ఎలాన్ మస్క్ ట్విటర్ సంస్థను సొంతం చేసుకున్నప్పటి నుంచి అనుకోని మార్పులు, ఊహించని పరిణామాలను తీసుకువచ్చాడనే సంగతి అందరికి తెలుసు. ఇప్పుడు తాజాగా మరో కొత్త రూల్ పాస్ చేయడానికి శ్రీకారం చుట్టాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ట్విటర్ అకౌంట్‌లో ఇన్‌యాక్టివ్‌గా ఉండే అకౌంట్లను తీసివేయనున్నట్లు మస్క్ వెల్లడించాడు. ఖాతాదారులు చాలా రోజుల నుంచి తమ అకౌంట్‌ని ఇన్‌యాక్టివ్‌గా ఉంచితే వారి ఖాతాలను పూర్తిగా తొలగించే అవకాశం ఉందని కూడా ప్రస్తావించాడు. ఇదే జరిగితే మీ ఫాలోవర్స్ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.
మస్క్ తీసుకువచ్చే ఈ కొత్త రూల్ ప్రకారం, వినియోగదారుడు ట్విటర్ ఖాతాను కనీసం ప్రతి 30 రోజులకొకసారి తప్పకుండా లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఆలా కాకుండా మీరు మీ ఖాతాను లాగిన్ చేయకుండా ఉంటే దానిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత మీరు మీ ఖాతాను పూర్తిగా వినియోగించడానికి వీలుపడదు.
We’re purging accounts that have had no activity at all for several years, so you will probably see follower count drop
— Elon Musk (@elonmusk) May 8, 2023
కొన్ని నివేదికల ప్రకారం, నటి దీపికా పదుకొణె 2021 ఫిబ్రవరి నుంచి ట్విటర్ అకౌంట్‌లో యాక్టివ్‌గా లేదు. ఆమె చివరిసారిగా నోవాక్ జొకోవిచ్ షేర్ చేసిన చిత్రాన్ని లైక్ చేసింది. ఆ తరువాత ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్‌గా ఉంది. ఈ కారణంగా ఆమె తన అకౌంట్ కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment