id proof
-
రైల్వే కొత్త రూల్.. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..
దేశంలో అత్యధిక మంది ప్రయాణించే రవాణా సాధనం రైల్వేలు. రోజూ వేలాది రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. కాగా కన్ఫర్మ్డ్ టిక్కెట్లతో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఇండియన్ భారతీయ రైల్వే కొత్త ఆదేశాన్ని జారీ చేసింది.ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిమీరు ఆన్లైన్లో టిక్కెట్లను (ఈ-టికెట్లు) బుక్ చేసుకుంటే ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే టిక్కెట్ తనిఖీ చేసే టీటీఈ మిమ్మల్ని టిక్కెట్టు లేని ప్రయాణికుడిగా పరిగణించి జరిమానా విధించవచ్చు. మీ టిక్కెట్‌ను రద్దు చేసి, రైలు నుండి మిమ్మల్ని దించేయవచ్చు.అంగీకరించే ఐడీ ప్రూఫ్‌లు ఇవే.. » ఆధార్ కార్డ్» పాస్‌పోర్ట్» ఓటరు గుర్తింపు కార్డు» డ్రైవింగ్ లైసెన్స్» పాన్ కార్డ్» ఫోటోతో ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఐడీ» ఈ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌లలో ఏదో ఒకదానిని ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైల్వేలు ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప ఫోటోకాపీలు లేదా డిజిటల్ ఐడీలను అంగీకరించరు.ఒరిజినల్ ఐడీ లేకపోతే ఏమౌంది?మీ వద్ద ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ లేకపోతే మీ ఈ-టికెట్ చెల్లనిదిగా పరిగణించి టీటీఈ జరిమానా విధిస్తారు. మీకు కన్ఫర్మ్ అయిన సీటును రద్దు చేయవచ్చు. విధించే జరిమానాలు ఏసీ తరగతులకైతే టిక్కెట్ ధరతో పాటు రూ.440, అదే స్లీపర్ క్లాస్ అయితే టిక్కెట్ ధరతో పాటు రూ.220 ఉంటుంది. జరిమానా కట్టినా కూడా మళ్లీ మీకు కేటాయింపు ఉండదు. -
రూ. 2000 నోట్ల ఎక్స్చేంజ్కి అవి అవసరం లేదన్న ఎస్బీఐ
SBI: ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లను ఉపసంహరించనున్నట్లు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ మే 23 నుంచి మొదలవుతుంది. రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవాలనుకునే వారు లేదా డిపాజిట్ చేసుకోవాలనుకునే వారు సమీపంలో ఉన్న ఏ బ్యాంకునైనా ఉపయోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: నోట్ల ఉపసంహరణ సామాన్యులపైనా ప్రభావం చూపుతుందా? ఆర్బీఐ సమాధానం ఏంటంటే?) ఈ నోట్లను మార్చుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 30లోపల మార్చుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సమయంలో కొంతమంది ప్రజలు ఎలా మార్చుకోవాలి? బ్యాంకులో ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించాలా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమాధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేదా రిక్వైజేషన్ స్లిప్ వంటివి అవసరం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ప్రజలు తమ బ్యాంకు ఖాతలో నిర్దిష్ట గడువులోపల డిపాజిట్ చేసుకోవచ్చని కూడా వెల్లడించింది. -
బొట్టుందని పింఛను ఇవ్వం పొమ్మన్నారు!
భర్త పింఛనుకు భార్య అర్హురాలు అని చెప్పిన చట్టానికి.. భర్త చనిపోయాక భార్య ఎలా ఉండాలో చెప్పే అధికారం ఉంటుందా?! అత్తగారి వయసు 77 ఏళ్లు. గత నెలలో ఆమె భర్త మరణించారు. అప్పటికి ఆయన వయసు 82 ఏళ్లు. చెన్నై పోర్ట్ ట్రస్ట్‌లోని ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగంలో ఉన్న ‘సెటిల్మెంట్ వింగ్’లో పని చేస్తూ ఆయన 1993లో పదవీ విరమణ పొందారు. అప్పట్నుంచీ పింఛను వస్తోంది. నిబంధనల ప్రకారం భర్త చనిపోయాక, భార్య బతికి ఉన్నంత వరకు ఆమెకు ఆ పింఛను మొత్తంలో 70 శాతం వస్తుంది. అత్తగారిని తీసుకుని ఆమె కోడలు పింఛను దరఖాస్తు ఫారాలను ఇవ్వడం కోసం సెటిల్మెంట్ వింగ్‌కి వెళ్లారు. అక్కడ వీళ్లపని చూడవలసింది రవి అనే అధికారి. వీళ్లు వెళ్లేటప్పటికి ఆయన నిద్రపోతున్నాడు! ఆయన్ని లేపి, వచ్చిన పని గురించి చెప్పింది కోడలు. నింపుకొచ్చిన ఫారాలను కూడా ఇచ్చింది. అత్తగారి ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అడిగాడు ఆఫీసర్. వాటిని కూడా ఇచ్చింది. ఆమె అత్తగారు నాలుగు నెలల క్రితం తీయించుకున్న ఫొటో అది. ఎదురుగా ఉన్న అత్తగారిని, ఫొటోలో ఉన్న అత్తగారిని మార్చిమార్చి చూసి, ‘‘ఈ ఫొటో పనికిరాదు. వేరేది తీసుకురండి’’ అనేశాడు. కోడలు ఆశ్చర్యపోయింది. ‘‘ఫొటోలో మీ అత్తగారు బొట్టుతో ఉన్నారు. భర్త చనిపోయిన మనిషి బొట్టుతో ఉండకూడదు’’ అని చెప్పాడు అధికారి. ఆయనే ఇంకో మాట కూడా అన్నాడు. ‘‘ఇప్పుడు తీయించుకునే ఫొటోలోనైనా మీ అత్తగారు తలగుడ్డ కప్పుకుని ఉండాలి. కుంకుమ బొట్టుకు బదులుగా విబూది పెట్టుకుని ఉండాలి’’ అని చెప్పాడు. ‘‘అయినా ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలా! భర్త చనిపోయిన స్త్రీ ఎక్కడైనా బొట్టు పెట్టుకుంటుందా?’’ అన్నాడు. ఆ మాటకు కోడలు మనసు గాయపడింది. అత్తగారిని ఆ అధికారి అలా అనడం ఆమెకు నచ్చలేదు. ‘‘బొట్టుతో ఉంటే తప్పేంటి?’’ అని కోడలు ప్రశ్నించింది. దాంతో అతడికి కోపం వచ్చింది. ఫొటోతో వచ్చేటప్పుడు రేషన్ కార్డు కూడా తీసుకురండి అని మెలిక పెట్టాడు. నిజానికి రేషన్ కార్డు అవసరం లేదు. అయినా తెమ్మన్నాడు! కోడలి పేరు మాధురి. ఆమె తన అత్తగారికి (అత్తగారి పేరును గోప్యంగా ఉంచాం) జరిగిన అవమానాన్ని పై అధికారికి తెలియజేసింది. ఆయనా అలాగే అన్నాడు. ‘‘వాళ్లంతేనమ్మా’’ అని! ఇవన్నీ అలా ఉంచండి, అత్తగారు అపరాధభావంలో కూరుకుపోయారట! ‘‘నేను తప్పు చేశాను. ముందే.. బొట్టు లేకుండా ఫొటో తీయించుకుని వెళ్లవలసింది’’ అంటూ ఆమె విలపించడం చూసి కోడలు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చింది. ఒకవేళ ఆ పెద్దావిడ.. భర్త చనిపోయాక కూడా బొట్టు పెట్టుకుంటున్నా కూడా ప్రశ్నించడానికి చట్టానికి గానీ, సమాజానికి గానీ ఏం హక్కు ఉంటుంది? ఏమో.. భర్తే చెప్పి ఉండొచ్చు కదా.. నువ్వు ఎప్పటికీ బొట్టు తియ్యడానికి లేదని. అవన్నీ వ్యక్తిగతమైన విషయాలు. భర్త పింఛనుకు భార్య అర్హురాలు అని చెప్పిన చట్టానికి, భర్త చనిపోయాక భార్య ఎలా ఉండాలో చెప్పే అధికారం ఉంటుందా?! నిబంధనలు ఎన్ని ఉన్నా.. ఆయన భార్యే ఈవిడ అనే ఒక్క సాక్ష్యం సరిపోదా.. ఈ పండుటాకుకు గౌరవప్రదంగా పింఛను జారీ చెయ్యడానికి! -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఐడీ ప్రూఫ్‌గా ఆధార్
న్యూఢిల్లీ: వచ్చేనెల 18న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు జారీ చేసిన అడ్మిట్ కార్డుల్లో ఫొటో సరిగ్గా లేనట్లయితే గుర్తింపు కార్డుగా ఆధార్‌ను కూడా తీసుకురావచ్చని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఎన్నికల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని గుర్తింపు కార్డుగా తీసుకురావచ్చని తెలిపింది. వీటితో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను కూడా తప్పనిసరిగా తీసుకు రావాలని యూపీఎస్సీ పేర్కొంది. -
దర్యాప్తు అయ్యాకే దత్తత
నాకు పెళ్లై పన్నెండేళ్లయ్యింది. పిల్లలు పుట్టే అవకాశం లేదని నిర్ధారించుకున్న తరువాత ఓ బిడ్డను దత్తత చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా బంధువుల్లో ఒకరికి ఇటీవలే ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డను మాకు దత్తత ఇవ్వడానికి అంగీకరించారు. చట్టపరంగా చిక్కులు రాకుండా దత్తత చేసుకోవడానికి ఏదైనా ప్రొసీజర్ ఉంటుందా? - పి.నీలవేణి, కరీంనగర్ దత్తత అనేది ఎప్పుడూ చట్టబద్ధంగానే చేసుకోవాలి. అది కోర్టు సమక్షంలో జరిగితేనే మంచిది. ముఖ్యంగా దత్తత తీసుకునేవారికి. ఎందుకంటే... చట్టపరంగా దత్తత చేసుకోకపోతే, ఎప్పుడైనా అసలు తల్లిదండ్రులు వచ్చి అడిగితే బిడ్డను ఇవ్వను అనే హక్కు మీకు ఉండదు. కాబట్టి మీరు వెంటనే ఓ మంచి లాయర్‌ను కలవండి. వారికి విషయం చెబితే కోర్టులో ఒక సూట్ ఫైల్ చేస్తారు. కోర్టువారు పిలిచిన రోజున మీ దంపతులు పాపని, పాప అసలు తల్లిదండ్రుల్ని తీసుకుని కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. మీ రెసిడెన్స్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్, ఆదాయ వివరాలకు సంబంధించిన పత్రాలను కోర్టు అడుగుతుంది. వాటితో పాటు మీవి, పాపవి, పాప తల్లిదండ్రుల ఫొటోలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పాపని ఎందుకు దత్తత తీసుకుంటున్నారు, నిజంగా పిల్లలు అవసరమై చేసుకుంటున్నారా లేక వేరే ఏదైనా ఉద్దేశం ఉందా వంటి విషయాలు దర్యాప్తు చేస్తారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక బిడ్డ మీద పూర్తి హక్కులు కల్పిస్తూ తీర్పు ఇస్తారు. ఐదారు నెలల లోపే ప్రాసెస్ పూర్తయిపోతుంది. మగపిల్లాడయినా, ఆడపిల్లయినా ఒకటే పద్ధతి. అయితే దత్తత విషయంలో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి. కొందరు మధ్యవర్తులు తాము చేసేస్తామని చెప్పి, అఫిడవిట్లు రాసి, నోటరీ చేయించి ప్రాసెస్ పూర్తయిందని చెబుతున్నారు. అలాంటివారిని నమ్మకండి. లాయర్ ద్వారా జడ్జిగారి ముందు జరిగేదే నిజమైన అడాప్షన్ అన్న విషయం గుర్తుంచుకోండి. - నిశ్చల సిద్ధారెడ్డి, న్యాయవాది -
సిమ్.. క్రైమ్
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్: అన్ని కంపెనీల సిమ్‌లు మొబైల్షాపుల్లోనేగాక పాన్‌షాపులు, కిరాణాషాపులు, జిరాక్స్ సెంటర్లు, ఇతరాత్రా షాపుల్లో కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఫొటోతోపాటు గుర్తింపుకార్డు జిరాక్స్ ఇస్తే చాలు.. సిమ్‌కార్డు ఇచ్చేస్తున్నారు. అదే రోజు సాయంత్రం వరకు సిమ్ యూక్టివేట్ అవుతోంది. అయితే యూక్టివేట్ చేయడానికి ముందు ఆయూ కంపెనీల కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫోన్ చేసి పేరు, చిరునామా తదితర పూర్తి వివరాలు మరోసారి చెబితే సరిపోతుంది. ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియూ) నిబంధనల ప్రకారం ఒక గుర్తింపుకార్డుతో ఒక వ్యక్తి 10 వరకు సిమ్ కార్డులు పొందవచ్చు. కంపెనీలు ఇచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆయూ కంపెనీల సిమ్‌లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇంతవర కు బాగానే ఉంది. కానీ కొందరు సిమ్ విక్రేతలు షాపులో వినియోగదారులు సమర్పించిన ఫొటోలు, గుర్తింపుకార్డులను యజమానులు స్కాన్ చేసి.. ప్రింట్ తీస్తున్నారు. ఒక్కో వ్యక్తి పేరుతో వివిధ కంపెనీలకు చెందిన ఐదారు సిమ్ల వరకు యూక్టివేట్ చేసి తమ టార్గెట్‌కు చేరువవుతున్నారు. ఇలా గుర్తింపుకార్డులో వ్యక్తికి తెలియకుండానే సిమ్‌లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. ఓ మొబైల్ కంపెనీలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న యువకుడి గుర్తింపుకార్డునే ఓ కిరాణషాపు యజమాని వాడేశాడు. వినియోగదారుల వివరాలు ఎంట్రీ చేసే క్రమంలో సదరు ఆపరేటర్ పేరు, చిరునామా అతనికే రావడంతో అవాక్కయ్యాడు. దీంతో అతడు కిరాణాషాపు యజమానిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాజాగా ఈ నెల 8న పర కాల పోలీస్‌స్టేషన్‌లో కూడా ఇలాంటి కేసు నమోదు కావడంతో సెల్పాయింట్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల దర్యాప్తులో మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఒక సిమ్‌కార్డుతో అసలు వ్యక్తి ఒకటి లేదా రెండు సిమ్‌లు తీసుకుంటే మిగతా సిమ్‌లు అదే పేరుతో చలామణి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సిమ్‌లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే పరిస్థితి ఏమిట ని ప్రజలు, పోలీసులు ఆందోళన చెందుతున్నారు. సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ ఆధారంగా ఛేదించాల్సిన కొన్ని కేసుల్లో ఇలాంటి సిమ్‌లు వాడిన నేరస్తుడిని పట్టుకోవడం తలనొప్పిగా మారనుంది. అంతేగాక సంబంధం లేని వ్యక్తులు ఇబ్బందిపడే ప్రమాదముంది. తప్పుడు సిమ్‌కార్డుల సంస్కృతి పెరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మార్కెట్లో ఇలాంటి సంస్కృతిని పెంచిపోషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఈ తరహా నేరాలు పునరావృతం కావని అభిప్రాయపడుతున్నారు. పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తరహా లోనే ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకున్న వారి అడ్రస్‌ను పూర్తిగా తనిఖీ చేస్తే ఈ తరహా నేరాలను అరికట్టవచ్చు.