Emoji Web Series Will Streaming On Aha OTT: ఓటీటీ సంస్థలు యువతను అలరించే ప్రేమ కథా చిత్రాలను స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పవచ్చు. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, దేవికా సతీష్, మానస చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ఎస్.రంగస్వామి దర్శకత్వం వహించారు. రమణ ఆర్ట్స్ పతాకంపై ఏఎం సంపత్‌కుమార్ నిర్మించారు. త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
ఆరు ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో ఒక యువకుడు ఆరంభంలోనే విడాకుల కోసం న్యాయవాదిని ఆశ్రయిస్తారు. ఒక షాపులో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తున్న ఓ యువతిని ఆ షాపుకు వస్తువులు కొనడానికి వచ్చిన యువకుడికి తొలి చూపులోనే నచ్చేస్తుంది. దీంతో ఆమె కోసమే రోజూ ఆ షాపుకు వస్తాడు. అలా ఆ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమిస్తాడు. ఆ యువతి కూడా అతని ప్రేమలో పడటంతో ఇద్దరూ కాఫీ షాపులు, పార్కుల చుట్టూ తిరిగి ఎంజాయ్ చేస్తారు. అలాంటి వారి ప్రేమ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? అసలు ఆ యువకుడు ఎవరితో, ఎందుకు విడాకులు కోరుకున్నాడు? వీరి జీవితంలోకి మరో యువతి ఎలా ప్రవేశించింది? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ 'ఎమోజీ'.
ఇందులో రొమాన్స్ సన్నివేశాలకు కొదవ లేదు. వీజే ఆషిక్, ఆడుగళం నరేన్, ప్రియదర్శి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ తరం యువత ప్రేమకు అద్ధం పట్టే ఈ సిరీస్‌లో మహత్ రాఘవేంద్ర తన పాత్రను ఎంజాయ్ చేస్తూ నటించారు. హీరోయిన్లు కూడా తమ పరిధిలో నటించి అలరించారు. దీనికి సనత్ భరద్వాజ్ సంగీతాన్ని, జలంధర్ వాసన్ చాయాగ్రహణను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment