non-resident Indians
-
PM Modi Egypt Tour: ఇండియా హీరో మోదీ
కైరో: ‘ఇండియా హీరో నరేంద్ర మోదీ’ అంటూ ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ చరిత్రాత్మక ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం ఈజిప్టులో అడుగుపెట్టారు. గత 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడంఇదే మొదటిసారి. రాజధాని కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇండియా హీరో(కథానాయకుడు) మీరేనంటూ వారు ప్రశంసించగా మోదీ ప్రతిస్పందించారు. అందరికీ హీరో ఇండియా అని బదులిచ్చారు. ప్రజలంతా కష్టపడి పనిచేస్తున్నారని, అందుకే మన దేశం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశ విజయంలో వారికి సైతం వాటా దక్కుతుందన్నారు. అనంతరం దావూదీ బోహ్రా వర్గం ముస్లింలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్‌లోని దావూదీ బోహ్రా ముస్లింలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈజిప్టులో ప్రవాస భారతీయులు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారి ఆప్యాయత తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఈజిప్టువాసులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తనకు స్వాగతం పలికారని వెల్లడించారు. భారత్–ఈజిప్టు దేశాలు సంప్రదాయాలను సైతం పంచుకుంటున్నాయని వివరించారు. అల్–హకీం మసీదు, గ్రేట్ పిరమిడ్ల సందర్శన ఈజిప్టులో 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక అల్–హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించిన హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈజిప్టులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 3,799 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గిజా గ్రేట్ పిరమిడ్లను మోదీ సందర్శించారు. కైరో నగర శివార్లలో గిజా నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో ఈ పిరిమిడ్లు ఉన్నాయి. ‘‘కైరో అల్–హకీం మసీదును సందర్శించడం ఆనందంగా ఉంది. ఈజిప్టు ఘనమైన వారసత్వానికి, సంస్కృతికి ఈ మసీదు దర్పణం పడుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనే దిశగా భారత్, ఈజిప్టు మరో అడుగు వేశాయి. భారత ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రాచీన, పురావస్తు కట్టడాల పరిరక్షణ, ‘కాంపిటీషన్ లా’కు సంబంధించిన మరో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపారు. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ ప్రదానం ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్టు సహా ఇప్పటిదాకా 13 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, రష్యా, బహ్రెయిన్, పపువా న్యూగినియా, ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ, భూటాన్ తదితర దేశాల నుంచి ఆయన ఈ పురస్కారాలు స్వీకరించారు. తనకు ఆర్డర్ ఆఫ్ ద నైలు పురస్కారం ప్రదానం చేసిన ఈజిప్టు ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ పట్ల ఈజిప్టు ప్రజల ఆప్యాయత అనురాగాలకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. -
ఆర్బీఐ కీలక ప్రతిపాదన : ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: సీనియర్ సిటిజన్లకు భారీ ప్రయోజనం కలిగేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు ,ఇతర యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ)లకు అనుమతినిచ్చేందుకు ప్రతిపాదించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, తాజా ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో శుక్రవారం ఈ మేరకు ప్రతిపాదించారు. క్రాస్-బోర్డర్ ఇన్వర్డ్ పేమెంట్ల ఆమోదానికి వీలు కలగనుంది. తద్వారా దేశంలో నివసిస్తున్న వారికి మిత్రమే మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ ఇకపై ఎన్ఆర్ఐలకు లభించనుంది. దీంతో ఎన్ఆర్ఐలకు కూడా భారీ ఊరట కలగనుంది. దీనికిసంబంధించి విధి విధానాలను త్వరలో జారీ చేయనున్నామని గవర్నర్ చెప్పారు. (చదవండి : RBI Rate Hike: ఆర్బీఐ షాక్‌తో ఇక ఈఎంఐలు భారమే!) తాజా నిర్ణయం ప్రకారం ఎన్ఆర్ఐలను భారతదేశంలోని వారి కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య ,ఇతర బిల్లు చెల్లింపులు విదేశాల నుంచే సులభంగా చేసుకోవచ్చు. ఇప్పటికే నెలవారీ ప్రాతిపదికన ఎనిమిది కోట్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్న ఈ ఇంటర్ఆపరబుల్ ప్లాట్‌ఫారమ్ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు, ప్రత్యేకించి వారి కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు పయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. బీబీపీఎస్ సేవల వృద్దితోపాటు, అదనంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందవచ్చని యురోనెట్ వరల్డ్‌వైడ్ ఇండియా అ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రణయ్ ఝవేరి అన్నారు. (ఇదీ చదవండి: Adani Road Transport: అదానీ హవా, 3 వేల కోట్ల భారీ డీల్) బీబీపీఎస్ అంటే ఏమిటి? ఆర్బీఐ తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్‌వ్యవస్థ బీబీపీఎస్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇది సేవలందిస్తుంది. అన్ని బిల్లుల చెల్లింపులకు ఉపయోగపడే వన్‌స్టాప్ సొల్యూషన్. భారత్ బిల్‌పే ద్వారా కార్డ్‌లు (క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్), NEFT ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, వాలెట్లు, ఆధార్ ఆధారిత చెల్లింపులకు ఉపయోగపడుతుంది. అలాగే విద్యుత్, టెలికాం, డీటీహెచ్, గ్యాస్, నీటి బిల్లు, వివిధ రకాల యుటిలిటీ బిల్లులను బీబీపీఎస్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్, బీమా ప్రీమియంలు, స్కూలు ఫీజులు, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్‌లు, లోకల్ టాక్స్, హౌసింగ్ సొసైటీ బకాయిలు తదితర చెల్లింపులకు వినియోగించే సింగల్ విండో సిస్టం బీబీపీఎస్. -
బహ్రెయిన్‌కు మీ కోసం వచ్చా
మనామా: బహ్రెయిన్ అభివృద్ధికి ప్రవాస భారతీయులు చేసిన కృషిపై అభినందనలను వింటే తన మనసు సంతోషంతో పొంగిపోతుందని ప్రధాని మోదీ అన్నారు. బహ్రెయిన్‌లోని ప్రవాస భారతీయుల శ్రమను మోదీ ప్రశంసించారు. బహ్రెయిన్‌లో పనిచేస్తున్న భారతీయులను ఉద్దేశించి మోదీ బహ్రెయిన్ జాతీయ స్టేడియంలో ప్రసంగించారు. ‘నేను భారత ప్రధానిగానే ఇక్కడకు వచ్చాను. కానీ ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులను కలిసి వారితో మాట్లాడటమే’ అని అన్నారు. బహ్రెయిన్ మొత్తం జనాభా దాదాపు 12 లక్షలు కాగా, అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయుల సంఖ్యే 3.5 లక్షలు. వీరిలోనూ ఎక్కువ మంది కేరళీయులే. బహ్రెయిన్‌లో పర్యటిస్తున్న తొట్టతొలి భారత ప్రధాని మోదీయే. రూపే కార్డును ఉపయోగించి త్వరలోనే బహ్రెయిన్లోనూ చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నామనీ, ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాలు సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. మోదీకి కింగ్ హమద్ ఆర్డర్ అవార్డు.. బహ్రెయిన్‌తో భారత సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు మోదీకి ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ద రినైజన్స్’ అవార్డును బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ప్రదానం చేశారు. మోదీ పర్యటన సందర్భంగా 250 మంది భారతీయ ఖైదీలను ఆదివారం విడుదల చేసి బహ్రెయిన్ మానవత్వాన్ని చాటుకుంది. బహ్రెయిన్‌లో 200 ఏళ్ల పురాతనమైన శ్రీనాథ్జీ శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరభివృద్ధి చేసేందుకు రూ. 30 కోట్ల విలువైన పనులను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఖలీఫాతో మోదీ చర్చలు జరిపిన అనంతరం ఓ సంయుక్త ప్రకటనను రెండు దేశాలు విడుదల చేశాయి. ద్వైపాక్షిక, ప్రాంతీయ, బహుముఖ అంశాలపై వారు చర్చించారు. ఉగ్రవాదంపై నిఘా సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఫ్రాన్స్ చేరుకున్న మోదీ బియారిట్జ్: బహ్రెయిన్ పర్యటనను మోదీ ఆదివారం ముగించుకుని, జీ–7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌కు చేరుకున్నారు. పర్యావరణం తదితర సమకాలీన అంశాలపై మోదీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నేతలతో ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొంటారు. జీ–7 కూటమి దేశాల్లో భారత్ లేకపోయినప్పటికీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. జాన్సన్‌తో భేటీ అయిన మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ ఆదివారం బియారిట్జ్‌లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరు ప్రధానులు చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం తెలిపిం ది. బ్రిటన్ ప్రధానిగా జాన్సన్ ఎన్నికయ్యాక ఆయనతో మోదీ తొలి భేటీ ఇది. -
ఫోర్బ్స్ జాబితాలో 30 మంది ప్రవాస భారతీయులు
-
ఫోర్బ్స్ జాబితాలో 30 మంది ప్రవాస భారతీయులు
న్యూయార్క్: ఫోర్బ్స్ సూపర్ అచీవర్స్ జాబితా 2017 ఎడిషన్‌లో తాజాగా భారతీయ సంతతికి చెందిన 30 మంది స్థానం దక్కించుకున్నారు. కొత్త ఆవిష్కరణలతో వీరు వారి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారని ఫోర్బ్స్ పేర్కొంది. ప్రపంచ పరివర్తనలో తమ వంతు కృషి చేసిన 30 ఏళ్ల వయసులోపు వారికి జాబితాలో చోటు కల్పించామని తెలిపింది. ఈ జాబితాలో నియోలైట్ సహ వ్యవస్థాపకుడు వివేక్ కొప్పర్తి, జిప్‌లైన్‌కు చెందిన ప్రార్థన దేశాయ్, ఆర్థోనింజా వ్యవస్థాపకుడు షాన్ పటేల్, అవేరియా హెల్త్ సొల్యూషన్స్‌ను స్థాపించిన రోహణ్ సూరి వంటి వారు స్థానం పొందారు. లా అండ్ పాలసీ విభాగంలో వరుణ్ శివరామ్, తయారీ రంగంలో నేహా గుప్తా, సోషియల్ ఎంట్రప్రెన్యూర్స్ విభాగంలో కిసాన్ నెట్వర్క్ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య అగర్వాల్, స్పోర్ట్స్ కేటగిరిలో ఫిలడెల్ఫియా 76 ఈఆర్ఎస్ టీమ్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ ఖన్నా జాబితాలో ఉన్నారు. ఇక వెంచర్ క్యాపిటల్ రంగంలో అనర్గ్య వర్ధన, అక్షయ్ గోయల్, కన్సూమర్ టెక్నాలజీ విభాగంలో రూమి వ్యవస్థాపకుడు అజయ్ యాదవ్ వంటి వారు జాబితాలో స్థానం పొందారు. కాగా జాబితాలో మొత్తంగా 600 మంది స్థానం దక్కించుకున్నారు. -
ప్రవాస భారతీయుల సంతాపం
వివిధ రాష్ట్రాల్లో స్మృతి చిహ్నాల ఏర్పాట్లకు కృషి వాషింగ్టన్: కలాం మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులు, భారతీయ సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తంచేశాయి. కలాం నిరాడంబరత, నిగర్వశీలత, స్ఫూర్తినిచ్చే ఆయన వ్యక్తిత్వం ఆయనను అందరికీ ప్రీతిపాత్రుడిని చేశాయని కొనియాడాయి. భారత ముద్దుబిడ్డ అయిన కలాం నిజంగా ప్రజల రాష్ట్రపతి అని కీర్తించాయి. ‘మిసైల్ మ్యాన్’ కలాం ప్రపంచ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నివాళులర్పించారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ తదితర సంఘాలు కలాం మృతిపట్ల సంతాపం ప్రకటించిన సంస్థల్లో ఉన్నాయి. సింగపూర్ ప్రధాని లూంగ్ కూడా సంతాపం తెలిపారు. భారత అణు సామర్థ్యాలను పెంపొందించటంలో కలాం ఎంతో కృషి చేశారని అమెరికా మీడియా శ్లాఘించింది. పలు రాష్ట్రాల్లో కలాం స్మృతి చిహ్నాలకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: కలాం స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేసేందుకు పలు రాష్ట్రాలు కృషి మొదలుపెట్టాయి. బిహార్ సీఎం నితీశ్‌కుమార్.. కిసాన్‌గంజ్ వ్యవసాయ కళాశాలకు మంగళవారం డాక్టర్ కలాం పేరు పెట్టారు. మధ్యప్రదేశ్‌లో స్కూళ్లలో పాఠ్యాంశంగా కలాం జీవితచరిత్రను బోధించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్ తెలిపారు. కలాంకు నివాళిగా ఆగస్టు 2న ఆదివారం కూడా విధులు నిర్వర్తించాలని కేరళ రాష్ట్ర మహిళాభివృద్ధి కార్పొరేషన్ నిర్ణయించింది. కలాం మృతిపై ఆర్ఎస్ఎస్ సంతాపం తెలిపింది కలాం ట్విటర్ ఖాతాను మిత్రులు ‘ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం’గా కొనసాగించనున్నారు. -
ఎన్ఆర్ఐపై పోలీసుల దాష్టీకం
- ప్రవాస భారతీయుడిపై దాడి - డబ్బుల కోసం డిమాండ్ - హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు - విచారణకు ఆదేశం - పోలీసులపై వేటుపడే అవకాశం నాంపల్లి/ముషీరాబాద్: ప్రవాస భారతీయుడిపై ముషీరాబాద్ పోలీసులు దాష్టీకం చేశారు. విచక్షణారహితంగా కొట్టి గాయపరచడంతో బాధితుడు వాసు మల్లాపురం సోమవారం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపించి జులై 16లోగా నివేదికను అందజేయాలని హక్కుల కమిషన్.. నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. బాధితుడి కథనం ప్రకారం...మహేంద్ర హిల్స్ కు చెందిన వాసు మల్లాపురం 14 ఏళ్లుగా ఐర్లాండ్‌లో ఉంటున్నారు. వేసవి సెలవులకు నగరానికి వచ్చిన ఆయన ఈనెల 25న ముషీరాబాద్‌కు చెందిన తన స్నేహితులు ప్రీతమ్, నిఖిల్‌లతో కలిసి కోఠిలో ఓ హోటల్లో మద్యం తాగాడు. ఆ తర్వాత వారిని వదిలేందుకు ముషీరాబాద్ అనూషా అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అతను కారును పక్కన ఆపి స్నేహితులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అర్ధరాత్రి రోడ్డుపై ఏమి చేస్తున్నారంటూ తమపై దాడి చేసినట్లు తెలిపాడు. దీనిపై ప్రశ్నించడంతో పోలీసులకే ఎదురు చెప్తారా తమను స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపా రు. అన ంతరం సీఐ దగ్గరకు తీసుకెళ్లగా అతను తమను దారుణంగా అవమానించడమేగాక, తమ ఫోన్లు లాక్కున్నారని, రూ. రూ.5 లక్షలు ఇస్తే వదిలి వేస్తానని, లేనిచో పాస్‌పోర్టులు సీజ్ చేస్తానని చెప్పాడన్నారు. లేని పక్షంలో పరారీలో ఉన్నాడంటూ మళ్లీ లోపల వేసి బొక్కలు ఇరగ్గొడతానని హెచ్చరించాడన్నారు. అంతేగాకుంగా తన స్నేహితుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వాపోయారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆతను కోరాడు. ఘటనపై డీసీపీ విచారణ కాగా ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారుల ఆదేశంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్, సెక్టార్ ఎస్సైలు సంపత్, భాస్కర్‌రావులను డీసీపీ కార్యాలయాలని పిలిపించారు. సమస్య హెచ్ఆర్సీ వరకు వెళ్లినా ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుల్లో ఒక్కరిపై మాత్రమే కేసు నమోదు చేసి మిగతా ముగ్గుర్నీ ఎందుకు వదిలి పెట్టారని ప్రశ్నించిన ట్లు తెలిసింది. ఈ ఘటనకు బాధ్యులైన కానిస్టేబుళ్లు, ఎస్సైపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదేనా భద్రత హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు సెక్షన్-8 అమలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నా వద్దనుకున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నా సిబ్బందిలో మార్పురావడం లేదు. తప్పు చేయని వ్యక్తులపై పోలీసులు దాడి చేయడం దారుణం. వాసు మల్లాపురంపై జరిగిన దాడి హైదరాబాదులో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోంది. - ఎస్.చంద్రశే ఖర్ ( గ్రీన్ ఫీల్డ్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు) -
ఎన్నారైలు చిట్‌ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు
ప్రవాస భారతీయులు చిట్‌ఫండ్స్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ నాన్-రిపాట్రియేషన్(వీటిని విదేశీ కరెన్సీలోకి మార్చడానికి వీలుండదు) ప్రాతిపదికన ఉండాలని పేర్కొంది. చిట్‌ఫండ్, సంబంధిత వ్యాపారం చేసే కంపెనీల్లో ప్రవాస భారతీయులు ఇన్వెస్ట్ చేయడంపై 2000, మే నెలకు ముందు నిషేధం ఉండేది. -
యంగ్ రిపబ్లిక్
కవర్ స్టోరీ ఏ దేశమేగినా ఎందు కాలిడినా... భారత కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు ప్రవాస భారతీయులు. అనితర సాధ్యమైన ఘన విజయాలతో మాతృదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. భారత సంతతికి చెందిన సుమారు 40 మంది యువ ప్రవాస భారతీయులు ముప్పయ్యేళ్ల లోపు వయసులోనే ‘ఫోర్బ్స్’ జాబితాకెక్కారు. ఇరవై రంగాలలో విజయాలు సాధించిన ముప్పయ్యేళ్ల లోపు యువతతో ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో చోటు దక్కించుకున్న భారత సంతతి యువతరంగాల్లో కొందరి వివరాలు సంక్షిప్తంగా... ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా... నితేశ్ బంటా (28): రఫ్ డ్రాఫ్ట్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు. వెంచర్ కేపిటల్ రంగంలో నితేశ్ పేరు ఒక తాజా సంచలనం. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే విద్యార్థులకు సొంత కంపెనీ స్థాపించుకునేందుకు రఫ్ డ్రాఫ్ట్స్ వెంచర్స్ 25 వేల డాలర్ల వరకు రుణాలు సమకూరుస్తోంది. రఫ్ డ్రాఫ్ట్స్ వెంచర్స్ స్థాపించడానికి ముందు నితేశ్ బంటా గూగుల్, జనరల్ కేటలిస్ట్ పార్టనర్స్ సంస్థల్లో పనిచేశాడు. అంకుర్ జైన్ (24): ‘హమిన్’ అనే యాప్‌కు సహ వ్యవస్థాపకుడు. కాంటాక్టులు, సోషల్ నెట్వర్కులు, కేలండర్ల వివరాలను ఒకేచోట తేలికగా వెతుక్కొనే వీలు కల్పిస్తూ విడుదల చేసిన ‘హమిన్’... వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందింది. యువ వ్యాపారవేత్తల సంస్థ ‘కైరోస్ సొసైటీ’కి, అమెరికా, చైనా, పశ్చిమాసియా దేశాల్లో కొత్త మార్కెట్ల పురోగతికి దోహదపడే ‘పంజియా’ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా అంకుర్ సేవలందిస్తున్నాడు. అవినాశ్ గాంధీ (26): హాలీవుడ్లో తాజా సంచలనం అవినాశ్ గాంధీ. టాలెంట్ ఏజెన్సీ సంస్థ విలియమ్ మోరిస్ ఎండీవర్ తరఫున ఏజెంట్‌గా పనిచేస్తున్న అవినాశ్, హాలీవుడ్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. యేల్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేసిన అవినాశ్ గాంధీ, మీడియా, వినోద రంగాల్లో యంగ్ టాలెంట్ల వేటలో తన ప్రతిభ చాటుకుంటున్నాడు. నీరజ్ అంతానీ (23): అమెరికాలోని ఓహయో నుంచి రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యాడు. ఓహయో ప్రతినిధుల సభకు ఎన్నికైన వారిలో అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించిన నీరజ్, ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ మోరిస్ (63)పై ఘన విజయం సాధించాడు. ఓహయో స్టేట్ వర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన నీరజ్, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ డేటన్లో న్యాయశాస్త్రం చదువుకుంటున్నాడు. నిఖిల్ అగర్వాల్ (28): ఎంఐటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్. చదువుకున్నది ఆర్థిక శాస్త్రమే అయినా, ఆరోగ్యరంగంపై ఆసక్తి ఎక్కువ. హార్వర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్, మ్యాథమేటిక్స్‌లో డిగ్రీలు చేశాడు. ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశాడు. వైద్యులు ఎక్కడ నివాసం ఉండాలనే అంశంపై గణిత ఆధారిత నమూనాను రూపొందించి, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. దీనికి ముందు అమెరికాపై విష పదార్థాల ప్రభావం: గర్భస్థ పిండాలు, శిశువుల ఆరోగ్య సమస్యలపై పరిశోధన సాగించాడు. పార్థ ఉన్నవ (22): బెటర్ వాక్ సీఈవో. కాలికి గాయాలైన వారు నడిచేందుకు వాడే క్రచ్లకు సరికొత్త రూపురేఖలు ఇచ్చాడు. భుజాలపై ఎలాంటి ఒత్తిడి లేని విధంగా వాటిని తీర్చిదిద్ది అమెరికా అధ్యక్షుడు ఒబామాను సైతం ఆకట్టుకున్నాడు. కాలు విరిగి, క్రచ్లతో నడిచినప్పుడు ఇబ్బందులు పడ్డ పార్థ ఉన్నవ, ఈ ఇబ్బందులను అధిగమించే రీతిలో సరికొత్త క్రచ్లకు రూపకల్పన చేశాడు. అమన్ అద్వానీ (26): ఫ్యాషన్ రిటైల్ రంగంలో అమన్ అద్వానీ అసాధారణమైన విజయాలు సాధిస్తున్నాడు. ‘మినిస్ట్రీ ఆఫ్ సప్లై’ పేరిట అమన్ తన స్నేహితులతో కలసి స్థాపించిన కంపెనీ... ‘నాసా’ అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఉష్ణోగ్రతను, తేమను నియంత్రించగల షర్టులకు రూపకల్పన చేసింది. ఈ షర్టులు అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో అద్భుత విజయాన్ని సాధించాయి. విజయ్ చూడాసమా (28): లండన్ వర్సిటీ నుంచి రసాయనిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈ యువ శాస్త్రవేత్త కొత్తతరం ఔషధాల రూపకల్పన కోసం జరుగుతున్న పరిశోధనల్లో పాల్గొంటున్నాడు. యాంటీబాడీస్‌తో అనుసంధానం చేసిన ఔషధాల తయారీ, ప్రొటీన్ మోడిఫికేషన్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి అంశాల్లో పరిశోధనలు సాగిస్తున్నాడు. రాహుల్ రేఖి (23): ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు సలహాదారుగా విలువైన సేవలందిస్తున్న రాహుల్ రేఖి, ప్రస్తుతం యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ పాలసీపై ఐక్యరాజ్య సమితి స్థాయి ఒడంబడికకు రూపకల్పన చేసే పని కొనసాగిస్తున్నాడు. మరోవైపు, హెల్త్ ఎకనామిక్స్‌పై ప్రపంచబ్యాంకుకు సలహాదారుగా సేవలందిస్తున్నాడు. వినీత్ మిశ్రా (27): ఐబీఎం అనుబంధ సంస్థ వాట్సన్ గ్రూపులో పరిశోధకుడు. ఈ సంస్థ రూపొందించిన షెఫ్ వాట్సన్ మెషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొత్త వంటకాలు చేసేందుకు ఉపయోగపడుతుంది. స్టాన్ఫోర్డ్ వర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేస్తూనే, వాట్సన్ గ్రూపులో పరిశోధకుడుగా చేరిన వినీత్, షెఫ్ మెషిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. దీపికా కురుప్ (16): చౌకగా నీటిని శుద్ధిచేసే ప్రక్రియను కనుగొన్న దీపిక బాల శాస్త్రవేత్తగా మన్ననలు అందుకుంది. టిటానియం డయాక్సైడ్, సిల్వర్ నైట్రేట్లను ఉపయోగించి, సౌరశక్తి సాయంతో నీటిని శుద్ధిచేసే ప్రక్రియకుగానూ 25 వేల డాలర్ల ‘డిస్కవరీ’ యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకుంది. ప్రస్తుతం అమెరికాలో న్యూహాంప్‌షైర్‌లోని నషువా హైస్కూల్లో 11వ తరగతి చదువుతోంది. విక్రమ్ అయ్యర్ (29): అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలువులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అమెరికా వాణిజ్యశాఖ మేధాసంపత్తి వ్యవహారాల అండర్ సెక్రటరీ వద్ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కొనసాగుతున్న విక్రమ్ కాలిఫోర్నియా వర్సిటీ పట్టభద్రుడు. గతంలో సెనేటర్ ఎడ్ మార్కీ, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా మేయర్ ఆడ్రియన్ ఫెంటీలకు కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేశాడు. వివేక్ రవిశంకర్ (27): తిరుచ్చి ఎన్ఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్ పట్టభద్రుడైన వివేక్, తొలుత అమెజాన్ కంపెనీలోని కిండ్లే బృందంలో డెవలపర్. ఏడాది తర్వాత అమెజాన్‌ను విడిచిపెట్టి, మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించే ఆన్లైన్ వేదిక ‘ఇంటర్వ్యూ స్ట్రీట్’ను ప్రారంభించాడు. ఇది పెద్దగా ఫలితాలనివ్వకపోవడంతో కొంత కాలానికి మిత్రులతో కలసి హ్యాకర్ ర్యాంకర్‌ను ప్రారంభించాడు. ఇష్వీన్ ఆనంద్ (29): ఓపెన్ స్పాన్సర్షిప్ వ్యవస్థాపకురాలు. ప్రముఖ బ్రాండ్లను, వివిధ క్రీడల జట్ల యాజమాన్యాలను అనుసంధానం చేసే ఆన్లైన్ వేదికగా రూపొందించిన ఓపెన్ స్పాన్సర్‌షిప్‌లో భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ వంటి క్రీడాకారులతో పాటు ఫోర్స్ ఇండియా ఎఫ్ 1 వంటి జట్లు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఓపెన్ స్పాన్సర్షిప్ కంటే ముందే స్నానానికి ఉపయోగించే హ్యాండ్‌మేడ్ ఉత్పత్తులతో ‘న్యాసా’ బ్రాండ్‌ను ప్రారంభించింది ఇష్వీన్. -
నేను తీయలేనని వాళ్ల నమ్మకం!
చెరుకుగడలా నిటారుగా,‘నవ్వించడానికే’ అన్నట్టుగా ఉంటారు అవసరాల శ్రీనివాస్. ఆయనను చూస్తే హాలీవుడ్ హాస్య ద్వయం లారెల్-హార్డీలో లారెల్ గుర్తొస్తాడు. శ్రీనివాస్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆర్జించిన పేరు మాత్రం ఎక్కువ. ఇప్పుడందరికీ షాకిస్తూ.. ‘ఊహలు గుసగుసలాడే’తో డెరైక్టర్‌గా కూడా మారిపోయాడు. అవసరానికి నటునిగా మారి.. ఇప్పుడు తెలుగు తెరకు అవసరం అన్నట్లుగా ఎదిగిన ఈ ప్రవాస భారతీయుడితో కాసేపు... చెప్పండి సార్... దర్శకునిగా తొలి అనుభవం ఎలా ఉంది? చాలా బాగుంది... క్రియేటివ్ కంట్రోల్ అంతా మన చేతిలోనే ఉంటుంది. నిజంగా ఇదో కిక్కు. అసలు డెరైక్టర్ అవ్వాలని ఎందుకనిపించింది? నిరుత్సాహానికి గురైన ప్రతిసారీ... ఉత్సాహంగా ముందుకు దూకడం నాకు అలవాటు. ‘నువ్వు నటుడివి అవడం ఏంటి?’ అన్నారు అప్పట్లో చాలామంది. దాంతో, నటుడినై చూపించాను. ‘నీకు డెరైక్షన్ దేనికి?’ అన్నారు కొంతమంది. డెరైక్టర్ అయి చూపించాను. అంతే. డెరైక్షన్ అంటే దానికి కొన్ని అర్హతలుండాలేమో కదా! నాకు లేవని ఎందుకు అనుకుంటున్నారు! నేను కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా కూడా పనిచేశాను. ‘గోల్కొండ హైస్కూల్’ చిత్రానికైతే... రచయితల టీమ్‌లో నేనూ ఒకణ్ణి. డెరైక్టర్‌కు ఉండాల్సింది విజన్. అది నాకుంది. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన మీకు అసలు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇంటర్మీడియట్లో బైపీసీ చదువుదామనుకున్నా. ఇంట్లోవాళ్లు బలవంతంగా ఎంపీసీ గ్రూపు అంటగట్టారు. ఆ పైన ఇంజినీరింగ్ పూర్తవగానే పై చదువులకు అమెరికా పంపారు. ఇష్టం లేని కాపురం చేయలేంగా... చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. దాంతో అమెరికాలో ఫిల్మ్ స్కూల్లో చేరా. ‘అష్టాచమ్మా’కు సెలక్టయ్యా. ఆ తర్వాత తెలిసిందే. మరి... డెరైక్టర్‌గా తొలి అవకాశం? సినిమాలు చేస్తూనే ఓ వైపు కథలు రాసుకుంటూ ఉండేవాణ్ణి. అలా రాసుకున్న కథే ‘ఊహలు గుసగుసలాడే’. చాలామంది కథ బాగుందన్నారు కానీ, అవకాశం ఇవ్వలేదు. నేను సినిమా తీయలేనని వాళ్ళ నమ్మకం. కానీ... నిర్మాత కొర్రపాటి సాయిగారు కథ వినగానే ‘చేస్కో’ అని అవకాశం ఇచ్చేశారు. స్క్రిప్టే ఈ సినిమాకు స్టార్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. త్వరలో విడుదల చేస్తాం. డెరైక్టర్‌గా కొనసాగుతారా? ఓ వైపు క్యారెక్టర్లు చేస్తూనే మరో వైపు డెరైక్షన్ చేస్తా. కొర్రపాటి సాయిగారిదే మరో సినిమా చేయాలి. స్క్రిప్ట్ వర్క్‌కు నేను ఎక్కువ టైమ్ తీసుకుంటా. తొలి ప్రాధాన్యం మాత్రం నటనకే. నాకు నటన అంటే ప్రాణం. కామెడీ హీరోగా బావుంటారు. ఆ ప్రయత్నం చేయొచ్చుగా? అప్పుడప్పుడైతే ‘ఓకే’.‘అమృతం చందమామలో’ హీరోని నేనేగా. అయితే, అలాగే కొనసాగలేను. హీరో అంటే సినిమా భారమంతా మోయాలి. అంత బలం నాకు లేదు. నటునిగా మీకంటూ డ్రీమ్‌రోల్ ఏమైనా ఉందా? నెగిటివ్ షేడ్సున్న పాత్ర చేయాలనుంది. అలాంటివి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డెరైక్టర్‌గా చాలా చేయాలి. ‘శ్రీనివాస్ ఇలాంటి సినిమాలే చేస్తా’డనే పేరు నాకొద్దు. ‘ఎలాంటి సినిమా అయినా చేయగల’డనే పేరు కావాలి. అది సరే.. కానీ... మీరు ‘రాకెట్‌బాల్’ బాగా ఆడేవారట కదా? అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి తెలుగువాళ్లందరం కలిసి అప్పుడప్పుడు క్లబ్‌కి వెళ్లి అమెరికన్లతో సరదాగా ఆడేవాణ్ణి. పోనుపోనూ ఆ ఆటపై ఆసక్తి పెరిగింది. స్టేట్ లెవల్లో స్వర్ణ, రీజినల్ లెవల్లో రజత పతకాలు సాధించా. మార్చి 1న మన దేశంలో తొలిసారిగా ‘ఇండియా ఓపెన్ రాకెట్‌బాల్ సింగిల్స్ చాంపియన్‌షిప్’ జరిగింది. అదీ హైదరాబాద్‌లో! అప్పుడు దక్షిణ కొరియాపై ఆడాం. మళ్లీ అక్టోబర్‌లో అమెరికా టోర్నమెంట్ ఉంది. వెళ్లాలి. అప్పటివరకూ సినిమాలతోనే బిజీ. - బుర్రా నరసింహ -
ముంబైకే మొదటి ఓటు..!
దుబాయ్: భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ముంబై నగరానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు యూఏఈకి చెందిన ప్రవాస భారతీయులు. దుబాయ్‌లో ఇటీవల సుమాంశ ఎగ్జిబిషన్ అనే సంస్థ ఇండియన్ ప్రోపర్టీ షో నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. యూఏఈ దేశాల్లో ఉన్న ప్రవాసభారతీయులు వచ్చే కొద్దినెలల్లో భారత్‌లో నివాస స్థలాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఎన్ఆర్ఐలలో 31.86 శాతం మంది ముంబైలోనే స్థలాల కొనుగోలుకు ఆసక్తి చూపించారు. బెంగళూరులో స్థలాలపై పెట్టుబడులు పెట్టేందుకు 24.35 శాతం మంది ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా, చెన్నై, పుణే నగరాలు సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి. నాలుగోస్థానంలో ఢిల్లీ, తర్వాత స్థానాల్లో వరుసగా కొచ్చిన్, నవీ ముంబై, గుర్గావ్, హైదరాబాద్ నిలిచాయి. ‘బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. అక్కడ మార్కెట్లో పలు కొత్త వెంచర్లను మొద లుపెట్టడం, ప్లాట్లు, ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఉండటం, రేట్లు కూడా అందుబాటులో ఉండటంతో ప్రవాస భారతీయులు ముంబై తర్వాత బెంగళూరులో ఆస్తుల కొనుగోలుపై దృష్టి పెడుతున్నార’ని సుమాంశ ఎగ్జిబిషన్స్ సీఈవో సునీల్ జైస్వాల్ తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస కుబేరులు అత్యధిక మంది భవిష్యత్తులో స్థిరనివాసమేర్పరుచుకునేందుకు అనువైన స్థలంగా బెంగళూరులో భావిస్తుండటంతో మున్ముందు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడుపువ్వులు- ఆరు కాయలుగా వర్ధిల్లబోతోందని జైస్వాల్ జోస్యం చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 12-14 మధ్య ప్రోపర్టీ ఎగ్జిబిషన్ జరగనుంది. వీరు నిర్వహించిన సర్వే ప్రకారం.. రూ.76 లక్షలు ఆపై స్థాయి స్థలాల కొనుగోలు కోసం 31 శాతం మంది ఆసక్తి చూపిస్తుండగా, రూ.26-75 లక్షల మధ్య స్థాయిలో ఆస్తుల కొనుగోలుకు 52.57 శాతం మంది ముందుకు వస్తున్నారు. రూ. కోటికిపైగా పలికే ఆస్తుల కోసం 16 శాతం ముందుకు వస్తున్నారు. అలాగే, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్న వారిలో 67 శాతం మంది 36-50 ఏళ్ల మధ్య వయస్కులు కావడం విశేషం. వీరిలో 72 శాతం మంది వచ్చే ఆరునెలల్లోనే తమకు అందుబాటులో ఉన్న ధరల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. యూఏఈ వ్యాప్తంగా ఈ సర్వేలో 14,700 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు వివరించారు.