న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి రిజిస్టర్ అయ్యే అన్ని కొత్త ప్రజా రవాణా వాహనాల్లోనూ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు, ఎమర్జెన్సీ బటన్‌లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆటోలు, ఈ–రిక్షాలకు నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నామనీ, ఇవి కాకుండా మిగిలిన ప్రజా రవాణా వాహనాలన్నింటికీ 2019 జనవరి 1 నుంచే కొత్త నిబంధన అమలవుతుందని వెల్లడించింది. క్యాబ్‌ల వంటి వాహనాల్లో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, ప్రయాణికులు అధికారులకు తెలియజేసేందుకు ఎమర్జెన్సీ బటన్ ఉపయోగపడుతుంది. ఆ వాహనం ఎక్కడుందో గుర్తించేందుకు లొకేషన్ ట్రాకింగ్ పరికరం దోహదపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment