న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఈ పోర్టల్ నుంచి ఒక నెలలో 12 టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌తో అనుసంధానం చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధికారులు చెప్పారు. అక్టోబర్ 26 నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని ప్రకటించారు.
గతంలో ఈ పోర్టల్ ద్వారా ఒక నెలలో ఆరు టికెట్లు మాత్రమే ఇచ్చేవారు. ఆరు కంటే ఎక్కువ టికెట్లు కావాల్సిన వారు ఐఆర్‌సీటీసీ మై పోర్టల్‌లోని కేవైసీలో ఆధార్ నంబర్ వివరాలను అప్‌లోడ్ చేసుకోవాలి. దీని కోసం నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు వన్‌టైం పాస్‌వర్డ్ వస్తుంది. అయితే ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోని వారు ఎప్పటిలాగే ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment