
ఫేస్‌బుక్‌లో కొత్తగా వచ్చిన కేరింగ్ ఎమోజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండింగ్‌గా మారింది. ఈ ఎమెజీ వచ్చినప్పటి నుంచి నెటిజన్లు ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ్యవాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రజలు రోజంతా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచక సోషల్ మీడియాలో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో వారి స్నేహితులతో, సన్నిహితులతో చాట్ చేస్తూ తమ భావాలను ఎమోజీల ద్వారా వ్యక్తం చేస్తుంటారు. అయితే ప్రేమ, చిరునవ్వు, బాధ, కోపం, అలగడం వంటి భావాలను తెలపడానికి వాట్సప్, ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఆరు ఎమోజీలు ఉన్న విషయం తెలిసిందే. (ఫేస్‌బుక్‌లో కొత్త ఎమోజీ... వివరాలు మీకోసం!)
"Mask off" on the Facebook "Care Emoji"? It was actually the Uncle Fester Emoji the whole time! pic.twitter.com/8EBzkw5U7V
— Parallax Views w/ J.G. Michael (Podcast) (@ViewsParallax) May 3, 2020
అయితే ఇప్పడు కొత్తగా లాక్‌డౌన్‌లో మన వారిని జాగ్రత్తగా ఉండమని చెబుతూ వారిపై మనకు ఉన్న బాధ్యతను తెలియపరచడానికి ఇటీవల ‘కేరింగ్’ ఎమోజీని ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రేమ, చిరునవ్వులతో హృదయాన్ని హత్తుకుని ఉన్న ఎమోజీకి కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుంటే మరికొందరు ‘ఫేస్‌బుక్ కేరింగ్ ఎమోజీని షేర్ చేస్తుంటే.. అది లేని వారి రియాక్షన్ ఎలా ఉంటుంది’ ‘ఈ కేరింగ్ ఎమోజీ కోసం నా ఫేస్‌బుక్‌ను ఆప్‌డేట్ చేస్తూనే ఉన్నాను.. కానీ అది రావడం లేదు’ అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. కాగా ఈ ఎమోజీని విడుదల చేస్తున్నట్లు కమ్మూనికేషన్ మేనేజర్ అలెగ్జాండ్రూ వోయికా ఏప్రిల్‌లో ట్వీట్ చేశాడు. ‘‘మేము కొత్తగా కేరింగ్ ఎమోజీని ఫేస్‌బుక్, మెసెంజర్‌లో విడుదల చేస్తున్నాము. ఈ విపత్కర కాలంలో దూరంగా ఉన్న మీ వాళ్లపై ప్రేమను పంచుకునేందుకు ఈ ఎమోజీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశాడు.