బ్యాన్‌ నుంచి బయటపడ్డ వాట్సాప్‌.. కానీ..! | Saudi Lifting Ban On Skype, WhatsApp Calls | Sakshi
Sakshi News home page

బ్యాన్‌ నుంచి బయటపడ్డ వాట్సాప్‌.. కానీ..!

Published Thu, Sep 21 2017 6:32 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

బ్యాన్‌ నుంచి బయటపడ్డ వాట్సాప్‌.. కానీ..!

బ్యాన్‌ నుంచి బయటపడ్డ వాట్సాప్‌.. కానీ..!

రియాద్‌ : సోషల్‌ మీడియా ఉపయోగిస్తున్న సౌదీ అరేబియా ప్రజలకు కాస్తంత ఊరట కలిగింది. ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా చేస్తున్న ఫోన్‌ కాల్స్‌ చేయడంపై ఉన్న నిషేధాన్ని నేడు ఎత్తివేస్తోంది. అయితే, మున్ముందు చేయబోయే ఫోన్‌ కాల్స్‌ను సెన్సార్‌ చేయనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి అదెల్‌ అబూ హమీద్‌ స్పష్టం చేశారు.

స్కైప్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, మెస్సెంజర్‌, వైబర్‌, తదితర ఆన్‌లైన్‌ సోషల్‌ మీడియా యాప్స్‌ ద్వారా చేయనున్న కాల్స్‌ అన్ని కూడా తమ నిబంధనలకు అనుగుణంగా ఉంటే వాటిని రాత్రంతా అనుమతిస్తామన్నారు. కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనలన్నీ కూడా కేవలం వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకోసమేనని తమ చట్టాలకు విరుద్ధంగా ఉన్నవాటిని మాత్రం నిషేధిస్తామని తెలిపారు. సెన్సార్‌ షిప్‌ అధికారుల అనుమతి లేకుండా ఏ ఒక్కరూ ఫోన్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ చేయలేరని కూడా స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement