ఎంత పని చేసింది! | telangana film chamber entha pani chesave shireesha poster release | Sakshi
Sakshi News home page

ఎంత పని చేసింది!

Jun 9 2016 11:01 PM | Updated on Sep 4 2017 2:05 AM

ఎంత పని చేసింది!

ఎంత పని చేసింది!

‘బ్యాక్‌బెంచ్ స్టూడెంట్’ ఫేం మహత్ రాఘవేంద్ర, ‘ఉయ్యాలా జంపాలా’ ఫేం పునర్నవి భూపాలం జంటగా శివరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత పని చేశావె శిరీషా’.

‘బ్యాక్‌బెంచ్ స్టూడెంట్’ ఫేం మహత్ రాఘవేంద్ర, ‘ఉయ్యాలా జంపాలా’ ఫేం పునర్నవి భూపాలం జంటగా శివరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత పని చేశావె శిరీషా’. పట్లూరి బాలకృష్ణ, రామ్‌ప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల నిర్మించారు. ఈ చిత్రం బ్యానర్ లోగోను ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు పి.రామ్మోహన్, టైటిల్ లోగోను నిర్మాత అనిల్ సుంకర విడుదల చేశారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఓ చిన్న సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రం చూస్తుంటే సన్నిహితులతో ఆనందంగా గడిపినట్లు ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు: విజయ్ కె.మడల, రామ్‌లక్ష్మణ్ మునిగంటి, లైన్ ప్రొడ్యూసర్: దిలీప్ బొలుగోటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్యామ్ బోనాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement