ట్విటర్ సంస్థ 'ఎలాన్ మస్క్' (Elon Musk) చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నెన్నో అప్డేట్స్ పొందిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల ట్విటర్ 'ఎక్స్'గా మారింది. కాగా ఇప్పుడు ఇందులో వినియోగదారులు ఒక్క పోస్ట్ చేసినా డబ్బు చెల్లించాల్సిందే అంటూ వార్తలు వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి 'బెంజమిన్ నేతన్యాహూ' (Benjamin Netanyahu)తో జరిగిన ఒక చర్చలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. ఇప్పటికి 'ఎక్స్'కి 550 మిలియన్ యూజర్లు ఉన్నారని, వారందరూ ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తున్నట్లు.. ప్రతి రోజు 100 నుంచి 200 మిలియన్స్ పోస్టులు చేస్తున్నట్లు వెల్లడించాడు.
రానున్న రోజులు 'ఎక్స్'లో పోస్ట్ చేయాలనంటే కొంత డబ్బు చెల్లించే విధంగా మార్పులు తీసుకురానున్నట్లు మస్క్ తెలిపాడు. ఇది బాట్స్ సమస్యకు మంచి పరిష్కారమని అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది, చార్జెస్ ఎలా ఉంటాయనే వివరాలు వెలువడలేదు. బహుశా ఇది తక్కువ మొత్తంలో ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: నటి తాప్సీ కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
గత కొన్ని రోజులుగా ట్విటర్ ఆదాయం బాగా తగ్గిపోయినట్లు వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. యాడ్ సేల్స్ కూడా దాదాపు 50 శాతం తగ్గినట్లు కూడా తెలిసింది. ఇవన్నీ పరిష్కరించుకోవడానికి ఏదైనా కొత్త మార్పులు తీసుకురావాలి. ఇందులో భాగంగానే పోస్టుకి డబ్బు వసూలు చేయాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment