railway ticket
-
రైల్వే కొత్త రూల్.. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..
దేశంలో అత్యధిక మంది ప్రయాణించే రవాణా సాధనం రైల్వేలు. రోజూ వేలాది రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. కాగా కన్ఫర్మ్డ్ టిక్కెట్లతో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఇండియన్ భారతీయ రైల్వే కొత్త ఆదేశాన్ని జారీ చేసింది.ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పనిసరిమీరు ఆన్లైన్లో టిక్కెట్లను (ఈ-టికెట్లు) బుక్ చేసుకుంటే ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే టిక్కెట్ తనిఖీ చేసే టీటీఈ మిమ్మల్ని టిక్కెట్టు లేని ప్రయాణికుడిగా పరిగణించి జరిమానా విధించవచ్చు. మీ టిక్కెట్‌ను రద్దు చేసి, రైలు నుండి మిమ్మల్ని దించేయవచ్చు.అంగీకరించే ఐడీ ప్రూఫ్‌లు ఇవే.. » ఆధార్ కార్డ్» పాస్‌పోర్ట్» ఓటరు గుర్తింపు కార్డు» డ్రైవింగ్ లైసెన్స్» పాన్ కార్డ్» ఫోటోతో ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఐడీ» ఈ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌లలో ఏదో ఒకదానిని ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైల్వేలు ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప ఫోటోకాపీలు లేదా డిజిటల్ ఐడీలను అంగీకరించరు.ఒరిజినల్ ఐడీ లేకపోతే ఏమౌంది?మీ వద్ద ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ లేకపోతే మీ ఈ-టికెట్ చెల్లనిదిగా పరిగణించి టీటీఈ జరిమానా విధిస్తారు. మీకు కన్ఫర్మ్ అయిన సీటును రద్దు చేయవచ్చు. విధించే జరిమానాలు ఏసీ తరగతులకైతే టిక్కెట్ ధరతో పాటు రూ.440, అదే స్లీపర్ క్లాస్ అయితే టిక్కెట్ ధరతో పాటు రూ.220 ఉంటుంది. జరిమానా కట్టినా కూడా మళ్లీ మీకు కేటాయింపు ఉండదు. -
రైల్వేకే చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. ఇలా మీకైతే ఏం చేస్తారు?
Rs 10000 Fine On Indian Railways : దేశంలో అత్యధిక మంది ప్రయాణించే సాధనం రైల్వేలు. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే రైళ్లలో ఎదురయ్యే అసౌకర్యాలతో ప్రతిఒక్కరూ ఎప్పుడోసారి ఇబ్బంది పడే ఉంటారు. ఇలా అసౌకర్యానికి గురైన ఓ ప్రయాణికుడు రైల్వేకు, ఐఆర్సీటీసీకి చుక్కలు చూపించాడు. పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన కుటుంబానికి బెర్త్‌లను సెకెండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేసినందుకు రూ.10,000 మొత్తాన్ని చెల్లించాలని నార్తన్ రైల్వే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC )ను చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. జిరాక్‌పూర్‌కు చెందిన పునీత్ జైన్ 2018 ఆగస్టులో తనకు, తన కుటుంబానికి వైష్ణో దేవి నుంచి చండీగఢ్‌కి శ్రీ వైష్ణో దేవి-కల్కా ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కొక్కరికీ రూ. 2,560 చొప్పున సెకెండ్ ఏసీ టిక్కెట్లను కొనుగోలు చేశారు. అయితే అతను తన కుటుంబంతో సహా 2018 అక్టోబర్ 20న కట్రా రైల్వే స్టేషన్‌కు చేరుకోగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారి బెర్త్‌లను డౌన్‌గ్రేడ్ చేశారు. సమస్యను టీటీఈ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. దీంతో వారు థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించవలసి వచ్చింది. సెకెండ్ ఏసీ సౌకర్యాలను కోల్పోయిన వారు థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లోని అసౌకర్యాలతో ఇబ్బందులు పడ్డారు. దీని తర్వాత బాధితుడు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ టిక్కెట్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాపసు చేయాలని కోరగా తిరస్కరణ ఎదురైంది. అనంతరం సబ్ డివిజనల్ మేనేజర్‌కు మొత్తం విషయాన్ని ఈమెయిల్లో పంపాడు. జైన్ అవసరమైన సర్టిఫికేట్ అందించలేదని, అది కూడా చాలా కాలం తర్వాత సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చాడని, ఇది ఇప్పుడు పరిష్కరించడానికి వీలుకాదని నార్తన్ రైల్వే సబ్-డివిజనల్ మేనేజర్/డివిజనల్ మేనేజర్ చేతులెత్తేశారు. ఇక ఈ విషయంపై ఐఆర్సీటీసీ వాదన ఏమిటంటే తాము కేవలం ఆన్లైన్ బుకింగ్ సర్వీస్ మాత్రమే అందిస్తామని, జైన్ కోరిన ఉపశమనాలకు బాధ్యత వహించమని చెబుతోంది. సేవలో లోపం నార్తన్ రైల్వే, ఐఆర్సీటీసీ అవలంభించిన అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కారణంగా బాధితుడికి ఇబ్బంది కలిగిందని జైన్‌కు అనుకూలంగా కమిషన్ తీర్పునిచ్చింది. రూ. 1,005 లను 2018 అక్టోబర్ 20 నుండి 9 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలని, దీంతో పాటు రూ. 5,000 నష్ట పరిహారం, రూ. 4,000 వ్యాజ్యం ఖర్చులు చెల్లించాలని నార్తన్ రైల్వే, ఐఆర్సీటీలను ఆదేశించింది. -
76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్..ధర ఎంతో తెలుసా!
76 ఏళ్ల క్రితం నాటి రైల్వే టిక్కెట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ ధర వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తొమ్మిది మంది ప్రయాణానికి టిక్కెట్ ధర వింటే షాక్ అవుతారు. నెటిజన్లు కూడా ఈ టిక్కెట్‌ని చూసి ఫిదా అవుతూ.. తెగ కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. వివరాల్లోకెళ్తే..పాకిస్తాన్ నుంచి భారత్‌కు వెళ్లే ఓ పాత టిక్కెట్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. ఇది 1947 ఏళ్ల నాటి టిక్కెట్. అంటే దాదాపు 76 ఏళ్ల క్రితం నాటిది. ఈ టిక్కెట్ చూస్తే ఒక కుటుంబం పాకిస్తాన్‌లోని రావల్పిండి నుంచి అమృత్సర్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఆ టిక్కెట్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17, 1947లో సుమారు తొమ్మిది మంది రావల్పండి నుంచి అమృత్సర్ వెళ్లేందుకు కొనుగోలు చేసిన టిక్కెట్ అది. ఆ టిక్కెట్ ధర సరిగ్గా 36 రూపాయాల తొమ్మిది అణాలు. బహుశా ఆ కుటుంబం భారత్‌కి వలస వచ్చింది కాబోలు. ఐతే నెటిజన్లను మాత్రం ఈ టిక్కెట్ బాగా ఆకర్షించింది. గతం తాలుకా జ్ఞాపకం అని "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అంటూ మెచ్చుకుంటున్నారు. అదీగాక 76 ఏళ్ల క్రితం నాటి టిక్కెట్ చెక్కు చెదరకుండా ఉండటం చాలా గ్రేట్ అంటు పొగడ్తల జల్లు కురిపించారు. మరోక నెటిజన్ తన వద్ద 1949లో కొన్న ఉషా కుట్టు మిషన్ రసీదు నా వద్ద ఇంకా చెక్కు చెదరకుండా ఉందని చెబుతున్నాడు. అంతేగాదు ఈ టిక్కెట్ ధర ఆ సమయంలో ఖరీదైనదేనదేనని, ఎందుకంటే ఆరోజుల్లో సగటే లేబర్ చార్జీలు 15 పైసలు మాత్రమేనని చెబుతున్నారు. అయితే ఈ టిక్కెట్ ఖరీదు ప్రకారం పాక్‌లోని రావల్పిండి నుంచి అమృత్‌సర్‌కి ఒక్కో వ్యక్తికి రూ. 4 అంటే అత్యంత ఖరీదేనని తేల్చేశారు నెటిజన్లు. (చదవండి: వాట్ ఏ గట్స్ బాస్! నీ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్!) -
'వాళ్ల కోసం నింగి నుంచి నక్షత్రాలైనా తెస్తారు..కానీ ప్రజలకు మాత్రం'
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇకపై సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించిన మరునాడే ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 'ప్రకటనల కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రధానికి కొత్త విమానం కొనుక్కోవడానికి డబ్బులుంటాయి. పారిశ్రామిక రంగంలోని స్నేహితులకు పన్ను రాయితీలు చేస్తున్న ప్రభుత్వం వద్ద దేశంలోని సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ కోసం 1500 కోట్లు లేవా? కేంద్రం తన స్నేహితుల కోసం ఆకాశం నుంచి నక్షత్రాలైనా తీసుకొస్తుంది కానీ ప్రజలను మాత్రం రూపాయి కోసం కష్టపడేలా చేస్తుంది' అని రాహుల్ ధ్వజమెత్తారు. विज्ञापनों का ख़र्च: ₹911 Cr नया हवाई जहाज़: ₹8,400 Cr पूंजीपति मित्रों के टैक्स में छूट: ₹1,45,000 Cr/साल लेकिन सरकार के पास बुज़ुर्गों को रेल टिकट में छूट देने के लिए ₹1500 करोड़ नहीं हैं। मित्रों के लिए तारे तक तोड़ कर लाएंगे, मगर जनता को कौड़ी-कौड़ी के लिए तरसाएंगे। — Rahul Gandhi (@RahulGandhi) July 22, 2022 2020 వరకు సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో 50శాతం వరకు రాయితీ ఇచ్చేది కేంద్రం. కానీ కరోనా కారణంగా దాన్ని నిలిపివేసింది. అయితే ఇకపై కూడా రాయితీ ఇచ్చే ఆలోచన లేదని బుధవారం పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అలా చేస్తే రైల్వేకు నష్టాలు వస్తాయని తెలిపింది. క్రీడాకారులకు కూడా ఇకపై రాయితీ ఉండబోదని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. చదవండి: సావర్కర్ కాదు భగత్ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్ -
రైల్వే టికెట్‌తో ఇబ్బందులు
రైల్వే శాఖ తప్పిదంతో మానసిక వేదన అనుభవించిన ఆ వృద్ధుడు.. చివరకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. బలవంతంగా రైలు దించేయటంతో రైల్వే శాఖపై పోరాటానికి దిగారు. ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... లక్నో: షరన్పూర్కు చెందిన రిటైర్డ్ ఫ్రొఫెసర్ విష్ణుకాంత్ శుక్లా(72) 2013లో నవంబర్ 19వ తేదీన కన్నౌజ్ వెళ్లేందుకు టికెట్‌ను తీసుకున్నారు. అయితే టికెట్ ప్రింట్ మీద 2013కి బదులు.. 3013గా ముద్రణ అయ్యింది. అది గమనించని విష్ణుకాంత్.. రైల్వే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు. టీసీ తనిఖీలో వెయ్యి సంవత్సరాల తర్వాత తేదీ ముద్రించి ఉండటం గమనించిన ఆయన ఖంగుతిన్నారు. టీసీ రూ.800 ఫైన్ రాయటంతో ఆయన వాగ్వాదానికి దిగాడు. చివరకు ఆర్పీఎఫ్ పోలీసుల సాయంతో ఆయన్ని బలవంతంగా తర్వాతి స్టేషన్లో కిందకు దించేశారు. ఈ వ్యవహారంపై ఆయన షరన్పూర్ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా, విచారణ కొనసాగుతూ వస్తోంది. ‘అందరి ముందు తనను అవమానించారని, అందుకు పరిహారం చెల్లించాలని’ విష్ణుకాంత్ వాదించగా, టికెట్ జారీ అయ్యాక పరిశీలించుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులదేనని రైల్వే శాఖ వాదించింది. అయితే ఫోరమ్ చైర్మన్ మాత్రం రైల్వే శాఖ వాదనతో విబేధించారు. ‘70 ఏళ్ల వృద్ధుడ్ని మానసికంగా హింసించినందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని’ రైల్వే శాఖను ఆదేశించింది. పరిహారం కింద రూ.10,000 మరియు టికెట్ ధర.. వడ్డీతో కలిపి మరో రూ.3 వేలు చెల్లించాలని ఫోరమ్ బుధవారం తీర్పు వెలువరించింది. -
ఆధార్’తో నెలకు 12 రైల్వే టికెట్లు
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఈ పోర్టల్ నుంచి ఒక నెలలో 12 టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధికారులు చెప్పారు. అక్టోబర్ 26 నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని ప్రకటించారు. గతంలో ఈ పోర్టల్ ద్వారా ఒక నెలలో ఆరు టికెట్లు మాత్రమే ఇచ్చేవారు. ఆరు కంటే ఎక్కువ టికెట్లు కావాల్సిన వారు ఐఆర్సీటీసీ మై పోర్టల్‌లోని కేవైసీలో ఆధార్ నంబర్ వివరాలను అప్లోడ్ చేసుకోవాలి. దీని కోసం నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు వన్‌టైం పాస్వర్డ్ వస్తుంది. అయితే ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోని వారు ఎప్పటిలాగే ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. -
ఘాట్ల వద్దే రైల్వే టికెట్లు
విజయవాడ : పుష్కరస్నానం ఆచరించిన అనంతరం యాత్రికులకు ఘాట్ల వద్దనే సాధారణ రైల్వే టిక్కెట్లు జారీ చేయనున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. క్రిస్ అప్రూవ్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో ఘాట్ల వద్దే రైల్వే టికెట్ల జారీకిS 40 యూనిట్లతో విజన్‌టెక్ సంస్థ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. తన ఛాంబరులో బుధవారం కంపెనీ అధికారులతో టికెట్ల జారీపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘాట్లవద్దే టికెట్లు ఈయడం ద్వారా యాత్రికులు అనుకన్న సమయంలో తిరుగు ప్రయాణాన్ని చేయగలుగుతారన్నారు. సంబంధిత టికెట్లు జారీ చేసే బృందం వివిధ రూట్లలో అందుబాటులో ఉన్న రైళ్ళ వివరాలను అందించాలన్నారు. ఈసందర్భంగా విజన్‌టెక్ ప్రోగ్రామ్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ రైల్వే శాఖ అధికారికంగా జారీ చేసే రైల్వే టికెట్‌పై ప్రయాణ ప్రాంతం వివరాలను ముద్రించి అందించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్చందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా టెకెట్ల జారీకి ముందుకు వచ్చామన్నారు. -
రైల్వే టికెట్ కౌంటర్లకు చెల్లు!
- దశలవారీగా 2020కల్లా పూర్తిగా ఎత్తివేత - ఆన్లైన్లోనే టికెట్ల విక్రయానికి ఏర్పాట్లు - ఆ సిబ్బందికి వేరే పనుల పురమాయింపు - ఇప్పటికే కొందరిని సరెండర్ చేసిన అధికారులు సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది ఉద్యోగులతో ప్రపంచంలోని అతిపెద్ద రైల్వేలలో ఒకటైన భారతీయ రైల్వే... సిబ్బంది జీతాల ఖర్చును వీలైనంత తగ్గించుకోవాలని నిర్ణయించింది. సంస్థను సంస్కరణల బాటపట్టించి లాభాలు పెంచుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టికెట్ రిజర్వేషన్ కౌంటర్లను దశలవారీగా 2020కల్లా మూసేయాలని నిర్ణయించింది. కేవలం జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకు అప్పటికప్పుడు టికెట్లు జారీ చేసే సాధారణ కౌంటర్లను మాత్రమే పరిమితంగా ఉంచి మిగతా టికెట్లను పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో విక్రయించే ఏర్పాట్లు చేస్తోంది. రిజర్వేషన్ టికెట్ల కోసం వీలైనన్ని ప్రైవేటు బుకింగ్ కేంద్రాలకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా 40 మంది టికెట్ జారీ సిబ్బందిని సంబంధిత విభాగం సరెండర్ చేసింది. వారికి వేరే పనులను పురమాయించారు. టీసీలదీ అదేబాట దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 3,500 మంది టికెట్ చెకింగ్ (టీసీలు) అధికారులున్నారు. వారి సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించాలని రైల్వే నిర్ణయించింది. గతంలో ప్రతి బోగీకి ఒక టీసీ అవసరం ఉండేది. ప్రస్తుతం ప్రతి బోగీ నుంచి మరో బోగీలోకి వెళ్లేందుకు వీలుగా ప్రవేశ మార్గం ఉంటోంది. దీంతో ప్రతి 3 బోగీలకు ఒక టీసీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా కుదించి రైలు మొత్తానికి ముగ్గురు, నలుగురు టీసీలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో వారి సంఖ్య తగ్గనుంది. ఇదే కాకుండా ఇతర విభాగాల్లోనూ సిబ్బంది సంఖ్యను భారీగా కుదించనున్నారు. రిటైరైన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలను నిలిపేయడంతోపాటు ఆయా విభాగాల్లో మిగతా వారిని వేరే విభాగాలకు పంపనున్నారు. -
మోసగాళ్ల ముఠా అరెస్టు
రైల్వే టిక్కెట్లు పేరుతో ప్రయాణికులను మోసం చేస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ముఠా నకిలీ రైల్వే టిక్కెట్లతో ప్రయాణికులను మోసం చేస్తున్నారు. వీరిని గోపాలపురం స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 26వేలు స్వాధీనం చేసుకున్నారు. -
రైళ్లలో టికెట్ లేనివారికి జరిమానా
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 1,842 మందిని పట్టుకుని కేసులు నమోదు చేయడంతోపాటు వారి వద్ద నుంచి రూ. 10.57 లక్షల జరిమానా వసూలు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే రైల్వే స్టేషన్లలో ధూమపానం చేస్తున్న 60 మందికి రూ. 12 వేలు జరిమానా విధించినట్టు పేర్కొంది. రైల్వేలలో భద్రత, శుభ్రత, క్రమశిక్షణ కోసం ముందు ముందు మరిన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ప్రయాణికులు నిబంధనలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో సూచించింది. -
నల్గొండ ఎన్కౌంటర్లో కీలక మలుపు
నల్లగొండ: నల్గొండ ఎన్కౌంటర్లో కీలక మలుపు చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో ఓ రైల్వే టిక్కెట్ లభ్యమైంది. ఈ నెల 2వ తేదీన న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించిన రైల్వే టిక్కెట్ ఎన్కౌంటర్లో హతమైన దుండగుల దగ్గర లభించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఓ వ్యక్తి ప్రయాణం చేసిట్లు టిక్కెట్ వివరాలు ద్వారా తెలుస్తోంది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు న్యూఢిల్లీ నుంచి వచ్చినట్లు అయితే మరో నిందితుడు ఎక్కడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సూర్యాపేట కాల్పుల ఘటనలో తప్పించుకుంది ఇద్దరు కాగా, తాజాగా బయటపడ్డ మూడో వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా సూర్యాపేటలో కాల్పులకు పాల్పడి పరారైనవారు.. ఎన్కౌంటర్లో మృతి చెందినవారు ఒకరే అని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే సూర్యాపేట పోలీసుల వద్ద నుంచి ఎత్తుకెళ్లిన కార్బన్ నిందితుల దగ్గర లభించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో తప్పించుకున్న ఇద్దరిలో ఒకరు పరారీలో ఉన్నారా? న్యూఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి తన ముఠా సభ్యులను కలుసుకున్నాడా? ఎన్కౌంటర్లో ఇద్దరు మరణిస్తే...మూడో వ్యక్తి ఎక్కడా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. అసలు వీళ్ల టార్గెట్ ఏంటీ అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.