వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్: అన్ని కంపెనీల సిమ్‌లు మొబైల్‌షాపుల్లోనేగాక పాన్‌షాపులు, కిరాణాషాపులు, జిరాక్స్ సెంటర్లు, ఇతరాత్రా షాపుల్లో కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఫొటోతోపాటు గుర్తింపుకార్డు జిరాక్స్ ఇస్తే చాలు.. సిమ్‌కార్డు ఇచ్చేస్తున్నారు. అదే రోజు సాయంత్రం వరకు సిమ్ యూక్టివేట్ అవుతోంది. అయితే యూక్టివేట్ చేయడానికి ముందు ఆయూ కంపెనీల కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫోన్ చేసి పేరు, చిరునామా తదితర పూర్తి వివరాలు
మరోసారి చెబితే సరిపోతుంది. ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియూ) నిబంధనల ప్రకారం ఒక గుర్తింపుకార్డుతో ఒక వ్యక్తి 10 వరకు సిమ్ కార్డులు పొందవచ్చు. కంపెనీలు ఇచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆయూ కంపెనీల సిమ్‌లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇంతవర కు బాగానే ఉంది.
కానీ కొందరు సిమ్ విక్రేతలు షాపులో వినియోగదారులు సమర్పించిన ఫొటోలు, గుర్తింపుకార్డులను యజమానులు స్కాన్ చేసి.. ప్రింట్ తీస్తున్నారు. ఒక్కో వ్యక్తి పేరుతో వివిధ కంపెనీలకు చెందిన ఐదారు సిమ్‌ల వరకు యూక్టివేట్ చేసి తమ టార్గెట్‌కు చేరువవుతున్నారు. ఇలా గుర్తింపుకార్డులో వ్యక్తికి తెలియకుండానే సిమ్‌లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. ఓ మొబైల్ కంపెనీలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న యువకుడి గుర్తింపుకార్డునే ఓ కిరాణషాపు యజమాని వాడేశాడు. వినియోగదారుల వివరాలు ఎంట్రీ చేసే క్రమంలో సదరు ఆపరేటర్ పేరు, చిరునామా అతనికే రావడంతో అవాక్కయ్యాడు. దీంతో అతడు కిరాణాషాపు యజమానిపై సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
తాజాగా ఈ నెల 8న పర కాల పోలీస్‌స్టేషన్‌లో కూడా ఇలాంటి కేసు నమోదు కావడంతో సెల్‌పాయింట్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల దర్యాప్తులో మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఒక సిమ్‌కార్డుతో అసలు వ్యక్తి ఒకటి లేదా రెండు సిమ్‌లు తీసుకుంటే మిగతా సిమ్‌లు అదే పేరుతో చలామణి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సిమ్‌లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే పరిస్థితి ఏమిట ని ప్రజలు, పోలీసులు ఆందోళన చెందుతున్నారు. సెల్‌ఫోన్ కాల్‌లిస్ట్ ఆధారంగా ఛేదించాల్సిన కొన్ని కేసుల్లో ఇలాంటి సిమ్‌లు వాడిన నేరస్తుడిని పట్టుకోవడం తలనొప్పిగా మారనుంది.
అంతేగాక సంబంధం లేని వ్యక్తులు ఇబ్బందిపడే ప్రమాదముంది. తప్పుడు సిమ్‌కార్డుల సంస్కృతి పెరగకముందే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మార్కెట్‌లో ఇలాంటి సంస్కృతిని పెంచిపోషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఈ తరహా నేరాలు పునరావృతం కావని అభిప్రాయపడుతున్నారు. పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ తరహా లోనే ప్రీపెయిడ్ కనెక్షన్ తీసుకున్న వారి అడ్రస్‌ను పూర్తిగా తనిఖీ చేస్తే ఈ తరహా నేరాలను అరికట్టవచ్చు.