క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రధాన క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్లు ఈ యాప్‌ల ద్వారా చెల్లింపులను సులభతరం చేయడానికి తమ సిస్టమ్‌లను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)కి లింక్ చేశారు.
జూలై 1 నుంచి అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను బీబీపీఎస్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ఆర్బీఐ గతంలో ఆదేశించింది. అయితే, అనేక బ్యాంకులు ఇప్పటికీ థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం బీబీపీఎస్‌ని ప్రారంభించలేదు.
ఇప్పటివరకు, 15 బ్యాంకులు బీబీపీఎస్‌లో బిల్లు చెల్లింపును యాక్టివేట్ చేశాయి. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం 34 బ్యాంకులకు క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి అనుమతి ఉండగా వీటిలో జూలై 15 వరకు బీబీపీఎస్‌లో 15 బ్యాంకులు చేరాయి.
బీబీపీఎస్‌కి లింక్ అయిన బ్యాంకులు ఇవే..
» ఐసీఐసీఐ బ్యాంక్
» ఏయూ బ్యాంక్
» బ్యాంక్ ఆఫ్ బరోడా
» కెనరా బ్యాంక్
» ఫెడరల్ బ్యాంక్
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
» ఐడీబీఐ బ్యాంక్
» ఐడీఎఫ్‌సీ బ్యాంక్
» ఇండియన్ బ్యాంక్
» ఇండస్‌ఇండ్ క్రెడిట్ కార్డ్
» కోటక్ మహీంద్రా బ్యాంక్
» పంజాబ్ నేషనల్ బ్యాంక్
» సరస్వత్ సహకరి బ్యాంక్
» ఎస్‌బీఐ కార్డ్
» యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఏంటీ బీబీపీఎస్?
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) అనేది బిల్లు చెల్లింపుల సమగ్ర వ్యవస్థ. ఇది వినియోగదారులకు ఆన్‌లైన్ బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. ఇది అన్ని బిల్లు చెల్లింపుల కోసం ఒక-స్టాప్ సొల్యూషన్. ఇది దేశం అంతటా వినియోగదారులందరికీ భద్రతతో కూడిన ఇంటర్‌ఆపరబుల్, సులభతరమైన, ఎప్పుడైనా, ఎక్కడైనా బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment