
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల కొత్త నిబంధనలను ప్రకటించింది. కస్టమర్ ఒక కంప్లైంట్ దాఖలు చేస్తే దాన్ని ఆ రోజు (తేదీ) నుంచి 30 రోజుల వ్యవధిలో పరిష్కరించాలి. ఆలా కానట్లయితే 31 రోజు నుంచి బ్యాంకు వినియోగదారునికి రోజుకి రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
క్రెడిట్ ఇన్‌స్టిట్యూషన్ అప్‌డేట్ చేసిన సమాచారాన్ని 21 రోజులలోపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సమర్పించినప్పటికీ, ఫిర్యాదు 30 రోజులలోపు పరిష్కారం కాకుంటే ఫిర్యాదుదారుకు రోజుకు 100 రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్..
సమస్య 31వ రోజు తరువాత పరిష్కారమైతే ఫిర్యాదుదారుకు పరిహారం మొత్తం కంప్లైంట్ పరిష్కారమయిన 5 పని రోజులలోపు బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. క్రెడిట్ సంస్థలు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు పరిహారం అందించకపోతే ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, 2021 కింద RBI అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment