BBPS
-
క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మరిన్ని బ్యాంకుల్లో బీబీపీఎస్
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రధాన క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్లు ఈ యాప్‌ల ద్వారా చెల్లింపులను సులభతరం చేయడానికి తమ సిస్టమ్‌లను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)కి లింక్ చేశారు.జూలై 1 నుంచి అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను బీబీపీఎస్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ఆర్బీఐ గతంలో ఆదేశించింది. అయితే, అనేక బ్యాంకులు ఇప్పటికీ థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం బీబీపీఎస్‌ని ప్రారంభించలేదు.ఇప్పటివరకు, 15 బ్యాంకులు బీబీపీఎస్‌లో బిల్లు చెల్లింపును యాక్టివేట్ చేశాయి. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం 34 బ్యాంకులకు క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి అనుమతి ఉండగా వీటిలో జూలై 15 వరకు బీబీపీఎస్‌లో 15 బ్యాంకులు చేరాయి.బీబీపీఎస్‌కి లింక్ అయిన బ్యాంకులు ఇవే..» ఐసీఐసీఐ బ్యాంక్» ఏయూ బ్యాంక్» బ్యాంక్ ఆఫ్ బరోడా» కెనరా బ్యాంక్» ఫెడరల్ బ్యాంక్» హెచ్డీఎఫ్సీ బ్యాంక్» ఐడీబీఐ బ్యాంక్» ఐడీఎఫ్సీ బ్యాంక్» ఇండియన్ బ్యాంక్» ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్» కోటక్ మహీంద్రా బ్యాంక్» పంజాబ్ నేషనల్ బ్యాంక్» సరస్వత్ సహకరి బ్యాంక్» ఎస్బీఐ కార్డ్» యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఏంటీ బీబీపీఎస్?భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) అనేది బిల్లు చెల్లింపుల సమగ్ర వ్యవస్థ. ఇది వినియోగదారులకు ఆన్లైన్ బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. ఇది అన్ని బిల్లు చెల్లింపుల కోసం ఒక-స్టాప్ సొల్యూషన్. ఇది దేశం అంతటా వినియోగదారులందరికీ భద్రతతో కూడిన ఇంటర్ఆపరబుల్, సులభతరమైన, ఎప్పుడైనా, ఎక్కడైనా బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది. -
ఆర్బీఐ కీలక ప్రతిపాదన : ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: సీనియర్ సిటిజన్లకు భారీ ప్రయోజనం కలిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు ,ఇతర యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ)లకు అనుమతినిచ్చేందుకు ప్రతిపాదించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, తాజా ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో శుక్రవారం ఈ మేరకు ప్రతిపాదించారు. క్రాస్-బోర్డర్ ఇన్వర్డ్ పేమెంట్ల ఆమోదానికి వీలు కలగనుంది. తద్వారా దేశంలో నివసిస్తున్న వారికి మిత్రమే మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ ఇకపై ఎన్ఆర్ఐలకు లభించనుంది. దీంతో ఎన్ఆర్ఐలకు కూడా భారీ ఊరట కలగనుంది. దీనికిసంబంధించి విధి విధానాలను త్వరలో జారీ చేయనున్నామని గవర్నర్ చెప్పారు. (చదవండి : RBI Rate Hike: ఆర్బీఐ షాక్‌తో ఇక ఈఎంఐలు భారమే!) తాజా నిర్ణయం ప్రకారం ఎన్ఆర్ఐలను భారతదేశంలోని వారి కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య ,ఇతర బిల్లు చెల్లింపులు విదేశాల నుంచే సులభంగా చేసుకోవచ్చు. ఇప్పటికే నెలవారీ ప్రాతిపదికన ఎనిమిది కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్న ఈ ఇంటర్ఆపరబుల్ ప్లాట్‌ఫారమ్ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు, ప్రత్యేకించి వారి కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు పయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. బీబీపీఎస్ సేవల వృద్దితోపాటు, అదనంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందవచ్చని యురోనెట్ వరల్డ్‌వైడ్ ఇండియా అ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రణయ్ ఝవేరి అన్నారు. (ఇదీ చదవండి: Adani Road Transport: అదానీ హవా, 3 వేల కోట్ల భారీ డీల్) బీబీపీఎస్ అంటే ఏమిటి? ఆర్బీఐ తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్‌వ్యవస్థ బీబీపీఎస్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇది సేవలందిస్తుంది. అన్ని బిల్లుల చెల్లింపులకు ఉపయోగపడే వన్‌స్టాప్ సొల్యూషన్. భారత్ బిల్‌పే ద్వారా కార్డ్‌లు (క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్), NEFT ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, వాలెట్లు, ఆధార్ ఆధారిత చెల్లింపులకు ఉపయోగపడుతుంది. అలాగే విద్యుత్, టెలికాం, డీటీహెచ్, గ్యాస్, నీటి బిల్లు, వివిధ రకాల యుటిలిటీ బిల్లులను బీబీపీఎస్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్, బీమా ప్రీమియంలు, స్కూలు ఫీజులు, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌లు, లోకల్ టాక్స్, హౌసింగ్ సొసైటీ బకాయిలు తదితర చెల్లింపులకు వినియోగించే సింగల్ విండో సిస్టం బీబీపీఎస్. -
కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి మూడు కొత్త సర్వీసులు
చెన్నై: వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో కరూర్ వైశ్యా బ్యాంక్ తాజాగా మూడు కొత్త టెక్నాలజీ సర్వీసులను ప్రారంభించింది. ఫాస్టాగ్, యూపీఐ, బీబీపీఎస్ అనే సేవలను ఆవిష్కరించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ భాగస్వామ్యంతో ఫాస్టాగ్ సేవలను ఆవిష్కరించామని బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె.వెంకటరమణ్ తెలిపారు. ‘ముందుగానే లోడ్ చేసిన ట్యాగ్స్‌ను వాహనాలకు అతికిస్తా రు. టోల్‌ప్లాజాలు సెన్సార్ల సాయంతో టోల్ అమౌంట్‌ను ఈ ట్యాగ్స్ ద్వారా ఆటోమేటిక్‌గా డెబిట్ చేసుకుంటాయి. తర్వాత ట్యాగ్స్‌ను డబ్బులతో మళ్లీ నింపుకోవచ్చు. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌ప్లాజాల వద్ద అనుమతిస్తారు’ అని వివరించారు. అలాగే మొబైల్ ద్వారా ఇంటర్‌బ్యాంక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ కోసం ‘కేవీబీ యూపీఐ’ యాప్‌ను తీసుకువచ్చామని తెలిపారు. ఇక భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా యూజర్లు యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చని పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు భారత్ బిల్లు పేమెంట్ సేవలు
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన ఖాతాదారులకు భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా కస్టమర్లు విద్యుత్తు, గ్యాస్, నీటి బిల్లులను చెల్లించొచ్చు. బీబీపీఎస్ అనేది అన్ని రకాల బిల్లుల చెల్లింపునకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ తీసుకొచ్చిన కేంద్రీకృత ప్లాట్‌ఫామ్. దీనివల్ల ఒక్కో బిల్లు చెల్లింపునకు ఒక్కో సైట్‌ను ఆశ్రయించాల్సిన శ్రమ తప్పుతుంది. హెచ్డీఎఫ్సీ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి ఈ సేవలు పొందవచ్చు. -
మొబైల్ ఫోనే.. బ్యాంకు
♦ ‘జేబ్’ యాప్‌తో చెల్లింపులు సులభం ♦ సహకార సంఘాలూ ఆన్‌లైన్‌లోకి.. ♦ వీసాఫ్ట్ సీవోవో శ్రీనివాస్ ద్రోణంరాజు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సాంకేతికంగా చెల్లింపుల విధానాల్లో విప్లవాత్మక మార్పులొస్తున్న నేపథ్యంలో చేతిలో ఉండే స్మార్ట్ఫోనే బ్యాంకుగా మారిపోతోందని వీసాఫ్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) శ్రీనివాస్ ద్రోణంరాజు అభిప్రాయపడ్డారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటివి దీనికి గణనీయమైన తోడ్పాటునందిస్తున్నట్లు చెప్పారాయన. ఈ తరహా విధానాలకు అనుగుణంగా తాము రూపొందించిన ‘జేబ్’ యాప్... చెల్లింపులను మరింత సులభతరం చేస్తుందన్నారు. చెల్లింపులకు మాత్రమే పరిమితం కాకుండా వినియోగదారు తన వ్యయాల సరళి తెలుసుకునేందుకు, ఆర్థిక ప్రణాళికలను తనకు తగ్గట్లుగా సవరించుకునేందుకు తోడ్పడేలా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. ‘‘ల్యాప్‌టాప్, ఫోన్, ట్యాబ్లెట్ తదితర పరికరాలన్నింటిలోనూ బ్యాంకు వెబ్సైట్ స్వరూపం ఒకే తరహాలో ఉండి, లావాదేవీలను సులభతరంగా నిర్వహించుకునే వెసులుబాటునిచ్చే డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అందిస్తున్నామని వివరించారు. సహకార బ్యాంకుల సొల్యూషన్స్‌పై దృష్టి .. ప్రధానంగా సహకార బ్యాంకులకు అవసరమైన బ్యాంకింగ్ సొల్యూషన్స్‌పై తాము దృష్టి పెడుతున్నట్లు శ్రీనివాస్ చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (ప్యాక్స్) కంప్యూటరీకరించి, జిల్లా బ్యాంకులకు అనుసంధానం చేయడం ద్వారా వాటిలో సభ్యత్వమున్న రైతులను కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో భాగం చేసే దిశగా కసరత్తు జరుగుతోందన్నారు. దీనితో 54 లక్షల మంది పైచిలుకు రైతులు బ్యాంకింగ్ పరిధిలోకి వస్తారు. అలాగే, కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయ రుణాలను రైతులు మరింత సమర్ధంగా వినియోగించుకునే విధంగా కిసాన్ లోన్ సిస్టమ్ సొల్యూషన్‌ను రూపొందించామన్నారు. పక్కా గణాంకాల లభ్యత కారణంగా ప్రభుత్వాలు కూడా తగిన నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని తెలియజేశారు. వచ్చే అయిదేళ్లలో మరో 1,500 మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు.