సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మొబైల్ సేవల విస్తరణకు చర్యలు చేపట్టామని, గిరిజన ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ మరింత పురోభివృద్ధి సాధించినట్లు సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ నిర్వహించిన పీఎం ప్రగతి సమీక్ష వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి సీఎస్ జవహార్‌రెడ్డి బుధవారం పాల్గొన్నారు.
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టెలికం సర్వీ సుల విస్తరణకు చేపడుతోన్న చర్యల గురించి ప్రధానికి వివరించారు. సీఎస్ మాట్లాడుతూ..టవర్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటివరకు గుర్తించిన అన్ని ప్రాంతాల్లోనూ స్థలాలను మంజూరు చేసినట్లు చెప్పారు. కలెక్టర్ మల్లికార్జున, అదనపు డీజీపీ ఆర్‌కే మీనా తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల బోట్లకు ట్రాకింగ్ వ్యవస్థ
సముద్రంలో చేపల వేటకు వెళ్లే అన్ని రకాల బోట్లకు ట్రాకింగ్ సిస్టమ్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్ తెలిపారు. విశాఖలోని తూర్పు నౌకా దళ ప్రధాన కేంద్రంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. సీఎస్‌తో పాటు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పాల్గొన్నారు.
సముద్ర తీర భద్రత, సరిహద్దులు దాటకుండా మత్స్యకారుల్ని సుశిక్షుతుల్ని చేయడం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి విశాఖలో నిర్వహించనున్న మిలాన్–2024ను విజయవంతం చేసేందుకు అనుసరించాలి్సన వ్యూహాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment