Read News On Twitter, Users May Have To Pay For News Read From May 1st - Sakshi
Sakshi News home page

ట్విటర్​లో కొత్త రూల్ పాస్ చేసిన ఎలాన్ మస్క్.. రేపటి నుంచే అమలు

Published Sun, Apr 30 2023 1:31 PM | Last Updated on Sun, Apr 30 2023 2:29 PM

Twitter users have to pay for news read from may first - Sakshi

గత కొన్ని రోజుల నుంచి ట్విటర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు పర్వం, ఇటీవల ట్విటర్ లోగో మార్పుల్లో అవకతవకలు, ఇటీవల 'బ్లూటిక్' గోల. ఇలా అనునిత్యం ఏదో ఒక విధంగా ట్విటర్ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ట్విటర్ బాస్ మళ్ళీ ఓ కొత్త నిర్ణయంతో తెర మీదకు వచ్చేసాడు.

ఇక మీద ట్విట్టర్​లో వార్తలను ఫ్రీగా చదవాలనుకుంటే కుదరదు. ఎందుకంటే ఎలోన్ మస్క్ దీనికి కూడా డబ్బులు వసూలు చేయనున్నట్లు ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. ట్విటర్ వేదికగా వార్తలు చదవాలనుకునే వారు ఇప్పుడు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు వసూలు చేసుకునేందుకు ఆయా వార్తా సంస్థలకే మస్క్ అనుమతి కల్పించారు. ఆర్టికల్ ని బట్టి ధర నిర్ణయించుకునే అధికారాన్ని కల్పిస్తూ ట్వీట్ చేశారు.

ఈ కొత్త విధానం రేపటి (2023 మే 01) నుంచి అమలులోకి రానున్నట్లు ఎలోన్ మస్క్ తెలిపారు. అయితే సబ్స్క్రిషన్ సేవలు పొందుతున్న వారు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించారు. వారు ఫ్రీగా వార్తలు చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కొత్త ఫీచర్ వల్ల అటు మీడియా, ఇటు యూజర్ ఇద్దరూ లాభం పొందుతారని మస్క్ వెల్లడించారు.

(ఇదీ చదవండి: సైంటిస్ట్ నుంచి వేల కోట్ల కంపెనీ సారధిగా..! ఎవరీ అశ్విన్ డాని?)

ఇప్పటికే కొన్ని వార్తా సంస్థల వెబ్‌సైట్‌లో వార్తలను చదవాలంటే డబ్బు చెల్లించాల్సిందే, అలాంటి విధానాన్ని మస్క్ ఇప్పుడు ట్విట్టర్​లోకి తీసుకువచ్చారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సలహాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement