రైల్వే కొత్త రూల్‌.. ఒరిజినల్‌ ఐడీ లేకుండా రైలెక్కితే.. | Indian Railways New Rule Carry Original ID With Confirmed Tickets, Check Out The New Rules Inside | Sakshi
Sakshi News home page

రైల్వే కొత్త రూల్‌.. ఒరిజినల్‌ ఐడీ లేకుండా రైలెక్కితే..

Published Wed, Dec 18 2024 2:02 PM | Last Updated on Wed, Dec 18 2024 3:44 PM

Indian Railways New Rule Carry Original ID with Confirmed Tickets

దేశంలో అత్యధిక మంది ప్రయాణించే రవాణా సాధనం రైల్వేలు. రోజూ వేలాది రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. కాగా కన్ఫర్మ్‌డ్‌ టిక్కెట్లతో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఇండియన్‌ భారతీయ రైల్వే కొత్త ఆదేశాన్ని జారీ చేసింది.

ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పనిసరి
మీరు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను (ఈ-టికెట్లు) బుక్ చేసుకుంటే ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే టిక్కెట్ తనిఖీ చేసే టీటీఈ మిమ్మల్ని టిక్కెట్టు లేని ప్రయాణికుడిగా పరిగణించి జరిమానా విధించవచ్చు. మీ టిక్కెట్‌ను రద్దు చేసి, రైలు నుండి మిమ్మల్ని దించేయవచ్చు.

అంగీకరించే ఐడీ ప్రూఫ్‌లు ఇవే.. 
» ఆధార్ కార్డ్
» పాస్‌పోర్ట్
» ఓటరు గుర్తింపు కార్డు
» డ్రైవింగ్ లైసెన్స్
» పాన్ కార్డ్
» ఫోటోతో ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఐడీ

» ఈ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌లలో ఏదో ఒకదానిని ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైల్వేలు ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప ఫోటోకాపీలు లేదా డిజిటల్ ఐడీలను అంగీకరించరు.

ఒరిజినల్ ఐడీ లేకపోతే ఏమౌంది?
మీ వద్ద ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ లేకపోతే మీ ఈ-టికెట్ చెల్లనిదిగా పరిగణించి టీటీఈ జరిమానా విధిస్తారు. మీకు కన్ఫర్మ్‌ అయిన సీటును రద్దు చేయవచ్చు. విధించే జరిమానాలు ఏసీ తరగతులకైతే టిక్కెట్ ధరతో పాటు రూ.440, అదే స్లీపర్ క్లాస్ అయితే టిక్కెట్ ధరతో పాటు రూ.220 ఉంటుంది. జరిమానా కట్టినా కూడా మళ్లీ మీకు  కేటాయింపు ఉండదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement