న్యూఢిల్లీ : దేశమంతా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ పాటికే మీ మీ సోషల్ మీడియా సైట్ల ద్వారా సన్నిహితులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఉంటారు. కానీ కాస్తా క్రియేటివిటీగా శుభాకాంక్షలు తెలపాలనుకునే వారి కోసం ట్విటర్ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ రోజు సాధరణంగా ఎక్కువ మంది మూడు రంగుల జెండాతో ఉన్న సందేశాలనే పంపిస్తుంటారు. అలా కాకుండా కాస్తా భిన్నంగా ఎర్రకోట ఎమోజీని పంపిస్తే ఎలా ఉంటుంది.. ? చాలా బాగుంటుంది కదా. ఇలాంటి ఆలోచనతోనే ట్విటర్ తన యూజర్ల కోసం ఈ సదుపాయాన్ని కల్పించింది. అది కూడా మాతృభాషలో శుభాకాంక్షలు తెలిపివారికి మాత్రమే ఈ అవకాశం అంటుంది.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఎర్రకోట ఎమోజీని పంపిచాలనుకునే వారు మీ సందేశంతో పాటు ‘#IndependenceDayIndia’ను జత చేస్తే ఎరుపు రంగులో ఉన్న ఎమోజీ ఒకటి వస్తుంది. అది ఏంటంటే ఎర్రకోట. అవును మొఘలుల కాలంలో నిర్మించిన ఎర్రకోట.. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని ప్రసంగించే ఎర్రకోట ఎమోజీ వస్తుంది. అంతేకాక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే ‘#IndiaIndependenceDay’ హాష్‌ట్యాగ్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది అని తెలిపింది.
ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ కేవలం ట్విటర్ మాత్రమే కాక గెయింట్ సెర్చింజన్ గూగుల్ కూడా డూడుల్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయించింది. ఈ డూడుల్ మీద క్లిక్ చేస్తే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన వార్తా విశేషాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది గూగుల్.
Comments
Please login to add a commentAdd a comment