దలాల్ స్ట్రీట్‌కు జీఎస్‌టీ బూస్ట్: ట్రిపుల్ సెంచరీ
ముంబై: దలాల్ స్ట్రీట్‌కు జీఎస్‌టీ బూస్ట్ లభించింది. దీంతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ సాధించి 31వేలకు ఎగువన ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ కౌంటర్లలో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లతో మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్, నిప్టీ రెండూ సాంకేతిక స్థాయిలను అధిగమించి స్థిరంగా ఉండడం విశేషం.
ట్రేడింగ్ ప్రారంభంలోనే 31,258 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ అనంతరం ఆ స్థాయికి నుంచి కిందిపడినా మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా ఎఫ్ఎంసిజి, మెటల్, కన్సుమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, ఆటో షేర్లు 3.42 శాతం లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 305 పాయింట్లు లాభపడి 31,226 వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,600 ని అధిగమించింది. 89 పాయింట్ల లాభంతో 9606 వద్ద ట్రేడ్ అవుతోంది.
ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ రంగం 3.6 శాతం జంప్ చేసి తన హవా కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో దూకుడుమీద ఉన్న ఐటీసీ తన లాభాల పరుగును కొనసాగిస్తోంది. దీంతో ఎనలిస్టులు కూడా సానుకూల ధోరణిని కనబరుస్తున్నారు. ఆరంభంలోనే 8 శాతం ఎగిసిన ఐటీసీ టాప్ విన్నర్‌గా కొత్త రికార్డులవైపు సాగుతోంది. దీంతోపాటు రియల్టీ, మెటల్ 1.5 శాతం చొప్పున ఎగశాయి. ఆటోలో మారుతి టాప్ విన్నర్‌గా ఉంది. హిందాల్కో, ఇన్‌ఫ్రాటెల్, ఐషర్, వేదాంతా, మారుతీ, ఎంఅండ్‌ఎం, బీవోబీ, అల్ట్రాటెక్, టాటా స్టీల్ ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా పవర్, ఐబీ హౌసింగ్ నష్టాల్లో ఉన్నాయి.