ఫోర్బ్స్ సూపర్ అచీవర్స్ జాబితా 2017 ఎడిషన్‌లో తాజాగా భారతీయ సంతతికి చెందిన 30 మంది స్థానం దక్కించుకున్నారు. కొత్త ఆవిష్కరణలతో వీరు వారి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారని ఫోర్బ్స్ పేర్కొంది. ప్రపంచ పరివర్తనలో తమ వంతు కృషి చేసిన 30 ఏళ్ల వయసులోపు వారికి జాబితాలో చోటు కల్పించామని తెలిపింది.