SBI: ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లను ఉపసంహరించనున్నట్లు అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ మే 23 నుంచి మొదలవుతుంది. రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవాలనుకునే వారు లేదా డిపాజిట్ చేసుకోవాలనుకునే వారు సమీపంలో ఉన్న ఏ బ్యాంకునైనా ఉపయోగించుకోవచ్చు.
(ఇదీ చదవండి: నోట్ల ఉపసంహరణ సామాన్యులపైనా ప్రభావం చూపుతుందా? ఆర్‌బీఐ సమాధానం ఏంటంటే?)
ఈ నోట్లను మార్చుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 30లోపల మార్చుకోవాలని ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సమయంలో కొంతమంది ప్రజలు ఎలా మార్చుకోవాలి? బ్యాంకులో ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించాలా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమాధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలాంటి ఐడీ ప్రూఫ్ లేదా రిక్వైజేషన్ స్లిప్ వంటివి అవసరం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ప్రజలు తమ బ్యాంకు ఖాతలో నిర్దిష్ట గడువులోపల డిపాజిట్ చేసుకోవచ్చని కూడా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment