొగాకు, లగ్జరీ కార్లు తదితర ఉత్పత్తుల కేటగిరీలో ఏరేటెడ్ డ్రింక్స్నూ గరిష్ట పన్ను రేటు 40 శాతం విభాగంలో చేర్చాలనిఅరవింద్ సుబ్రమణ్యన్ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే.