NRIs Can Pay Now Pay For Bills in India Directly Says RBI - Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కీలక ప్రతిపాదన: ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌ న్యూస్‌

Published Fri, Aug 5 2022 2:03 PM | Last Updated on Fri, Aug 5 2022 2:41 PM

NRIs can pay now pay for bills in India directly says RBI - Sakshi

సాక్షి,ముంబై: సీనియర్‌ సిటిజన్లకు భారీ ప్రయోజనం కలిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు ,ఇతర యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్‌) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ)లకు అనుమతినిచ్చేందుకు ప్రతిపాదించింది.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్,  తాజా ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో శుక్రవారం ఈ మేరకు ప్రతిపాదించారు. క్రాస్-బోర్డర్ ఇన్‌వర్డ్ పేమెంట్‌ల ఆమోదానికి వీలు కలగనుంది.  తద్వారా దేశంలో నివసిస్తున్న వారికి మిత్రమే మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ ఇకపై ఎన్‌ఆర్‌ఐలకు లభించనుంది. దీంతో ఎన్‌ఆర్‌ఐలకు కూడా భారీ ఊరట  కలగనుంది. దీనికిసంబంధించి విధి విధానాలను  త్వరలో జారీ చేయనున్నామని గవర్నర్‌ చెప్పారు.

(చదవండి :  RBI Rate Hike: ఆర్బీఐ షాక్‌తో ఇక ఈఎంఐలు భారమే!)

తాజా నిర్ణయం ప్రకారం  ఎన్‌ఆర్‌ఐలను భారతదేశంలోని వారి కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య ,ఇతర బిల్లు చెల్లింపులు విదేశాల నుంచే సులభంగా చేసుకోవచ్చు. ఇప్పటికే నెలవారీ ప్రాతిపదికన ఎనిమిది కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్న ఈ ఇంటర్‌ఆపరబుల్ ప్లాట్‌ఫారమ్ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు, ప్రత్యేకించి వారి కుటుంబాల్లోని సీనియర్‌ సిటిజన్లకు పయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.  బీబీపీఎస్‌ సేవల వృద్దితోపాటు, అదనంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందవచ్చని యురోనెట్ వరల్డ్‌వైడ్ ఇండియా అ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రణయ్ ఝవేరి అన్నారు.

(ఇదీ చదవండి: Adani Road Transport: అదానీ హవా, 3 వేల కోట్ల భారీ డీల్‌)

బీబీపీఎస్‌ అంటే ఏమిటి?
ఆర్బీఐ తీసుకొచ్చిన డిజిటల్‌ పేమెంట్‌వ్యవస్థ బీబీపీఎస్‌. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  ఆధ్వర్యంలో ఇది సేవలందిస్తుంది. అన్ని బిల్లుల చెల్లింపులకు ఉపయోగపడే వన్‌స్టాప్‌ సొల్యూషన్‌. భారత్ బిల్‌పే ద్వారా కార్డ్‌లు (క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్), NEFT ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, వాలెట్‌లు, ఆధార్ ఆధారిత చెల్లింపులకు ఉపయోగపడుతుంది. అలాగే విద్యుత్, టెలికాం, డీటీహెచ్‌, గ్యాస్, నీటి బిల్లు, వివిధ రకాల యుటిలిటీ బిల్లులను  బీబీపీఎస్‌ ద్వారా చెల్లించవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్, బీమా ప్రీమియంలు,  స్కూలు  ఫీజులు,  ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌లు, లోకల్‌ టాక్స్‌,  హౌసింగ్ సొసైటీ బకాయిలు తదితర చెల్లింపులకు వినియోగించే సింగల్‌ విండో సిస్టం బీబీపీఎస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement