ఘాట్ల వద్దే రైల్వే టికెట్లు
Published Thu, Aug 11 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
విజయవాడ :
పుష్కరస్నానం ఆచరించిన అనంతరం యాత్రికులకు ఘాట్ల వద్దనే సాధారణ రైల్వే టిక్కెట్లు జారీ చేయనున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. క్రిస్ అప్రూవ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో ఘాట్ల వద్దే రైల్వే టికెట్ల జారీకిS 40 యూనిట్లతో విజన్‌టెక్ సంస్థ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. తన ఛాంబరులో బుధవారం కంపెనీ అధికారులతో టికెట్ల జారీపై కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘాట్లవద్దే టికెట్లు ఈయడం ద్వారా యాత్రికులు అనుకన్న సమయంలో తిరుగు ప్రయాణాన్ని చేయగలుగుతారన్నారు. సంబంధిత టికెట్లు జారీ చేసే బృందం వివిధ రూట్‌లలో అందుబాటులో ఉన్న రైళ్ళ వివరాలను అందించాలన్నారు. ఈసందర్భంగా విజన్‌టెక్ ప్రోగ్రామ్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ రైల్వే శాఖ అధికారికంగా జారీ చేసే రైల్వే టికెట్‌పై ప్రయాణ ప్రాంతం వివరాలను ముద్రించి అందించడం జరుగుతుందని తెలిపారు. స్వచ్చందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా టెకెట్ల జారీకి ముందుకు వచ్చామన్నారు.
Advertisement
Advertisement