రైళ్లలో టికెట్ లేనివారికి జరిమానా
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 1,842 మందిని పట్టుకుని కేసులు నమోదు చేయడంతోపాటు వారి వద్ద నుంచి రూ. 10.57 లక్షల జరిమానా వసూలు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే రైల్వే స్టేషన్లలో ధూమపానం చేస్తున్న 60 మందికి రూ. 12 వేలు జరిమానా విధించినట్టు పేర్కొంది. రైల్వేలలో భద్రత, శుభ్రత, క్రమశిక్షణ కోసం ముందు ముందు మరిన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ప్రయాణికులు నిబంధనలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో సూచించింది.