tracking system
-
మన్యంలో మొబైల్ సేవల విస్తరణకు చర్యలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మొబైల్ సేవల విస్తరణకు చర్యలు చేపట్టామని, గిరిజన ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ మరింత పురోభివృద్ధి సాధించినట్లు సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ నిర్వహించిన పీఎం ప్రగతి సమీక్ష వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి సీఎస్ జవహార్‌రెడ్డి బుధవారం పాల్గొన్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టెలికం సర్వీ సుల విస్తరణకు చేపడుతోన్న చర్యల గురించి ప్రధానికి వివరించారు. సీఎస్ మాట్లాడుతూ..టవర్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకు గుర్తించిన అన్ని ప్రాంతాల్లోనూ స్థలాలను మంజూరు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ మల్లికార్జున, అదనపు డీజీపీ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల బోట్లకు ట్రాకింగ్ వ్యవస్థ సముద్రంలో చేపల వేటకు వెళ్లే అన్ని రకాల బోట్లకు ట్రాకింగ్ సిస్టమ్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ తెలిపారు. విశాఖలోని తూర్పు నౌకా దళ ప్రధాన కేంద్రంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్‌తో పాటు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొన్నారు. సముద్ర తీర భద్రత, సరిహద్దులు దాటకుండా మత్స్యకారుల్ని సుశిక్షుతుల్ని చేయడం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి విశాఖలో నిర్వహించనున్న మిలాన్–2024ను విజయవంతం చేసేందుకు అనుసరించాలి్సన వ్యూహాలపై చర్చించారు. -
మీ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్‌ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్‌ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్‌ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్‌కు మెసేజ్ చేస్తే.. సెల్‌ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్‌బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్‌గా వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్‌ఫోన్‌ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్‌కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్‌పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్‌లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్‌ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్‌ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
యాపిల్ వాచ్ కొత్త ఫీచర్ వచ్చేసింది: క్రానిక్ హార్ట్ కండిషన్ ఈజీ ట్రాక్
యాపిల్ వాచ్ భారత వినియోగదారులకు చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గుండెకు స్పందలను సంబంధించిన హిస్టరీని ట్రాక్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లకు అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం భారతీయ ఆపిల్ వాచ్ వినియోగదారులు కూడా ఇప్పుడు ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. AFib అనేది క్రానిక్ హార్ట్ కండిషన్‌ను సూచిస్తుంది. ఇది ఒక రకమైన అరిథ్మియా. గుండె దడ , వేగంగా, క్రమరహితంగా కొట్టుకోవడం. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకుండా, సరియైన చికిత్స తీసుకోకుండా ఉంటే మాత్రం గుండె ఆగిపోవడానికి లేదా స్ట్రోక్ సంభవించే క్లాట్స్‌కు దారితీస్తుంది. అయితే దీనికి సరియైన మందులువాడే వ్యక్తులు ఆరోగ్య కరమైన, చురుకైన జీవితాలను గడపొచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గుండె-ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన బరువు, ఇతర వైద్య చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. (US H1B visa: భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త) ఎవరికి పనిచేస్తుంది? ♦ యాపిల్‌వాచ్ 4, తర్వాత వాచ్ ఏఓస్ 9లోని వినియోగదారులకు ఈ ఫీచర్ పని చేస్తుంది. ♦ భారతదేశంలోని వాచ్ యూజర్లు ఐఫోన్లో ఐఓఎస్ 16ని ఉపయోగించాలి ♦ AFib హిస్టరీ ఖచ్చితంగా 22 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అని యాపిల్ సపోర్ట్ పేజీ స్పష్టంచేసింది. ఇదీ చదవండి : శ్రావణం అలా వచ్చిందో లేదో,రూ. 60వేల ఎగువకు బంగారం ఈ ఫీచర్‌ను ఎలా వాడాలి? ♦ ఐఫోన్లో హెల్త్యాప్ ఓపెన్ చేసి, బ్రౌజ్ క్లిక్ చేసి హార్ట్ ఆప్షన్నుఎంచుకోవాలి ♦ AFib హిస్టరీ సెట్ చేసిన స్టార్ట్ అప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ మీ పుట్టిన తేదీని నమోదు చేయండి ♦ AFibతో బాధపడుతున్నారని వైద్యుడు నిర్ధారించిన వైనాన్ని ధృవీకరించాలి ♦ తరువాత AFib చరిత్ర, ఫలితాలు , లైఫ్ ఫ్యాక్ట్ గురించి మరింత తెలుసుకునేలా కంటిన్యూపై క్లిక్ చేయాలి. -
TSRTC: ప్యానిక్ బటన్.. సీసీ కెమెరాలు.. అందుబాటులోకి ఆధునిక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ప్యానిక్ బటన్.. ప్రయాణ సమయాల్లో మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని.. తమను కాపాడాలని పోలీసులకు తెలిపేందుకు వినియోగించే సాంకేతిక సాధనం. అలాగే రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల్లో వాహనాలు చిక్కుకున్నప్పుడు సహాయం కోరేందుకు దోహదపడే పరికరం. కేవలం ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా వాహన లైవ్ లొకేషన్‌ను నేరుగా పోలీసులు లేదా సహాయ బృందాలకు తెలియజేయగలగడం దీని ప్రత్యేకత. ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన ఈ సాధనం ఇప్పుడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ పథకంలో భాగంగా మహిళా భద్రత కోసం అన్ని ప్రజారవాణా వాహనాల్లో ప్యానిక్ బటన్లు, వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా కొంటున్న బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీకి చేరిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సంస్థ శనివారం వినియోగంలోకి తెస్తోంది. ఈ బస్సులను అశోక్ లేలాండ్ కంపెనీ రూపొందించింది. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సుల ఆర్డర్ పొందిన ఆ కంపెనీ తాజాగా 50 బస్సులను అందించింది. మిగతావి రోజుకు కొన్ని చొప్పున జనవరి నాటికి పూర్తిగా సరఫరా చేయనుంది. ఈ బటన్ నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందే కమాండ్ కంట్రోల్ రూమ్ బస్‌భవన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాగానే బస్సుల్లోని ప్యానిక్ బటన్‌తో ఆ వ్యవస్థ అనుసంధానమై పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి బస్సులో రెండు వీడియో కెమెరాలు.. బస్సుల్లో అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కారణాలను గుర్తించే వీలు ప్రస్తుతం లేదు. కొత్తగా వచ్చే బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవర్ కేబిన్ వద్ద ఉండే ఓ సీసీ కెమెరా.. బస్సులోకి ఎక్కే ప్రయాణికులను గుర్తిస్తుంది. డ్రైవర్ వెనుక భాగంలో ఉండే మరో కెమెరా బస్సు చివరి వరకు లోపలి భాగాన్ని చిత్రిస్తుంది. ఈ రెండు కెమెరాలు చిత్రించిన వీడియో ఫీడ్ 15 రోజుల వరకు నిక్షిప్తమవుతుంది. ఇక బస్సును రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొత్త బస్సుల్లో రివర్స్ కెమెరాలను బిగించారు. బస్సు వెనుకవైపు ఉండే కెమెరా రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు వెనుక ప్రాంతాన్ని చూపుతుంది. త్వరలో బస్సు ట్రాకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బస్సులో ఉండనున్నాయి. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం కూడా ఏర్పాటు చేశారు. మోతాదుకు మించి వేడి ఉత్పన్నమైనా లేక పొగ వచ్చినా ఈ వ్యవస్థ గుర్తించి అలారం మోగిస్తుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించేందుకు వీలవుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల తరచూ బస్సుల్లో చోటు చేసుకొనే అగ్రిప్రమాదాలను ముందే గుర్తించి ప్రయాణికులకు ప్రాణాపాయాన్ని తప్పించేందుకు ఈ అలారంతో అవకాశం కలుగుతుంది. అలాగే ఈ బస్సుల్లో సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రెండ్రోజుల క్రితం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ప్రకటించినప్పటికీ సీఎం ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రవాణాశాఖ మంత్రి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం 1,016 కొత్త బస్సులకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో 630 సూపర్ లగ్జరీ బస్సులు, 370 డీలక్స్/ఎక్స్‌ప్రెస్ బస్సులు, 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. త్వరలో 130 డీలక్స్ బస్సులు కూడా అందనున్నాయి. శబరిమల.. సంక్రాంతి స్పెషల్‌గా సేవలు.. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప భక్తుల కోసం దాదాపు 200 బస్సులు బుక్ అయ్యాయి. మరిన్ని బుక్ కానున్నాయి. శబరిమల దూర ప్రాంతమైనందున వీలైనంత వరకు కొత్త బస్సులు కేటాయించనున్నారు. ఇప్పుడు అందుతున్న సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని అందుకు వినియోగించనున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దూర ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కొత్త బస్సుల్లో కొన్నింటిని అందుకు కేటాయించనున్నారు. (క్లిక్ చేయండి: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం) -
కొంపముంచుతున్న ఎయిర్ ట్యాగ్స్, యాపిల్‌పై మహిళల పరువు నష్టం దావా!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌పై ఇద్దరు మహిళలు పై పరువునష్టం దావా వేశారు. యాపిల్ సంస్థకు చెందిన ఎయిర్‌పాడ్ డివైజ్ సాయంతో వారి మాజీ భాగస్వాములు తమను సులభంగా గుర్తు పట్టేస్తున్నారని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టుకు ఇద్దరు మహిళలు ‘క్లాస్’ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో యాపిల్ సంస్థ ఏప్రిల్ 2021లో స్టాకర్ ఫ్రూఫ్ అనే డివైజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ డివైజ్ ముఖ్య ఉద్దేశం.. యాపిల్‌కు చెందిన ఎయిర్ ట్యాగ్ సాయంతో అనుమానాస్పద వ్యక్తులు.. మహిళలు లేదంటే, వారికి కావాల్సిన వారిని గుర్తించకుండా సంరక్షిస్తుంది. కానీ అదే విషయంలో యాపిల్ సంస్థ తమని మోసం చేసిందని, తాము ఎక్కడున్నా ఎయిర్ ట్యాగ్‌తో మాజీ ప్రియులు సులభంగా గుర్తిస్తున్నట్లు కోర్టుముందు వాపోయారు. ఈ సందర్భంగా పిటిషనర్లు.. కొందరు వ్యక్తులు నేరపూరిత లేదా హానికరమైన ప్రయోజనాల కోసం ఎయిర్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారని... ఈ సంవత్సరం అక్రోన్, ఒహియో, ఇండియానాపోలిస్ ప్రాంతాల మహిళల హత్యలకు ఈ యాపిల్ ప్రొడక్ట్‌లకు సంబంధం ఉందని చెప్పారు. నష్టపరిహారం చెల్లించాల్సిందే మహిళ దాఖలు వ్యాజ్యంలో ఎయిర్‌ట్యాగ్ ద్వారా ట్రాక్ చేసిన ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు యాపిల్ నష్ట పరిహారం చెల్లించాలని, లేదంటే సంస్థ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఎయిర్ ట్యాగ్స్ దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చిందంటూ గతంలో యాపిల్ చేసిన వ్యాఖ్యల్ని కోర్టు ఎదుట హైలెట్ చేశారు. మరి ఈ కేసు విషయంపై యాపిల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? బాధిత మహిళలకు నష్టపరిహారం చెల్లిస్తుందా? లేదా? అని తెలియాల్సి ఉంది. -
విమానంలో క్వీన్ మృతదేహాన్ని మోసుకెళ్లి....
లండన్: బ్రిటన్‌ని సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్ సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్ధం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లోని రాణి అధికారిక నివాసం రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. తదనంతరం విమానంలో లండన్‌కి తరలిస్తారు. ఇది ఆమె చివరి ఫ్లైట్ జర్నీగా చెప్పవచ్చు. ఈ మేరకు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్24 ద్వారా బోయింగ్ సీ17 విమానంలో ఆమె భౌతిక దేహాన్ని తీసుకువెళ్తున్న చివరి ప్రయాణాన్ని అత్యధిక మంది ఆన్లైన్లో ప్రత్యక్షంగా వీక్షించారు. అంతేకాదు ఎడిన్బర్గ్ విమానాశ్రయంలో బోయింగ్ సీ17ఏ ఎగరడానికి సిద్ధంగా ఉన్న మొదటి నిమిషంలోనే సుమారు 6 మిలియన్ల మంది విమానాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించారు. బోక్ అర్గోనాట్ అటలాంటాలో క్వీన్‌గా ఆమె తొలి ఫైట్ ప్రయాణానికి 70 సంవత్సరాల తర్వాత క్వీన్ ఎలిజబెత్ 2 చివరి విమానమే చరిత్రలో అత్యధికాంగా ట్రాక్ చేయబడిన విమానం. అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ వివాదాస్పద పర్యటనను ఫ్లైట్ రాడార్24 వెబ్సైట్లో ట్రాక్ చేసిన దానికంటే రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ల ఎక్కువ అని పేర్కొంది. 📊 Flight tracking statistics regarding the final flight of Queen Elizabeth II In the minute after the transponder of C-17 ZZ177 activated, an unprecedented 6 million people attempted to follow the flight. This unfortunately impacted the stability of our platform. pic.twitter.com/VBB7vOhk3A — Flightradar24 (@flightradar24) September 13, 2022 (చదవండి: ఎలిజబెత్ కోట బయట ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చిన మేఘన్) -
మొబైల్ సిగ్నల్ ట్రాకింగ్‌తో.. నిండు ప్రాణాన్ని నిలబెట్టారు!
ఒంగోలు: రైలు పట్టాలపై యువకుడు పడుకుని ఉన్నాడు.. దూరంగా రైలు కూత వినిపిస్తోంది.. రైలు మరింత దగ్గరికొచ్చినట్టుగా శబ్దం వినిపిస్తోంది.. యువకుడు మాత్రం అలానే పడుకుని ఉన్నాడు. మరికొద్ది క్షణాలు ఆలస్యమైతే యువకుడి తల తెగిపడేదే. కానీ అంతలోనే అద్భుతం జరిగింది. పోలీసులు వచ్చి యువకుడిని పక్కకు లాగేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనతో అక్కడి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. జె.పంగులూరు మండలం తూర్పుకొప్పెరపాడుకు చెందిన కలవ కిషోర్‌కు రెండేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగింది. కృత్రిమ కాలుతో జీవనం సాగిస్తున్నాడు. కాలు విరిగినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయి బంధువులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. బంధువుల ద్వారా ఆ సమాచారం అందుకున్న జె.పంగులూరు ఎస్ఐ శ్రీనివాసరావు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మలికా గర్గ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ.. ఐటీ కోర్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కిషోర్ మొబైల్ లొకేషన్‌ను గుర్తించారు. వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై కిషోర్ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. వెంటనే వేటపాలెం ఎస్ఐ కమలాకర్‌కు ఎస్పీ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఎస్ఐ.. రైల్వే ట్రాక్‌పై ఉన్న కిషోర్‌ను పక్కకు లాగేశారు. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ ట్రాక్ మీదుగా రైలు వెళ్లింది. పోలీసులు వెళ్లడం ఆ రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే కిషోర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీస్ సిబ్బందిని నగదు రివార్డులతో ఎస్పీ సత్కరించారు. -
పోలీసుల స్పందనతో 693 మందికి ఊపిరి
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర పోలీసులు సకాలంలో.. వేగంగా స్పందించి 693 మందికి ఊపిరి అందేలా చేశారు. విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో ఆక్సిజన్ విభాగంలో చికిత్స పొందుతున్న 693 మందికి ముప్పు తప్పించారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ను వేగంగా రప్పించి వారిని ఆదుకున్నారు. ఈ ఆస్పత్రికి 18 టన్నుల ఆక్సిజన్‌తో ఒడిశాలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ట్యాంకర్‌కు గురువారం అర్ధరాత్రి దాటాక ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. ట్యాంకర్ సకాలంలో రాకపోతే ఆస్పత్రిలోని 693 మందికి ప్రాణాపాయమని కలవరపడిన వైద్యులు.. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఒడిశా నుంచి విజయవాడ వరకు అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఒడిశా నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని ధర్మవరం వద్ద ఓ దాబాలో ఉన్నట్టు ఆ జిల్లా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఎందుకు ఆపేశావని ట్యాంకర్ డ్రైవర్‌ను ప్రశ్నించారు. తాను బయలుదేరిన చోటునుంచి విజయవాడ దాదాపు 878 కిలోమీటర్ల దూరం ఉందని, ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం వల్ల తీవ్రంగా అలసిపోయి ఆపినట్లు డ్రైవర్ తెలిపారు. అరక్షణం ఆలస్యం చేయకుండా మెరుపువేగంతో స్పందించిన పోలీసులు డ్రైవింగ్ అనుభవం ఉన్న హోంగార్డుతో ట్యాంకర్‌ను అక్కడి నుంచి విజయవాడకు పంపించారు. ఆ ట్యాంకర్ సకాలంలో విజయవాడ చేరుకునేలా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ట్యాంకర్ విజయవాడ చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి ఆక్సిజన్ ట్యాంకర్ వేగంగా వచ్చేలా చేసి వందలమంది ప్రాణాలు కాపాడిన పోలీసులకు సెల్యూట్ చేస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. రాష్ట్ర పోలీసులు కోవిడ్ ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్ అందేలా గ్రీన్ చానల్ ఏర్పాటు, ఎస్కార్ట్ వంటి సేవల్ని అందిస్తున్నారని అభినందించారు. -
పులి వచ్చిందా.. అయితే పట్టేయొచ్చు..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల ట్రాకింగ్‌కు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) శాస్త్రవేత్తలు రూపొందించారు.కోవిడ్ –19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యా ప్తంగా పలుప్రాంతాల్లో అడవుల్లోంచి వన్యప్రాణులు, జంతువులు రోడ్లపైకి, జనావాసాలకు దగ్గరగా వస్తున్న విషయం తెలిసిందే.ఎక్కడికక్కడ వాటిని ట్రాక్ చేయడంతో పాటు, వాటి ఆనుపానులు తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.అదేవిధంగా దేశంలోని వివి ధ రాష్ట్రాల్లో మనుషులు,జంతువులు తారసపడుతున్న ప్రాంతాలు, అక్కడున్న పరిస్థితులను తెలుసుకునేందుకు అవసరమైన ము ఖ్యమైన సమాచారాన్ని దీని ద్వారా పొందవచ్చునంటున్నారు ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘లాక్డౌన్ వైల్డ్‌లైఫ్ ట్రాకర్’ను వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) రూపొందించింది. దేశవ్యాప్తంగా అడవులు, దగ్గర్లలోని గ్రామా లు, పట్టణాల్లో ఎక్కడెక్కడ ఏ రకమైన వ న్యప్రాణులు, జంతువులు కనిపించాయో రికార్డ్ చేసేందుకు వీలుగా ఇందులో టూ ల్స్‌ను వినియోగిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇక్కడ పులి కనిపించింది, అక్కడ ఏనుగులు రోడ్లపైకి వచ్చాయి, మరోచోట చిరుతపులి ఊళ్లోకి వచ్చింది అంటూ వస్తు న్న వార్తలు, వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న కథనాలు, ఫోటోలు కేవలం ఆ మేరకే పరిమితం కాకుండా, దీనికి సంబంధించిన డేటాను సమీకృతంగా సేకరించి వన్యప్రాణులకు చెందిన ఆసక్తికరమైన సమాచారాన్ని నమోదు చేయొచ్చనే ఆలోచనతో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు ఈ యాప్‌ను రూపొందించారు. ఎప్పుడైనా రికార్డు చేయవచ్చు... పట్టణప్రాంతాలతో పాటు మనుషులు ఎక్కువగా లేని చోట్లకు జంతువులు కూడా వస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తమకు కనిపించిన వాటి గురించి ఈ యాప్ ద్వారా తెలియజేయొచ్చని ఈ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ మోహన్ తెలిపారు. వన్యప్రాణులు కనిపిస్తే అదే సమయంలో లేకుంటే ఆ తర్వాతైనా తెలియజేయొచ్చని, వాటి ఫొటోలను అప్లోడ్ చేయొచ్చని డబ్ల్యూఐఐ సీనియర్ సైంటిస్ట్ డా.బిలాల్ హబీబ్ తెలిపారు. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, దీనిద్వారా తమకు కనిపించిన జంతువు ల చిత్రాలను ఎక్కడినుంచైనా, ఏ సమయం లోనైనా రికార్డ్ చేసి పంపొచ్చునని తెలియజేశారు.ఈ రికార్డింగ్‌లను సులభంగా చేయడంతో పాటు జీపీఎస్ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు.ఈ సమాచారం, ఫొటోలను సంబంధిత రాష్ట్రాల అటవీశాఖలకు పంపించి, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణను చేపట్టేందుకు వీలవుతుందని మోహన్ వెల్లడించారు. -
వచ్చే నెలలో మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: దొంగతనానికి గురైన లేదా పోయిన మొబైల్ ఫోన్స్ ఆనవాళ్లు పట్టుకునేందుకు ఉపయోగపడే ట్రాకింగ్ విధానాన్ని ఆగస్టులో అందుబాటులోకి తేవాలని టెలికం శాఖ యోచిస్తోంది. మొబైల్ ఫోన్ నుంచి సిమ్ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చేసినా కూడా ట్రాకింగ్ చేయగలిగేంత శక్తివంతంగా ఈ విధానం ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ–డాట్) ఇప్పటికే ఈ టెక్నాలజీని సిద్ధం చేసిందని, ఆగస్టు నుంచి సర్వీసులు ప్రారంభం కావొచ్చని ఆయన వివరించారు. ప్రస్తుత పార్లమెంటు సెషన్ ముగిశాక .. సేవల ఆవిష్కరణ కోసం మంత్రితో టెలికం శాఖ చర్చించనుందని పేర్కొన్నారు. నకిలీ హ్యాండ్సెట్స్, మొబైల్ దొంగతనాల సమస్యను అరికట్టేందుకు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పేరిట ఏర్పాటైన మొబైల్ ఫోన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 15 కోట్లు కేటాయించింది. పనిచేసేదిలా.. సిమ్ కార్డు తీసేసినా, ఐఎంఈఐ నంబరును మార్చినా కూడా చోరీకి గురైనా లేదా పోయిన ఫోను ఇతరత్రా ఏ నెట్‌వర్క్‌పైనా పనిచేయకుండా చేయగలిగేలా సీఈఐఆర్ టెక్నాలజీ ఉంటుంది. అన్ని మొబైల్ ఆపరేటర్ల ఐఎంఈఐ డేటాబేస్‌ను ఇది అనుసంధానిస్తుంది. ఒకరకంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న మొబైల్ టెర్మినల్స్ వివరాలను నెట్వర్క్ ఆపరేటర్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఒక కేంద్రీయ వ్యవస్థలా పనిచేస్తుంది. తద్వారా ఒక నెట్వర్క్ సేవలు అందిస్తున్న మొబైల్ ఫోన్స్ ఒకవేళ చోరీకి గురైన పక్షంలో .. మిగతా టెల్కోలు కూడా ఆ మొబైల్‌కు టెలికం సేవలు అందకుండా ఆపివేయొచ్చు. దీనిపై పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్రలో నిర్వహించారు. -
ఇక ట్రాకింగ్, ఎమర్జెన్సీ బటన్లు తప్పనిసరి
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి రిజిస్టర్ అయ్యే అన్ని కొత్త ప్రజా రవాణా వాహనాల్లోనూ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు, ఎమర్జెన్సీ బటన్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆటోలు, ఈ–రిక్షాలకు నిబంధన నుంచి సడలింపు ఇస్తున్నామనీ, ఇవి కాకుండా మిగిలిన ప్రజా రవాణా వాహనాలన్నింటికీ 2019 జనవరి 1 నుంచే కొత్త నిబంధన అమలవుతుందని వెల్లడించింది. క్యాబ్‌ల వంటి వాహనాల్లో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, ప్రయాణికులు అధికారులకు తెలియజేసేందుకు ఎమర్జెన్సీ బటన్ ఉపయోగపడుతుంది. ఆ వాహనం ఎక్కడుందో గుర్తించేందుకు లొకేషన్ ట్రాకింగ్ పరికరం దోహదపడుతుంది. -
పిడుగు నుంచి కాపాడిన యాప్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో పడుతున్న పిడుగుల కారణంగా 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత మంగళవారం ఒక్క రోజే ఏపీలో 41,025 పిడుగులు పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. మిన్ను విరిగి మనమీదే పడ్డట్టుగా ఉరుములు.. పిడుగులు.. భయానక వాతావరణాన్ని సృష్టించినప్పటికి మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి ఓ మొబైల్ యాప్ కారణం అంటున్నారు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఇస్రో అధికారుల సహాయంతో లైటెనింగ్ ట్రాకర్ సిస్టమ్ యాప్‌ని రూపొందించారు. విద్యుదయస్కాంత తరంగాలను విశ్లేషించడం ద్వారా ఉరుములు, పిడుగులు ఏ ప్రాంతాల్లో పడతాయో ముందే గుర్తించగలుగుతారు. ఎవరైతే ఈ యాప్‌ని వినియోగిస్తున్నారో వారికి 45 నిమిషాల ముందుగానే సరిగా ఏ ప్రాంతంలో పిడుగులు పడుతాయో సమాచారం అందుతుంది. వాతావరణ నిపుణుడు కెటీ కృష్ణ మాట్లాడుతూ.. కేవలం లైటింగ్ ట్రాకింగ్ యాప్ సహాయంతో చాలా మంది ప్రాణాలు రక్షించగలిగామని తెలిపారు. ఈ యాప్ సహాయంతో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తరపున 20.14 లక్షల మంది మొబైల్ వినియోగదారులకి ఊరుములు, పిడుగులకు సంబంధించిన ముందస్తు సమాచారం అందజేశామని తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ సాఫ్ట్‌వేర్‌ని(వజ్రపథ్) వినియోగించామన్నారు. ప్రస్తుతానికి ఇది కేవలం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని దీనిని ఇతర మొబైల్ సర్వీస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
అదృశ్యం
జిల్లాలో ఏటా పెరుగుతున్న మిస్సింగ్ కేసులు తప్పిపోతున్న వారిలో మహిళలే అధికం మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో అదృశ్య కేసులు.. అక్రమ రవాణా సాధారణమైపోయాయి. నిత్యం ప్రతి పోలీసుస్టేషన్లో ఒకటి లేదా రెండు అదృశ్యం కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా మహిళలు, అమ్మాయిలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో గతేడాది 45అదృశ్యం కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జూలై వరకే 39 కేసులు నమోదయినట్లు రికార్డు ప్రకారం తెలస్తోంది. ఇందులో కొంతమంది మతిస్థిమితం లేక, మరికొందరు ఆరోగ్య సమస్యలుతో, ఇంకొందరు ఇతర కారణాల వల్ల కన్పించకుండా పోతున్నారు. వీరిలో చాలామంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 18ఏళ్లకు పైన ఉన్నవారు మూడేళ్లలో 963మంది అదృశ్యమయ్యారు. అందులో 259మంది ఆచూకీ లభ్యం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ‘ఉపాధి’ పేరుతో గల్ఫ్ దేశాలకు చేస్తున్న అక్రమ రవాణాకు అంతే లేదు. అభం శుభం తెలియని అమాయకులకు గాలం వేస్తూ కొందరు నకిలీ ఏజెంట్లు వారి వద్ద వేలకువేలు డబ్బులు వసూళ్లు చేసి ఉపాధి చూపుతామని గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు. మూడు, నాలుగేళ్లు కుటుంబాలకు దూరంగా ఉండైనా గల్ఫ్‌లో కష్టపడి నాలుగురాళ్లు సంపాదిద్దామని వెళ్లిన అమాయకులు చాలామంది దోపిడీకి గురవుతున్నారు.అరబ్ దేశాలకు వెళ్లి అక్కడ అదృశ్యమైపోతున్నారు. నకిలీ ఏజెంట్ల చేతిలో జిల్లావ్యాప్తంగా ఏడాదికి సుమారుగా రెండు వేలమంది నష్టపోతున్నారు. జిల్లాలో ఎక్కువగా వలస వెళుతున్న వారు మక్తల్, నారాయణపేట, కొడంగల్, గద్వాల నియోజకవర్గాలలో అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో దినసరి కూలీలు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదృశ్యమయ్యారు. ముఖ్యంగా కోయిలకొండ, నవాబ్‌పేట, మద్దూరు మండల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబయి, కర్ణాటక, పుణే తదితర నగరాలకు వెళ్లడంతో పాటు గల్ఫ్‌కు వలస వెళుతున్నారు. ఇలా వెళ్లిన వారిలో చాలా మంది అమాయకులు తప్పిపోతున్నారు. కొంతమంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ‘ఉపాధి’ చూపిస్తామని తీసుకెళ్తున్నారు. వారిలో చాలా మంది వెనక్కి తిరిగి రావడం లేదు. పెరుగుతున్న పెండింగ్ కేసులు.. జిల్లాలో ప్రస్తుతం 74 పోలీసుస్టేషన్లు పని చేస్తున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్‌లో వందల సంఖ్యలో అదృశ్య కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటు కుటుంబసభ్యులు, బంధువులు గాలిస్తుంటే మరోవైపు పోలీసులు వారి కోణంలో గాలిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదు అయిన కేసుల్లో చాలా వరకు అదృశ్యం అయిన వారు కన్పించకపోవడంతో పెండింగ్‌లో ఉండటం విశేషం. అయితే పోలీసులు అదృశ్యం కేసులపై ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం వల్ల రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వారం రోజుల నుంచి కన్పించకుండా పోయిన వారిలో మర్లుకు చెందిన కవిత, బోయపల్లికి చెందిన బుచ్చన్న, మద్దూరు మండలకేంద్రానికి చెందిన సురేష్(13), నవాబ్‌పేటకు చెందిన లక్ష్మి(25), మక్తల్‌కు చెందిన రాణి(18), ఏనుగొండకు చెందిన అప్సర బేగం(29), రామచంద్రాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి(23) ఉన్నారు. చేపట్టాల్సిన చర్యలు.. పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి. అనుమానితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి. రైళ్లు, బస్సులను, ఇతర వాహనాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టాలి. తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్ నంబర్లు గుర్తుండేలా నేర్పించాలి. పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతో పాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించాలి. అదృశ్య కేసు వివరాలు ఏడాది నమోదైనవి ఛేదించినవి 2013 697 221 2014 869 442 2015 798 389 2016 558 267 జిల్లాలో నాలుగేళ్లుగా 2922 మిస్సింగ్ కేసులు నమోదు కాగా, ఇంకా 1603 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013లో 476, 2014లో 427, 2015లో 409, 2016లో (ఇప్పటివరకు) 291 మిస్సింగ్కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా.. జిల్లాలో అదృశ్యం అయిన వారి కోసం ట్రాకింగ్ సిస్టమ్ సాప్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా గాలిస్తున్నాం. ఇతర జిల్లాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపించి, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నాం. అలాగే పోలీస్ శాఖకు ఉన్న ప్రత్యేక గ్రూప్‌లో అదృశ్యమైన వారి ఫొటోలను పొందుపరిచి, ఇతర పోలీస్స్టేషన్లకు సమాచారం ఇస్తున్నాం. తల్లిదండ్రులు కానీ ఇతర కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తులు చేస్తుంటాం. అక్రమంగా తీసుకువెళ్లిన వారు ఎవరైన ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. చాలా వరకు కేసులు పెండింగ్‌లో లేకుండా చేస్తాం. – డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహబూబ్‌నగర్