Credit card bill payments
-
క్రెడిట్ కార్డు మీ శ్రేయోభిలాషి.. శత్రువు!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎప్పుడు ఏ అవసరాలు పుట్టుకొస్తాయో ఎవరమూ చెప్పలేం. అప్పటిదాకా సజావుగా సాగిపోతున్న జీవితాల్లో ఒక్క కుదుపు చాలు మొత్తం తిరగబడిపోవడానికి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఉపద్రవాలు తలెత్తితే కుటుంబాలే కుదేలయిపోతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తగిన ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనప్పుడు తట్టుకునే విధంగా ఆర్ధిక పరిపుష్టి సాధించాలి. లేదంటే ప్రమాదమే. ఖర్చులు పెరిగిపోయి అరాకొరా జీతాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ఈమధ్యన ఎక్కువగా ఆశ్రయిస్తున్న సాధనం క్రెడిట్ కార్డులు. సగటున నెలకు రూ.25000-రూ.30000 ఆర్జించే వ్యక్తులు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొందరు ఆర్ధికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డులను స్టేటస్ సింబల్ కోసమో, సరదాకో వాడటం కూడా చూస్తూనే ఉన్నాం.ఏదైనా మోతాదు మించకూడదు..అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతి ఎప్పటికే ప్రమాదమే. ఎక్కువగా క్రెడిట్ కార్డులను వాడినా సమస్యలు తప్పవు. ఆ తర్వాత బిల్లులు కట్టలేక నిండా మునిగిపోయే పరిస్థితి ఎదురవుతుంది.ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదంటే మొదటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా బ్యాంకులు, ఇతరత్రా ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి కదా అని కొంతమంది 4, 5 క్రెడిట్ కార్డులు కూడా తీసుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం.కార్డులిస్తున్న సంస్థలివే..దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. అలాగే కొన్ని అన్ రిజిస్టర్డ్ సంస్థలు కూడా వివిధ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కార్డులు ఇస్తున్నాయి.క్రెడిట్‌కార్డు పొందాలంటే..క్రెడిట్ కార్డు పొందాలంటే ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ బావుండాలి. సాధారణంగా 750 -900 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే కార్డు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు మన ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ లిమిట్ ఆధారంగా కార్డులు జారీ చేస్తారు. నెలకు రూ.20000 ఆదాయం పొందే వ్యక్తికి కూడా క్రెడిట్ కార్డులను ఆయా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. అదే ప్రీమియం కార్డుల విషయానికొస్తే రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్డులు జారీ చేస్తున్నాయి.కార్డు జారీకి ఇవి చాలా ముఖ్యంకార్డు జారీ చేయాలంటే క్రెడిట్ హిస్టరీ బావుండాలి. అంటే గతంలో ఏవైనా లోన్లు తీసుకుని ఉంటే అవి సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా లోన్లు ఎంత ఉన్నాయి ఎప్పటికి క్లోజ్ అవుతాయనే వివరాలు పరిగణలోకి తీసుకుంటారు. కార్డు జారీలో మీరు పని చేస్తున్న కంపెనీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఎలాంటి కంపెనీలో పనిచేస్తున్నారు? ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? ఆ కంపెనీ స్థాపించి ఎన్నాళ్లయింది? అది స్థిరమైన కంపెనీ యేనా? వంటి అంశాలు కూడా కార్డుల జారీలో బ్యాంకులు దృష్టిలో పెట్టుకుంటాయి.మెరుగైన సిబిల్ ఉంటేనే..కార్డుకు దరఖాస్తు చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్ (దీన్నే సిబిల్ స్కోర్ అని కూడా అంటారు) ఎంతుందో తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు పొందడానికి 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులు. కార్డు దరఖాస్తుకు అవసరమైన పత్రాలన్నీ మీరు అప్లై చేసే బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు(Payslips) సమర్పించాలి. దీంతోపాటు ఫోటో ఐడీ, అడ్రస్ ప్రూఫ్, బ్యాంకు స్టేట్మెంట్ తదితర డాక్యుమెంట్లను ఇవ్వాలి. నేరుగా బ్యాంకులోగానీ ఆన్లైన్ ద్వారాగానీ దరఖాస్తు సమర్పించవచ్చు. ఆయా బ్యాంకులు లేదా కార్డు జారీ చేసే సంస్థల నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకు లేదా సంస్థ మీరిచ్చిన పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి మీ అర్హతను బట్టి కార్డు జారీ చేస్తుంది.ఇదీ చదవండి: త్వరలో టీజీ రెరా యాప్..ఇష్టారాజ్యంగా వాడితే అంతే..కార్డు చేతికొచ్చాక మీరు దాన్ని సరిగా వాడుకుంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. అలాకాక చేతిలో కార్డు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడితే అదే మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. కార్డు బిల్లు వచ్చాక చాలామంది సాధారణంగా ఒక పొరపాటు చేస్తూంటారు. కనీస మొత్తం చెల్లిస్తూ గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల బాకీ ఎప్పటికీ తీరకపోగా తీసుకున్న మొత్తానికి మించి చెల్లిస్తారు. కట్టేది తక్కువేకదా అనే భ్రమ కలిగించేలా ఉన్న ఈ మినిమం పేమెంట్ ఊబిలో పడితే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఉదా: ఒక వ్యక్తికి రూ.1 లక్ష విలువ చేసే క్రెడిట్ కార్డు వచ్చింది అనుకుందాం. అతను తన అవసరాల కోసం రూ.25,000 కార్డు నుంచి వాడేశాడు. దాని మీద అతను నెలకు కట్టాల్సిన కనీస మొత్తం రూ.1,250 మాత్రమే. కట్టేది తక్కువేగా అని ఆ మొత్తమే కట్టుకుంటూ పోతాడు. దీనివల్ల 6 నెలలు గడిచినా అతను అప్పటికి రూ.7,500 కట్టి ఉన్నా తీరేది అతి స్వల్ప మొత్తమే. ప్రతి నెలా చార్జీలు జత కలుస్తూనే ఉంటాయి. కార్డు వాడేవాళ్లలో నూటికి 95 మంది చేసే తప్పే ఇది.ఏం చేయాలంటే.. క్రెడిట్ కార్డు పేమెంట్ బిల్లు డేట్ జనరేట్ అయిన తర్వాత మళ్లీ బిల్లు వచ్చి దాన్ని చెల్లించేందుకు 45 రోజుల వడ్డీ రహిత సదుపాయం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని మొత్తం బాకీ ఒకేసారి తీర్చేసి మళ్లీ కార్డును వాడుకుంటే మీకు వడ్డీల భారం తగ్గుతుంది. మీరు కట్టాల్సిన మొత్తం తీరిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ రికార్డూ పదిలంగా ఉంటుంది. సంస్థకు లేదా సంబంధిత బ్యాంకుకు మీపై విశ్వాసం పెరిగి మీ లిమిట్ మొత్తాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. అర్ధమయింది కదా క్రెడిట్ కార్డును మీరు ఎలా వాడుతున్నారన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. సద్వినియోగం చేసుకుంటే లబ్ది పొందుతారు. లేదంటే మునిగిపోతారు. ఆలోచించుకుని అడుగేయండి.-బెహరా శ్రీనివాస రావు,పర్సనల్ ఫైనాన్స్ విశ్లేషకులు -
క్రెడిట్ కార్డు యూజర్లకు అలెర్ట్
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.అసలేం జరిగిందంటే..క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్సీడీఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్సీడీఆర్సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులుఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి. -
క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మరిన్ని బ్యాంకుల్లో బీబీపీఎస్
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రధాన క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్లు ఈ యాప్‌ల ద్వారా చెల్లింపులను సులభతరం చేయడానికి తమ సిస్టమ్‌లను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)కి లింక్ చేశారు.జూలై 1 నుంచి అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను బీబీపీఎస్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ఆర్బీఐ గతంలో ఆదేశించింది. అయితే, అనేక బ్యాంకులు ఇప్పటికీ థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం బీబీపీఎస్‌ని ప్రారంభించలేదు.ఇప్పటివరకు, 15 బ్యాంకులు బీబీపీఎస్‌లో బిల్లు చెల్లింపును యాక్టివేట్ చేశాయి. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం 34 బ్యాంకులకు క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి అనుమతి ఉండగా వీటిలో జూలై 15 వరకు బీబీపీఎస్‌లో 15 బ్యాంకులు చేరాయి.బీబీపీఎస్‌కి లింక్ అయిన బ్యాంకులు ఇవే..» ఐసీఐసీఐ బ్యాంక్» ఏయూ బ్యాంక్» బ్యాంక్ ఆఫ్ బరోడా» కెనరా బ్యాంక్» ఫెడరల్ బ్యాంక్» హెచ్డీఎఫ్సీ బ్యాంక్» ఐడీబీఐ బ్యాంక్» ఐడీఎఫ్సీ బ్యాంక్» ఇండియన్ బ్యాంక్» ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్» కోటక్ మహీంద్రా బ్యాంక్» పంజాబ్ నేషనల్ బ్యాంక్» సరస్వత్ సహకరి బ్యాంక్» ఎస్బీఐ కార్డ్» యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఏంటీ బీబీపీఎస్?భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) అనేది బిల్లు చెల్లింపుల సమగ్ర వ్యవస్థ. ఇది వినియోగదారులకు ఆన్లైన్ బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. ఇది అన్ని బిల్లు చెల్లింపుల కోసం ఒక-స్టాప్ సొల్యూషన్. ఇది దేశం అంతటా వినియోగదారులందరికీ భద్రతతో కూడిన ఇంటర్ఆపరబుల్, సులభతరమైన, ఎప్పుడైనా, ఎక్కడైనా బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది. -
అన్ సెక్యూర్డ్ రుణాలకే ఎక్కువ డిమాండ్
ముంబై: క్రెడిట్ కార్డులపై వసూలు కాని రుణాలు (ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి మార్చి నాటికి 2.94 శాతానికి చేరాయి. క్రెడిట్‌కార్డ్, వ్యక్తిగత రుణాల వాటా వేగంగా పెరుగుతున్నట్టు క్రెడిట్ సమాచార కంపెనీ ‘ట్రాన్స్‌యూనియన్ సిబిల్’ తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. రక్షణలేని రుణాలు పెరిగిపోతుండడంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో సిబిల్ నివేదిక విడుదల కావడం గమనార్హం. మూడు నెలలకు మించి చెల్లింపులు లేని రుణాలను ఎన్పీఏలుగా పరిగణిస్తుంటారు. ఇలా క్రెడిట్ కార్డులపై మూడు నెలలకు పైగా చెల్లింపులు చేయని రుణాల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 0.66 శాతం పెరిగినట్టు, వ్యక్తిగత రుణాల్లో ఎన్పీఏలు 0.04 శాతం పెరిగి 0.94 శాతంగా ఉన్నట్టు సిబిల్ తెలిపింది. ఇక క్రెడిట్ కార్డ్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం పెరగ్గా, వ్యక్తిగత రుణాలు సైతం 29 శాతం వృద్ధిని చూసినట్టు పేర్కొంది. ప్రాపర్టీపై ఇచ్చే రుణాలు (ఎల్ఏపీ) 38 శాతం పెరిగి అత్యంత వేగంగా వృద్ధి చెందిన రిటైల్ రుణ విభాగంగా ఉన్నట్టు వివరించింది. సాధారణంగా చిన్న వ్యాపార సంస్థలు తమ స్వల్పకాల నిధుల అవసరాల కోసం ప్రాపర్టీపై రుణాలను తీసుకుంటూ ఉంటాయి. గృహ రుణాలపై రేట్ల ప్రభావం గృహ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 14 శాతమే వృద్ధి చెందాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ఈ విభాగంలో రుణాల వృద్ధి తక్కువగా నమోదైంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది జనవరి–మార్చి మూడు నెలల కాలాన్ని పరిశీలించినట్టయితే విలువ పరంగా ఫ్లాట్‌గా ఉంటే, సంఖ్యా పరంగా 11 శాతం తగ్గినట్టు సిబిల్ నివేదిక స్పష్టం చేసింది. ప్రాపర్టీ రేట్లతోపాటు, గృహ రుణాలపైనా రేట్లు పెరగడం ఈ పరిస్థితికి కారణంగా పేర్కొంది. ఆస్తుల నాణ్యతపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, కొత్త కస్టమర్లకు (అప్పటి వరకు రుణం తీసుకోని వారు) రుణాల విషయంలో రుణదాతలు దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో అలాంటి కొత్త కస్టమర్లకు జారీ చేసిన రుణాల వాటా 16 శాతంగానే ఉందని, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 19 శాతంగా ఉన్నట్టు వివరించింది. -
క్రెడిట్ స్కోరు పెంచుకోవాలా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
ప్రస్తుత రోజుల్లో అవసరాల కోసం ప్రజలు రుణాలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. అయితే బ్యాంకులు ఈ విషయంలో ముఖ్యంగా క్రెడిట్ స్కోరును పరిశీలిస్తాయి. అయితే, రుణం తీసుకోవాలనుకున్న చాలామంది ఈ క్రెడిట్ స్కోర్ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. కార్డు బిల్లులను సరైన సమయానికి చెల్లించకపోయినా, క్రెడిట్ కార్డు పరిమితిని ఎక్కువసార్లు గరిష్ఠంగా వాడుకున్నా.. ఇలాంటి పనులు మన క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. దీని ద్వారా లోన్లు రాకపోగా ఒక్కోసారి తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే మీ క్రెడిట్ స్కోరు పెంచుకోవాలంటే ఈ విషయాలు తెలుసుకోవడం ఉత్తమం. పాత కార్డులతో ఇలా స్కోరు పెంచుకోవచ్చు.. మీరు పాత క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తుంటే, మీ బిల్లులను పూర్తిగా సమయానికి చెల్లిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ దీర్ఘకాలంగా కొనసాగిస్తూ ఉండాలి. దీని ద్వారా చాలం కాలంగా వాడుకలో కార్డ్ ఉండడం, దీంతో పాటు సమయానికి చెల్లింపులు కారణంగా అది మీకు మెరుగైన క్రెడిట్ స్కోరును అందిస్తుంది. అందుకే క్తొత కార్డ్‌ల కంటే పాత కార్డులతో స్కోరును సులభంగా పెంచుకోవచ్చు. పరిమితికి మించి వాడకండి మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి కూడా మీ క్రెడిట్ స్కోర్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కస్టమర్లకు కేటాయించిన పరిమితి ప్రకారం క్రెడిట్ కార్డు వినియోగం ఉండాలి. ఈ క్రమంలో కార్డ్ వాడకం లిమిట్ దాటకుండా చూసుకోవాలి. అది మీ క్రెడిట్ స్కోర్‌కు పెంచుతుంది. కానీ కార్డులో ఉన్న మొత్తం నగదుని ఉపయోగించడంతో ద్వారా క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. లోన్ తీసుకుంటే.. ఇలా చేయండి రుణం తీసుకున్నప్పుడు, తిరిగి చెల్లింపు కోసం కాల వ్యవధిని ఎక్కువ ఉండేలా చూసుకోండి. దీంతో మీ ఈఎంఐ(EMI) చెల్లింపు నగదు తక్కువగా ఉంటుంది. తద్వారా మీరు సమయానికి చెల్లింపులు చేసే వీలు ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది. రుణ విచారణల్లో జాగ్రత్త మీరు బ్యాంకుల్లో లోన్ల కోసం ప్రయత్నిస్తే, అవి మీ ప్రొఫైల్ గురించి క్రెడిట్ స్కోరు అందించే సంస్థల వద్ద విచారణలు మొదలుపెడతాయి. ఇక్కడ గమనించాల్సి విషయం ఏంటంటే.. కొందరు అవసరం లేకపోయినా ఎక్కువ క్రెడిట్ కార్డులు లేదా వివిధ బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నిస్తుంటారు. అది క్రెడిట్ స్కోరుపై రుణాత్మక ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఎక్కువ సార్లు రుణ విచారణలు చేసినా, అది కూడా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొన్నిసార్లు రుణదరఖాస్తు తిరస్కరణకు గరవుతుంటాయి. ఇది మీరు క్రెడిట్ స్కోరు మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. చదవండి: యూకే నూతన ప్రధానిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు -
క్రెడిట్ కార్డ్ పేమెంట్ కష్టంగా మారిందా, అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
క్రెడిట్ కార్డ్... దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కార్డు ఉంది కదా అని ఇష్టానుసారంగా ఉపయోగిస్తే మాత్రం చివరకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని గురించి పూర్తిగా తెలియక కొందరు కార్డ్‌లో లిమిట్ ఉందని వాడుతూ తిరిగి చెల్లించే సమయంలో నానాఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కరోనా మహమ్మారి దెబ్బతో ఉద్యోగాల కోత, చెల్లించని బిల్లులు, క్లియర్ కాని ఈఎంఐ(EMI)ల ఫలితంగా లక్షలాది మంది వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. చెల్లించని క్రెడిట్ కార్డ్ బిల్లుల కారణంగా.. ఆలస్యంగా కట్టడంతో ఫైన్లు, వడ్డీ రేట్లు పెరగడం వంటివి ఆర్థికంగా నష్టపరచడమే గాక మీ క్రెడిట్ స్కోర్‌కు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఆ సమయంలో వీటిని పాటించడం ద్వారా మీ భారం నుంచి కాస్త రిలీఫ్ పొందచ్చని నిపుణుల చెబుతున్నారు. 1. మినిమం బ్యాలెన్స్ చెల్లించడం క్రెడిట్ కార్డులోని మొత్తం రుణాన్ని చెల్లించకపోయినా, మినిమం బ్యాలెన్స్ నగదుని చెల్లించండి. దీని ద్వారా మీ క్రెడిట్ కార్డ్‌ని ఆపరేట్ చేసుకోవడంతో పాటు మీపై పడే వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాని వల్ల భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టంగా మారడంతో పాటు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీస చెల్లింపును కూడా చేయకుంటే, అదనంగా లేట్ ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. 2. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా రుణ భారం నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. క్రెడిట్ కార్డు ఔట్ స్టాండింగ్ అమౌంట్ ఎక్కువగా ఉంటే.. దాన్ని చెల్లించేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు బిల్లు డేంజరస్ లెవెల్‌కు చేరే ప్రమాదం కూడా ఉంది. అటువంటి పరిస్ధితులు రాకముందే దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో అదే బ్యాలెన్స్‌తో కొత్త క్రెడిట్ కార్డ్ పొందుతారు, అది కూడా తక్కువ వడ్డీ రేటు. కొత్త కార్డ్ కావడంతో సంస్థలు ఇచ్చే బెనిఫిట్స్‌తో పాటు చెల్లించేందుకు కాస్త సమయం దొరుకుతుంది. 3. పర్సనల్ లోన్‌గా మార్చుకోండి మీ క్రెడిట్ కార్డ్ బిల్లుల భారంగా మారి వాటిని సకాలంలో చెల్లించడం కుదరుని పక్షంలో పర్సనల్ లోన్ తీసుకుని వాటిని చెల్లించే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌లతో పోలిస్తే వ్యక్తిగత రుణాలు తక్కువ వడ్డీ రేటుతో మనకు లభిస్తాయి. పైగా క్రెడిట్ కార్డ్‌లా అధిక వడ్డీల భారం ఇందులో ఉండదు. వీటితో పాటు ఈఎంఐ( EMI) ఆఫ్షన్ కూడా ఉంటుంది. 4 మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించకపోవడం మంచిది రుణభారాన్ని మోస్తున్న కస్టమర్లు, ఆ బిల్లులు చెల్లించకుండానే మరిన్ని కొనుగోళ్లు చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్‌లో బిల్లు కొండంత అవుతుంది. దాంతో అది మీ మొత్తం బకాయిపై వడ్డీ పడుతుంది, అది భారీ మొత్తంలో ఉంటుందని గుర్తించుకోవాలి. అందుకే క్రెడిట్ కార్డ్‌ని ఇష్టానుసారంగా కాకుండా క్రమపద్ధతిలో ఉపయోగించడం, అన్ని బకాయిలను క్లియర్ చేసుకుని, మళ్లీ ఉపయోగించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: సామాన్యుడికి బిగ్ రిలీఫ్.. హమ్మయ్యా, రెండేళ్ల తర్వాత వాటి ధరలు తగ్గాయ్! -
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!
ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచినట్లు పేర్కొంది. ఇందులో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు ఫిబ్రవరి 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. క్రెడిట్ కార్డుల చార్జీల పెంపు గురించి సందేశాలను వినియోగదారులకు పంపినట్లు తెలిపింది. ఇక నుంచి క్రెడిట్ కార్డు వినియోగించి ఏటీఎం కేంద్రాల వద్ద నగదు తీసినా, ఆలస్యంగా బిల్లులు చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ఫిబ్రవరి 10, 2022 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులు నగదు అడ్వాన్స్ లావాదేవీల మీద ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చెక్ రిటర్న్ అయినా, ఆటో డెబిట్ ఫెయిల్ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు. రూ.50వేలు పైన ఎంత మొత్తమైనా గరిష్టంగా రూ.1200 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చార్జీలతో పాటు అదనంగా మరో రూ.50+ జీఎస్టీ చెల్లించాలని ఐసీఐసీఐ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. అయితే, సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలూ ఉండవు. ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తే ఈఎమ్ఐ మార్చుకోవడం లేదా రుణం తీసుకొని చెల్లిస్తే మంచిది అని నిపుణులు అంటున్నారు. (చదవండి: లగ్జరీ గృహాలకు ఫుల్ డిమాండ్! కారణాలు ఇవే..!) -
అసలు ఇతను కపిల్ దేవేనా.. ఎంతలా మారిపోయాడో చూడండి..!
Kapil Dev Channels Ranveer Singh In Hilarious Advertisement: క్రికెట్ దిగ్గజం, భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన యోధుడు, లెజండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ మైదానంలో ఎంత సౌమ్యంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి తన సహజ స్వభావానికి విరుద్ధంగా వెక్కిలి చేష్టలు చేస్తూ, రంగురంగుల దుస్తుల్లో.. భిన్నంగా కనిపించాడు. ఇదంతా చేసింది నిజ జీవితంలో అనుకుంటే పొరపాటే. ప్రముఖ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు యాప్ 'క్రెడ్' ప్రకటన కోసం కపిల్ ఇలా నటించాడు. ఈ యాడ్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్‌ని అనుకరిస్తూ.. కపిల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. Heads, I'm fashionable. Tails, I'm still fashionable. pic.twitter.com/vyKIrmLLOD — Kapil Dev (@therealkapildev) October 15, 2021 క్రికెట్ మైదానంలో ధగధగ మెరిసే దుస్తులు ధరించి, ప్రత్యర్థులను స్లెడ్జింగ్ చేస్తూ.. సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తన సహజత్వానికి భిన్నంగా కపిల్ ఇలా దర్శనమివ్వడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. కపిల్ ఇలా కూడా ఉంటాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా వంటి ప్రముఖులు గతంలో ఈ యాడ్‌లో సందడి చేశారు. ఇదిలా ఉంటే, కపిల్ దేవ్ టీమిండియాకు 1983 వన్డే ప్రపంచకప్‌ను అందించిన వైనాన్ని ఆధారంగా చేసుకుని.. రణ్వీర్ సింగ్ హీరోగా 83 సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో కపిల్ పాత్రలో రణ్వీర్ ఒదిగిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు రివర్స్‌గా కపిల్ కూడా రణ్వీర్ను అనుకరించేందుకు ఈ యాడ్‌లో నటించినట్లు సమాచారం. ఈ వీడియోను కపిల్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'నేను ఎంతో ఫ్యాషన్‌గా ఉన్నాను. ఇప్పటికీ నేను ఫ్యాషన్‌గా ఉన్నాను' అంటూ క్యాప్షన్ కూడా జోడించాడు. చదవండి: రేపటి నుంచే మరో మహా క్రికెట్ సంగ్రామం.. -
ఐపీఎల్లో తళ్లుక్కున మెరిసిన నీరజ్ చోప్రా.. ! ఎక్కడంటే..?
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రపుటల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా నీరజ్ దూసుకుపోయాడు. అదే స్థాయిలో నీరజ్‌చోప్రా సోషల్‌మీడియా వాల్యూయేషన్ ఏకంగా రూ. 428 కోట్లకు పెరిగిందని ప్రముఖ రీసెర్చ్ కన్సెల్టెన్సీ యూగోవ్ వెల్లడించింది. బంగారు పతకం సాధించిన ఒక్కరోజులోనే అతని సోషల్‌మీడియా అకౌంట్లకు గణనీయంగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. పలు కంపెనీలు తమ కంపెనీలకు నీరజ్‌ను బ్రాండింగ్ చేయడం కోసం క్యూ కట్టాయి. చదవండి: ప్రముఖ క్రికెటర్లను దాటేసిన నీరజ్ చోప్రా..! తాజాగా నీరజ్‌చోప్రా ఐపీఎల్-14 యాడ్స్‌లో తళ్లుక్కున మెరిశాడు. 23 ఏళ్ల జావెలిన్ త్రోయర్ నీరజ్ ప్రముఖ ఇండియన్ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ రూపొందించిన యాడ్స్‌లో కన్పించాడు. ఈ యాడ్‌లో భాగంగా నీరజ్ చోప్రా.. రిపోర్టర్‌గా, మార్కెటింగ్ మెనేజర్, బ్యాంక్ ఉద్యోగి, స్పోర్ట్ పర్సన్, డైరక్టర్‌గా వివిధ పాత్రల్లో కన్పించాడు. ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో క్రెడ్ ‘గ్రేట్ ఫర్ ది గుడ్ క్యాంపెయిన్’ పేరిట ఈ యాడ్‌ను రూపొందించింది. క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడం కోసం క్రెడ్ ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాగా ఈ యాడ్‌ను చూసిన నెటిజన్లు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలోనే కాదు..యాక్టింగ్‌లో కూడా గోల్డ్ మెడల్ కొట్టేశావని నెటిజన్లు పేర్కొన్కారు. గతంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ అనిల్ కపూర్, మధూరి దిక్షిత్, గోవిందా, బప్పి లహరీ, ఉదిత్ నారాయణ, అల్కా యగ్నిక్తో కలిసి యాడ్స్‌ను క్రెడ్ రూపోందించింది. కొన్ని రోజుల క్రితం ఎప్పుడు కూల్‌గా ఉంటే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌ను ‘ఇందిరానగర్ కా గుండా’ రూపంలో యాడ్‌ను రూపొందించింది. క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా మాట్లాడుతూ...ఐపీఎల్‌తో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. బాధ్యదాయుతమైనా ఆర్థిక ప్రవర్తను ప్రజల్లో తీసుకరావడానికి క్రెడ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చదవండి: నీరజ్ చోప్రా సోషల్‌మీడియా వాల్యుయేషన్ ఏకంగా రూ. 428 కోట్లు..! -
మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయలేకపోతున్నారా?!
ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్థిక మాంద్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఉద్యోగాలు కోల్పోయి, బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మాత్రం చేతిలో సమయానికి డబ్బులున్నా వాటిని ఏ విధంగా చెల్లిస్తే ఆర్ధిక సమస్యల నుంచి బయటపడొచ్చో తెలుసుకోలేకపోతున్నారు. క్రెడిట్ కార్డ్‌ల విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ క్రెడిట్ కార్డ్ ఉచ్చునుంచి సురక్షితంగా ఉండొచ్చు. ఈఎంఐ సౌకర్యం ఉంది : మనం ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే నిర్ణీత సమయంలో పే చేయాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్‌లు విధించే 30 నుంచి 40శాతం వడ్డీలపై వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. పైగా వడ్డీ పడకుండా చెల్లించే నిర్ణీత గడువును కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే పెద్ద మొత్తంలో ఈఎంఐ చెల్లించే వారికి కొన్ని బ్యాంక్‌లు ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తుంటాయి. ఆ సదుపాయాన్ని వినియోగించుకుంటే అధిక వడ్డీ నుంచి సురక్షితంగా ఉండొచ్చు. విపత్కర పరిస్థితుల నుంచి సులభంగా బయటపడొచ్చు. అప్పులన్నీ ఒకేసారి తీరుస్తున్నారా: ఉన్న అప్పులన్నీ ఒకే సారి తీర్చాలని నానా కష్టాలు పడుతుంటారు. అలా కాకుండా అప్పు ఎంత ఉన్నా భాగాలుగా విభజించి చిన్న మొత్తంలో చెల్లిస్తే కొన్ని నెలలకు, లేదంటే సంవత్సరాలకు ఆ ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కూడా అంతే . ఉదాహరణకు బ్యాంక్ ఇచ్చిన తేదీకి క్రెడిట్ కార్డ్ బిల్లు రూ. 50 వేలు చెల్లించాలి. మీ దగ్గర అంత డబ్బు లేదని నానా హైరానా పడుతుంటారు. కుటుంబసభ్యుల్నో,స్నేహితుల్నో అడిగి క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేస్తుంటారు. అలా కాకుండా ఉన్న రూ.50వేల మొత్తాన్ని 10నెలల పాటు నెలకు రూ.5 వేలు కట్టుకుంటే మీపై భారం తగ్గిపోతుంది. అందుకోసం బ్యాంక్ అధికారుల్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. బ్యాంక్‌ను బట్టి ఈఎంఐ అమౌంట్, గడువు ఉంటుంది. ఈఎంఐ గా మార్చుకోండి : అవసరం ఉందని క్రెడిట్ కార్డ్ తీసుకునేముందు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. క్రెడిట్ కార్డ్‌లపై బ్యాంక్‌లు విధించిన పరిమితి దాటినప్పుడు ఈఎంఐ మార్చుకునే అవకాశం ఉందా? లేదా?అని తెలుసుకోవాలి. మ్యాక్సిమం అన్ని బ్యాంకులు ఈఎంఐ సదుపాయాన్ని ఇస్తాయి. కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రస్ట్ గురించి ఆరాతీయండి. పొరపాటున క్రెడిట్ కార్డ్ బిల్లు మీ పరిధి దాటితే ఈఎంఐగా మార్చుకోవచ్చు. వేరే బ్యాంక్ నుంచి పే చేయండి : మీరు రెండు మూడు క్రెడిట్ కార్డ్‌లు వాడుతుంటే ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్లును మరో బ్యాంక్ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ బిల్లును ఈఎమ్ఐగా మార్చుకునేందుకు ప్రస్తుతం ఉన్న కార్డు జారీదారులు నిరాకరించినా, ఇందుకోసం ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేసినా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ముందే తెలుసుకోండి : నెల వారీ పరిధి దాటి చెల్లించే క్రెడిట్ కార్డులకు 23 నుంచి 49 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే ఉన్న మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకొని చెల్లిస్తే ఇంట్రస్ట్ తక్కువ పడుతుంది. నిర్ణీత సమయంలో క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయండి లేదంటే మీరు క్రెడిట్ కార్డ్‌పై చెల్లించే వడ్డీ రేటు, ఇతర బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించే వడ్డీ రేట్లు ఎంత ఉంటాయో తెలుసుకోవాలి. ఆ తరువాతనే పే చేయండి. -
ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు..
న్యూఢిల్లీ: 'ద వాల్'గా సుపరిచితుడైన టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్వతాహాగా మృదు స్వభావి అయిన విషయం అందరికీ తెలిసిందే. మైదానంలో అతను ఎంత శాంతంగా ఉంటాడో యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లారా చూసింది. అరివీర భయంకరమైన బౌలర్లను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా అతను ఎంతో ఓర్పు, సహనం ప్రదర్శించి శాంతికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా వ్యవహరించాడు. అయితే ఈ మిస్టర్ కూల్‌కు కూడా ఓ సందర్భంలో విపరీతమైన కోపం వచ్చింది. అది చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా చాలా మంది క్రికెటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. Never seen this side of Rahul bhai 🤯🤣 pic.twitter.com/4W93p0Gk7m — Virat Kohli (@imVkohli) April 9, 2021 ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదని, అతనిలోని ఈ యాంగిల్‌ను చూసి అవాక్కయ్యానని కోహ్లి ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. కాగా, ద్రవిడ్‌కు అంతలా కోపం తెప్పించిన ఘటన ఏమైవుంటుందని ఆలోచిస్తున్నారా. ఒక్క నిమిషం ఆగండి. ఇదంతా ఓ యాడ్(CRED) కోసం ద్రవిడ్ చేసిన యాక్టింగ్ మాత్రమే. ఈ యాడ్‌లో నటుడు జిమ్ షరబ్ మాట్లాడుతూ.. క్రెడ్లో క్రెడిట్ కార్డు బిల్ కడితే... క్రెడ్ కాయిన్స్ వస్తాయని, వాటితో క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డులు పొందొచ్చని చెప్తాడు. వినడానికి ఇది హాస్యాస్పదంగా ఉందని, రాహుల్ ద్రవిడ్‌ను ముక్కోపి అన్న చందంగా ఉందని ఆయన అంటాడు. ఆతరువాత ద్రవిడ్ ఫ్రేమ్‌లోకి వస్తాడు. కోపంతో ఊగిపోతూ కనిపించే అతను.. ఇతరులపై గట్టిగా అరుస్తూ, బ్యాట్‌తో కారు అద్దాలు పగలగొడుతూ కనిపిస్తాడు. అంతటితో ఆగకుండా నేను ఇందిరానగర్ గూండాను అంటూ హల్చల్ చేస్తాడు. ద్రవిడ్ విశ్వరూపానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిస్టర్ కూల్‌ను ఇంతకోపంగా ఎప్పుడూ చూడలేదని క్రికెటర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. -
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇది చదవండి
సత్వర నిధులకు అందుబాటులో ఉన్న పలు మార్గాల్లో క్రెడిట్ కార్డ్‌లూ ఒకటి. వినియోగించే విధానం తెలిస్తే క్రెడిట్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిల్లు తేదీ, చెల్లించేందుకు ఉన్న వడ్డీ రహిత గడువు, ఈఎంఐ ఆప్షన్, వడ్డీ రేట్లు, ఆలస్య రుసుములు.. ఇలా ప్రతీ ఒక్కటీ తెలిస్తే నెలవారీ బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలను వినియోగదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎలాంటి వడ్డీని వసూలు చేయవు. గడువు తేదీ తర్వాత చెల్లిస్తే మాత్రం అధిక వడ్డీ రేట్లు, అదనపు ఫీజులు వసూలు చేస్తాయి. కనుక కుదిరితే క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించటమే ఉత్తమం. పెద్ద మొత్తంలోని బకాయిలను చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఈఎంఐ విధానాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డును మెరుగ్గా నిర్వహించే మార్గాలను చూద్దాం.. ఈఎంఐ ఆప్షన్.. నిర్ణీత గడువు తేదీలోపు చెల్లించని క్రెడిట్ కార్డ్ బకాయిల మీద క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి 23 నుంచి 49 శాతం వరకు వడ్డీ కింద కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. దీంతో పాటు తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే ఆలస్య రుసుము కింద రూ.1,300 వరకు కంపెనీలు వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, ఈ తర్వాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ రహిత కాల వ్యవధిని రద్దు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించకపోతే మీ రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు.. బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఒక మార్గం. క్రెడిట్ కార్డ్ తిరిగి చెల్లింపుల కాల వ్యవధి (ఈఎంఐ) సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉంటుంది. అది కూడా క్రెడిట్ కార్డ్ వినియోగం, జారీ చేసిన కంపెనీని బట్టి మారుతుంటుంది. నో కాస్ట్ ఈఎంఐతో లాభమే.. ‘నో కాస్ట్ ఈఎంఐ’.. ‘రూపాయి చెల్లించి నచ్చిన ఉత్పత్తిని ఇంటికి తీసుకెళ్లండి.. ఆ తర్వాత ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ చెల్లించండి’ అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్ ఈఎంఐ ఆప్షన్లో ఒక రకమే నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్. ఇందులో ఈఎంఐ మీద వడ్డీని వర్తకులు లేదా తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మీద వడ్డీ భారం పడకపోయినా.. ఆ వడ్డీపై 18% జీఎస్టీని క్రెడిట్ కార్డ్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆఫర్లు.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ పోర్టళ్లు క్రెడిట్ కార్డ్‌ల కొనుగోళ్లపై ఈఎంఐలను ఆఫర్ చేస్తాయి. తయారీదారులు/వ్యాపారుల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా.. ఈఎంఐ వడ్డీ రేట్లు, కాల వ్యవధులు నిర్ణయించడం జరుగుతుంది. ఆఫర్లలో భాగంగా ఆయా సంస్థలు ప్రకటించే ఈఎంఐ వడ్డీ రేట్లు.. క్రెడిట్ కార్డ్ బకాయిలను ఈఎంఐగా మార్చుకునే వడ్డీ రేట్లతో పోలిస్తే తక్కువగానే ఉండ డం ఆకర్షణీయం. అందుకే భారీ కొనుగోళ్లకు ముందుగా.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ కంపెనీల ఈఎంఐ ఆఫర్లను తనిఖీ చేయాలి. పైగా ఈ ఆఫర్లకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. క్రెడిట్ కార్డులపై రుణాలు.. మంచి సిబిల్ స్కోర్, చెల్లింపుల చరిత్ర ఉన్న వారు క్రెడిట్ కార్డులపై రుణాలనూ తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న రుణం మేరకు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. తిరిగి చెల్లించిన తర్వాత మళ్లీ ఆ పరిమితిని అందుబాటులోకి తెస్తారు. రుణాల రీపేమెంట్ కాల వ్యవధి 6 నుంచి 60 నెలలుగా ఉంటుంది. వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డులపై రుణాల జారీ వేగంగా ఉంటుంది. వీటి వడ్డీ రేట్లు పర్సనల్ లోన్స్ కంటే ఎక్కువ ఉండవని పైసాబజార్.కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా తెలిపారు. -
క్రెడిట్ కార్డుతో ఆ ఫోన్ కొన్నారా? అయితే జాగ్రత్త!
సాక్షి, ముంబై: వన్ ప్లస్ యూజర్లకు క్రెడిట్ కార్డ్ షాక్ తగిలింది. క్రెడిట్ కార్డ్ ద్వారా వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులు హ్యాకింగ్ బారిన పడ్డారు. గత నాలుగు నెలల కాలంలో ఇలాంటి పలు అక్రమ లావాదేవీలు నమోదు అయ్యాయి. దీంతో వన్‌ప్లస్ కస్టమర్లు లబోదిబోమంటున్నారు. తమ క్రెడిట్ ద్వారా అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయంటూ వన్‌ప్లస్ వెబ్సైట్ ద్వారా మొబైల్ కొనుగోలు చేసిన క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 70మందికిపైగా కస్టమర్లు దీనిపై సంస్థకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఒకరు తరువాత ఒకరు ఈ మోసం పై ఫిర్యాదు చేయడంతో స్పందించిన సంస్థ తక్షణమే విచారణ చేపట్టినట్టు బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. ప్రత్యక్షంగా తమ వెబ్సైట్ద్వారా (పేపాల్ లాంటి మూడవ పార్టీతో సంబంధం లేకుండా) జరిగిన అక్రమ లావాదేవీల అంశాన్ని సీరియస్‌గా పరిగణించినట్టు పేర్కొంది. తమ సైట్‌ను కస్టమ్ కోడ్‌తో పునర్నిర్మాణం చేస్తున్నామని వెల్లడించింది. -
బ్యాంకులకు 3,800 కోట్ల ‘డిజిటల్’ దెబ్బ!
ముంబై: కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తుండటంతో ఆ ప్రభావం బ్యాంకులపై ప్రతికూలంగా పడుతోంది. పీవోఎస్ మెషీన్ల ద్వారా జరిగే ఆన్లైన్ కార్డ్ పేమెంట్స్ వల్ల బ్యాంకులకు వార్షికంగా రూ.3,800 కోట్లు నష్టం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆన్లైన్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో బ్యాంకులు పీవోఎస్ టర్మినల్స్ సంఖ్యను రెట్టింపు చేశాయి. 2016 మార్చిలో 13.8 లక్షలుగా ఉన్న పీవోఎస్ మెషీన్ల సంఖ్య 2017 జూలై నాటికి 28.4 లక్షలకు పెరిగింది. బ్యాంకులు సగటున రోజుకు 5,000 పీవోఎస్ మెషీన్ల చొప్పున ఏర్పాటు చేశాయి. దీంతో డెబిట్ ప్లస్ క్రెడిట్ కార్డుల లావాదేవీలు బాగా పెరిగాయి. పీవోఎస్ల వద్ద జరిగే ‘ఆఫ్– అజ్’ కార్డు లావాదేవీల విషయంలో వార్షికంగా రూ.4,700 కోట్లు నష్టం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. అదే పీవోఎస్ల వద్ద జరిగే ‘ఆన్–అజ్’ కార్డు ట్రాన్సాక్షన్ల ఆదాయం రూ.900 కోట్లుగా ఉండొచ్చని తెలిపింది. దీనివల్ల బ్యాంకులకు వార్షికంగా నికరంగా రూ.3,800 కోట్లు నష్టం వాటిల్లవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు)1 శాతంగా, క్రెడిట్ కార్డుల లావాదేవీలపై వేర్వేరుగా ఉంటుంది. ఎండీఆర్, కార్డును తక్కువగా వినియోగించడం, నాణ్యతలేని టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యాపారులకు రాయితీలు అందించకపోవడం, నగదు వాడకం వల్ల అయ్యే వ్యయంపై అవగాహన లేకపోవడం వంటి పలు అంశాలు కార్డు బిజినెస్‌ను ప్రభావితం చేస్తాయని నివేదిక పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించడానికి నాణ్యమైన టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమని తెలిపింది. అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ప్రత్యేకమైన స్పెక్ట్రమ్ అవసరమని అభిప్రాయపడింది. -
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు... వాయిదా రూట్లో వెళితే జాగ్రత్త!!
కిషోర్, సురేష్... ఇద్దరూ మంచి స్నేహితులు. సహోద్యోగులు కూడా. కాకపోతే ఖర్చుల విషయంలో ఇద్దరూ భిన్నధ్రువాలు. కిషోర్ కాస్తంత పొదుపరి. అవసరమైన ఖర్చులు మాత్రమే పెడతాడు. సురేష్ అలాకాదు. ముందూ వెనకా చూడకుండా ఖర్చు చేసేసి... తరవాత తీరిగ్గా బాధపడతాడు. ఇద్దరికీ క్రెడిట్ కార్డులున్నాయి. కార్డు చెల్లింపుల్లోనూ ఇద్దరివీ రెండుదారులు. కిషోర్ ప్రతినెలా తను ఖర్చు చేసిన మొత్తం బిల్లును గడువు తేదీ లోపల ఠంచనుగా చెల్లించేస్తుంటాడు. సురేష్ మాత్రం కాస్త పెద్ద బిల్లుల్ని ఈఎంఐ కింద మార్చేసు కుంటూ ఉంటాడు. ఇలా చేయటం వల్ల కార్డు తీసుకుని రెండేళ్లు తిరిగేసరికి కిషోర్ ఎప్పట్లానే ఉన్నా... సురేష్‌కు మాత్రం ఈఎంఐ పెరిగి పోయింది. ప్రతినెలా వాడే బిల్లు... దానికితోడు అప్పటికే చెల్లించాల్సిన ఈఎంఐలు... ఇవన్నీ కలిసి భారమయ్యాయి. అసలు సురేష్‌లా చెయ్యటం మంచిదేనా? ఇలా క్రెడిట్ కార్డు బిల్లుల్ని ఈఎంఐలుగా మార్చుకోవటం లాభమా? నష్టమా? వడ్డీ తక్కువే ఉంటుంది కనక లాభమనుకోవచ్చా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం చెల్లించ గలిగితే ఒకేసారి చెల్లించటమే బెటర్ # ఆ సామర్థ్యం లేనప్పుడే ఈఎంఐ మార్గం # ఎంచుకునే ముందు వడ్డీ, గడువు చూడాల్సిందే # వీలైనంత తక్కువ గడువు ఎంచుకుంటే బెటర్ # గడువు పెరిగే కొద్దీ వడ్డీ కూడా ఎగువ ముఖమే # ఈఎంఐ అవకాశం కూడా కొందరికే ఇస్తున్న బ్యాంకులు # దీనిక్కూడా కస్టమర్ల క్రెడిట్ హిస్టరీనే ఆధారం క్రెడిట్ కార్డు కస్టమర్లు బిల్లు మొత్తం ఒకేసారి కట్టకుండా ఈఎంఐ పద్ధతిలో చెల్లించేలా వారిని ప్రోత్సహించటం బ్యాంకుల వ్యాపారం. కార్డు స్వైప్ చేసిన ప్రతిసారీ... కావాలంటే ఈ బిల్లును మీరు ఈఎంఐలోకి మార్చుకోవచ్చని సూచిస్తూ కస్టమర్లకు ఓ ఎస్ఎంఎస్ రావటం అందరికీ తెలిసిందే. కాకపోతే మరీ చిన్నచిన్న బిల్లుల్ని కాకుండా... కాస్త పెద్ద మొత్తంలో బిల్లులకే బ్యాంకులు ఈ ఆఫర్ ఇస్తుంటాయి. ఈ మొత్తం బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. ఈ మధ్య పలు బ్యాంకులు ఈ మొత్తాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఎస్బీఐ ప్రస్తుతం రూ.2,500 బిల్లును కూడా ఈఎంఐకి మార్చుకునే అవకాశమిస్తోంది. ఒకరకంగా ఇది కస్టమర్లకు, బ్యాంకులకు ఇద్దరికీ మంచిదే. గడువు తేదీలోపు మొత్తం బిల్లు కట్టలేని కస్టమర్లకు ఇలా మార్చుకోవటం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంకులకు కూడా డిఫాల్ట్‌లు తగ్గి అదనపు వడ్డీ వస్తుంటుంది. కాకపోతే ఈ అవకాశాన్ని ఆచితూచి వాడుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘బిల్లును ఒకేసారి కట్టలేని సందర్భాల్లో మాత్రమే ఈఎంఐ ఎంచుకోవాలి. లేకపోతే ఇది భారంగా మారుతుంది’’ అనేది వారి సూచన. ఈ రెండూ గుర్తుంచుకోండి... ‘‘ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేటపుడు ప్రధానంగా ఎన్ని నెలల్లో చెల్లించాలి? వడ్డీ రేటెంత? అనే రెండు అంశాలూ తెలుసుకోవాలి. ఎందుకంటే వడ్డీ రేటు స్థిరంగా ఉండేది కాదు. కస్టమర్‌ను బట్టి, బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఒకే కస్టమర్‌కు ఒకోసారి 14 శాతం వడ్డీకే ఈఎంఐ మార్గాన్ని ఎంచుకోవటానికి ఛాన్సిచ్చే బ్యాంకులు... ఒకోసారి అంతకన్నా ఎక్కువ వడ్డీరేటు వేస్తుంటాయి. అందుకని చూసి ఎంచుకోవాలి’’ అని ఎస్బీఐ కార్డ్స్ సీఈఓ విజయ్ జసుజ చెప్పారు. చెల్లించని మొత్తంపై వడ్డీ మిగులుతుంది... మామూలుగా కూడా క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. కనీస బిల్లుగా పేర్కొనే మొత్తాన్ని చెల్లిస్తే చాలు. ఇది సహజంగా వాడినదాంట్లో 5 శాతంగా ఉంటుంది. కాకపోతే మిగిలిపోయే మొత్తంపై 30-40 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈఎంఐ మార్గాన్ని ఎంచుకుంటే... వడ్డీ రేటు పర్సనల్ లోన్ కన్నా కాస్త ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వడ్డీ మిగులుతున్నట్టే కదా!!. పెపైచ్చు పర్సనల్ లోన్ మాదిరి డాక్యుమెంట్లు సమర్పించటం వంటి తతంగం ఉండదు. వడ్డీ రేటెంత? మామూలుగా ఈఎంఐ మొత్తంపై 12-20 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. చెల్లించాల్సిన గడువు కూడా మూడు నెలల నుంచి కొన్ని సందర్భాల్లో మూడేళ్ల వరకూ కూడా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం ఎంచుకుంటే ఎక్కువ వడ్డీ పడుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. మీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి... సాధ్యమైనంత వరకు తక్కువ గడువును ఎంచుకుంటే మంచిదన్నది నిపుణుల సూచన. ఈఎంఐ మార్గం వల్ల మరో ప్రయోజనమేంటంటే డీల్స్, ప్రమోషన్ల ఖర్చును ఆయా వస్తువుల తయారీ కంపెనీలు భరిస్తాయి. దీంతో వడ్డీ మరికాస్త తగ్గుతుంది. ఈఎంఐ పనిచేసేదిలా... ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.50వేలు. మీరు ఓ నెలలో ఒకే లావాదేవీలో రూ.15వేల బిల్లు చేశారు. దాన్ని మీరు వడ్డీతో కలిపి ఆరు నెలల పాటు నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాలనుకున్నారు. తదుపరి బిల్లింగ్ గడువు వచ్చేసరికి మీ క్రెడిట్ లిమిట్ రూ.35వేలే ఉంటుంది. కాకపోతే ఒక వాయిదా చెల్లించాక దాన్లో వడ్డీపోను అసలుగా ఎంత చెల్లించారో అది మీ లిమిట్‌కు కలుస్తుంది. ఆ తరవాత మీ లావాదేవీల బిల్లు ఎప్పటికప్పుడు కట్టాల్సిందే. క్రెడిట్ లిమిట్ దాటడానికి కూడా వీలుండదు. ఒకవేళ దాటితే లావాదేవీ చెల్లకపోవచ్చు. కొన్ని బ్యాంకులు ఒకోసారి అనుమతిస్తాయి కానీ... ఓవర్ లిమిట్ ఛార్జీలు బాగానే వడ్డిస్తాయి. నిజానికి ఈఎంఐ ఆప్షన్ అన్ని బ్యాంకుల దగ్గరా ఉంటుంది. కాకపోతే అందరు కస్టమర్లకూ ఇవ్వరు. వారి క్రెడిట్ హిస్టరీ చూసి... కస్టమర్‌ను బట్టి బ్యాంకులు ఈ ఆఫర్ ఇస్తుంటాయి. ఒకవేళ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని కూడా గడువులోపు చెల్లించకపోతే మామూలుగా కార్డుపై వడ్డీ రేట్లెంత ఉంటాయో అవే వర్తిస్తాయి. అదనంగా రీపేమెంట్ ఫెయిల్యూర్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.