Mahath Raghavendra
-
రొమాంటిక్ వెబ్‌సిరీస్‌గా 'ఎమోజీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Emoji Web Series Will Streaming On Aha OTT: ఓటీటీ సంస్థలు యువతను అలరించే ప్రేమ కథా చిత్రాలను స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయని చెప్పవచ్చు. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. మహత్ రాఘవేంద్ర, దేవికా సతీష్, మానస చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ఎస్.రంగస్వామి దర్శకత్వం వహించారు. రమణ ఆర్ట్స్ పతాకంపై ఏఎం సంపత్‌కుమార్ నిర్మించారు. త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఆరు ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో ఒక యువకుడు ఆరంభంలోనే విడాకుల కోసం న్యాయవాదిని ఆశ్రయిస్తారు. ఒక షాపులో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తున్న ఓ యువతిని ఆ షాపుకు వస్తువులు కొనడానికి వచ్చిన యువకుడికి తొలి చూపులోనే నచ్చేస్తుంది. దీంతో ఆమె కోసమే రోజూ ఆ షాపుకు వస్తాడు. అలా ఆ యువతితో పరిచయం పెంచుకుని ప్రేమిస్తాడు. ఆ యువతి కూడా అతని ప్రేమలో పడటంతో ఇద్దరూ కాఫీ షాపులు, పార్కుల చుట్టూ తిరిగి ఎంజాయ్ చేస్తారు. అలాంటి వారి ప్రేమ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? అసలు ఆ యువకుడు ఎవరితో, ఎందుకు విడాకులు కోరుకున్నాడు? వీరి జీవితంలోకి మరో యువతి ఎలా ప్రవేశించింది? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన వెబ్ సిరీస్ 'ఎమోజీ'. ఇందులో రొమాన్స్ సన్నివేశాలకు కొదవ లేదు. వీజే ఆషిక్, ఆడుగళం నరేన్, ప్రియదర్శి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ తరం యువత ప్రేమకు అద్ధం పట్టే ఈ సిరీస్‌లో మహత్ రాఘవేంద్ర తన పాత్రను ఎంజాయ్ చేస్తూ నటించారు. హీరోయిన్లు కూడా తమ పరిధిలో నటించి అలరించారు. దీనికి సనత్ భరద్వాజ్ సంగీతాన్ని, జలంధర్ వాసన్ చాయాగ్రహణను అందించారు. -
ఎంత పని చేసింది!
‘బ్యాక్‌బెంచ్ స్టూడెంట్’ ఫేం మహత్ రాఘవేంద్ర, ‘ఉయ్యాలా జంపాలా’ ఫేం పునర్నవి భూపాలం జంటగా శివరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత పని చేశావె శిరీషా’. పట్లూరి బాలకృష్ణ, రామ్‌ప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల నిర్మించారు. ఈ చిత్రం బ్యానర్ లోగోను ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు పి.రామ్మోహన్, టైటిల్ లోగోను నిర్మాత అనిల్ సుంకర విడుదల చేశారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఓ చిన్న సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రం చూస్తుంటే సన్నిహితులతో ఆనందంగా గడిపినట్లు ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: విజయ్ కె.మడల, రామ్‌లక్ష్మణ్ మునిగంటి, లైన్ ప్రొడ్యూసర్: దిలీప్ బొలుగోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్యామ్ బోనాల. -
ఆమె నిరీక్షణ
‘‘మన సంస్కృతి, సంప్రదాయాలకు చాలా విలువలున్నాయి. వాటిని ఎలా కాపాడుకోవాలి? అనే అంశానికి భయాన్ని జోడించి తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమకథ ఇది’’ అని దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర అన్నారు. శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతన ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రల్లో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్‌రావ్(కన్నారావ్) నిర్మిస్తున్న చిత్రం ‘షీ’. ‘ఈజ్ వెయిటింగ్’ అనేది ఉపశీర్షిక. ‘‘ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుగుతోంది. పంచభూతాల నేపథ్యంలో ఈ పాట ఉంటుంది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది’’ అని చేతన ఉత్తేజ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బోలే, కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: గట్టు విజయ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బసంత్ రెడ్డి. -
ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'బన్ని n చెర్రి'
బస్టాప్ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంతో నటించిన యంగ్‌హీరో ప్రిన్స్, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమాతో క్రేజి యూత్‌ఫుల్ హీరోగా మారిన మహత్ రాఘవేంద్రులు హీరోలుగా, అందాలబామలు కృతి, సభా హీరోయిన్స్‌గా ప్రముఖ నిర్మాణసంస్థ మల్టీడైమన్షన్ సమర్పణలో, హరూన్ గని అర్ట్సు బ్యానర్లో నిర్మాత హరూన్ గనినిర్మిస్తున్నారు. రాజేష్ పులి దర్శకుడిగా పరాచయమవుతున్నారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరియూ కామెడి కింగ్ బ్రహ్మనందం కీలక పాత్రలు చేస్తున్నారు.